24న తెరపైకి మెట్రో
ఎట్టకేలకు మెట్రో చిత్రం తెరపైకి రానుంది. తమిళనాడు సెన్సార్‌బోర్డు నిషేధానికి గురై నిర్ణయించిన తేదీల్లో విడుదలకు నోచుకోని చిత్రం మెట్రో. సెన్సార్‌బోర్డు కట్స్‌కు అంగీకరించని చిత్ర దర్శక నిర్మాతలు చివరికి రివైజింగ్ కమిటీ వరకూ వెళ్లి పోరాడి చిత్ర విడుదలకు అనుమతిని పొందారు.అయితే సెన్సార్‌బోర్డు నుంచి తమ చిత్రానికి ఏ సర్టిఫికెట్‌నే పొందగలిగామనే బాధను దర్శక నిర్మాతలు బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోగల ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యక్తం చేశారు. అయితే కట్స్ లేకుండా మెట్రో చిత్రాన్ని విడుదల చేయగలుగుతున్నామని తెలిపారు.
ఇది బంగారం, దొంగతనాల ఇతివృత్తంగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం అన్నారు. దర్శకుడు ఆనంద్‌కృష్ణన్. ఈయన కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన మెట్రో చిత్రాన్ని ఈ 5 ఎంటర్టెయిన్మెంట్, మెట్రో ప్రొడక్షన్స్ సంస్థల అధినేతలు జే.జయక్రిష్ణన్, ఆనంద్‌క్రిష్ణన్ నిర్మించారు.శిరీష్, బాబీసింహా, మాయ, సెండ్రాయన్, సత్య, తులసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జోహాన్ సంగీతాన్ని, ఎస్ఎస్.ఉదయకుమార్ చాయాగ్రహణం అందించారు. మెట్రో చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు.