celltower
-
సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు
సాక్షి, నిజామాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం సెల్‌టవర్ ఎక్కారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఎడవల్లి మండల కేంద్రంలోని ఎంఆర్వో కార్యాలయం వద్ద ఉన్న సెల్‌టవర్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎక్కి తమ నిరసన తెలియజేశారు. కాగా... ట్యాంక్‌బండ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన మంద క్రిష్ణమాదిగను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
ములుగు జిల్లా చేయాలని టవరెక్కి నిరసన
ములుగు : ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మకంటి రమేశ్, బహుజన సమాజ్‌వాదీ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బొట్ల ప్రశాంత్ బుధవారం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో గంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్డీఓ వచ్చి సమస్య పరిష్కరించే వరకు దిగేది లేదని పట్టుబడడంతో ఆయన ఫోన్లో మాట్లాడారు. జిల్లాల విషయంలో పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్‌కు అందించామని, నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత వారు కలెక్టర్‌తో మాట్లాడేంత వరకు దిగేది లేదని చెప్పడంతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ఎస్సై దగ్గు మల్లేశ్‌యాదవ్ అక్కడకి చేరుకుని వారిని కిందికి దిగాలని కోరారు. డిమాండ్లను ఉన్నతాధికారుల ముందు ఉంచుతానని ఎస్సై హామీ ఇవ్వడంతో కిందికి దిగారు. అనంతరం వారిని ఎస్సై స్టేషన్‌కు తరలించారు. కాగా , టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
నందలూరు తహసీల్దార్‌పై వేటు
నందలూరు: వైఎస్సార్ జిల్లా నందలూరు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ ముక్దుల్ బాషా అనే రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో సదరు రైతు గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన పై నివేదిక అందుకున్న కలెక్టర్ సదరు తహసీల్దార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. సంఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామానికి చెందిన సమ్యద్ మక్దుల్ బాషా 5 ఎకరాలకు పైగా ఉన్న భూమిని తన పేరుమీద పట్టాచేయాలని మండల తహశీల్దార్‌ను సంప్రదించాడు. అయితే, ఆ భూమికి పట్టా కోసం రూ. 4లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో దిక్కు తోచని రైతు సెల్ టవర్ ఎక్కి తన తమ్ముడి కుమారుడికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న తమ్ముడి కొడుకు టవర్ దగ్గరకు చేరుకొని 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, సెల్‌టవర్‌పై ఉన్న సమయంలోనే అతనికి గుండెపోటు రావడంతో రైతు అక్కడికక్కడ మృతిచెందాడు.