cellphone blast
-
ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాతుండగా పేలిన ఫోన్.. వ్యక్తి మృతి..
భోపాల్: ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కాల్స్ మాట్లాడొద్దని నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బాద్నగర్ తహసీల్దార్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. దయారామ్ బరోద్ అనే 68 ఏళ్ల వ్యక్తి ఫోన్ బ్యాటరీ డౌన్ కావడంతో ఛార్జింగ్ పెట్టాడు. అప్పుడే కాల్ వచ్చింది. ఛార్జింగ్ ప్లగ్ తీయకుండా అలాగే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. దీంతో ఫోన్ పేలిపోయింది. పేలుడు ధాటికి దయారామ్కు తల, మొహం, ఛాతీపై తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు సమయంలో దయారామ్ అతని స్నేహితుడు దినేశ్‌తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒకరి అంత్యక్రియలకు హాజరయ్యే విషయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో దయానంద్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. కాల్ సడన్‌గా కట్ కావడంతో దినేశ్ దయారామ్కు మళ్లీ ఫోన్ చేశాడు. కానీ కాల్ కలవలేదు. దీంతో ఏం జరిగి ఉంటుందా అని దగ్గర్లోనే ఉన్న దయారామ్ ఇంటికి వెళ్లిన అతడు షాక్ అయ్యాడు. తీవ్ర గాయాలపాలై దయానంద్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఇతని భార్య మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తున్నట్లు దినేశ్ చెప్పాడు. ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు ఛార్జర్ స్విచ్ బోర్డుకు కనెక్ట్ అయ్యే ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. అయితే అతను ఏ కంపెనీ ఫోన్ ఉపయోగించాడనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడినప్పుడు ఓవర్‌హీట్ వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ రెడ్ మార్క్‌లో ఉన్నప్పుడు ఇలా చేయడం చాలా డేంజర్ అని సూచించారు. చదవండి: హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. ముగ్గురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన యూపీ కోర్టు -
పేలిన సెల్ ఫోన్
గుంటూరు, వి.రెడ్డిపాలెం (రొంపిచర్ల): మండలంలోని వి.రెడ్డిపాలెం గ్రామంలో సెల్ ఫోన్ పేలి మంటలు వచ్చిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఓ చోట అయ్యప్పస్వాములు, శివస్వాములు మధ్యాహ్నం వేళ సామూహిక చద్ది చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వి.హరిబాబు స్వామి సెల్‌ఫోన్‌ను చొక్కా జేబులో పెట్టి, దానిని పక్కనే ఉంచుకొని చద్ది చేస్తున్నాడు. కొద్దిసేపటికే చిన్న పాటి శబ్దం వచ్చింది. చుట్టిన చొక్కాలోనుంచి మంటలు వచ్చాయి. అప్రమత్తమైన ఆ స్వామి చొక్కాను విధిలించటంతో ఫోన్, బ్యాటరీ వేరువేరుగా పడిపోయాయి. మంటలు ఆరిపోయాయి. 60 మంది స్వాముల మధ్యలో సెల్‌ఫోన్ పేలినా ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి..
-
ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు పడి..
శాలిగౌరారం(నల్లగొండ): సెల్ఫోన్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే ప్రమాదం కూడా పొంచివుందనే సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో సెల్‌ఫోన్ పేలి ఓ విద్యార్థి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన యాషబోయిన మల్లేశ్(16) ఇటీవలే పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం గ్రామ శివారులోని నిమ్మతోటకు నీళ్లు కట్టేందుకు తన చెల్లెలుతో కలిసి వెళ్లాడు. వాతావరంణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తుండటంతో.. ఇంటి వద్ద ఉన్న తండ్రి కొడుకుకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పాడు. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో తోట సమీపంలో పిడుగు పడటంతో.. మల్లేశ్ మాట్లాడుతున్న ఫోన్ పేలింది. దీంతో మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందగా అతని చెల్లెలు శిరీష(15)తో పాటు మధు(15) అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు అచేతనంగా పడి ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించి కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.