పేలిన సెల్‌ ఫోన్‌ | Cellphone Blast In Guntur | Sakshi
Sakshi News home page

పేలిన సెల్‌ ఫోన్‌

Published Thu, Oct 25 2018 1:29 PM | Last Updated on Thu, Oct 25 2018 1:29 PM

Cellphone Blast In Guntur - Sakshi

గుంటూరు, వి.రెడ్డిపాలెం (రొంపిచర్ల): మండలంలోని వి.రెడ్డిపాలెం గ్రామంలో సెల్‌ ఫోన్‌ పేలి మంటలు వచ్చిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి  నష్టం జరగలేదు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఓ చోట అయ్యప్పస్వాములు, శివస్వాములు మధ్యాహ్నం వేళ సామూహిక చద్ది చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వి.హరిబాబు స్వామి సెల్‌ఫోన్‌ను చొక్కా జేబులో పెట్టి, దానిని పక్కనే ఉంచుకొని చద్ది చేస్తున్నాడు. 

కొద్దిసేపటికే చిన్న పాటి శబ్దం వచ్చింది.  చుట్టిన చొక్కాలోనుంచి మంటలు వచ్చాయి. అప్రమత్తమైన ఆ స్వామి చొక్కాను విధిలించటంతో ఫోన్, బ్యాటరీ వేరువేరుగా పడిపోయాయి. మంటలు ఆరిపోయాయి. 60 మంది స్వాముల మధ్యలో సెల్‌ఫోన్‌ పేలినా ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement