Centers for Disease Control
-
H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్‌ఫ్లూ ముప్పు!
ప్రపంచమంతటా కోవిడ్–19 మహ మ్మారి సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. లక్షల మంది బలయ్యారు. అలాంటి ప్రాణాంతక మహమ్మారి మరొకటి మానవులకు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్‌లో హెచ్5ఎన్1 అనే వేరియంట్ తొలుత ఆవులకు, తర్వాత ఆవుల నుంచి ఓ కార్మికుడికి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. అతడిని పరీక్షించగా బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 1న ఈ కేసు బయటపడినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) నిర్ధారించింది. బాధితుడి కళ్లు ఎర్రగా మారాయి. బర్డ్‌ఫ్లూ లక్షణాల్లో కండ్ల కలక కూడా ఒకటి. అమెరికాలో మనిíÙకి బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ సోకడం ఇది రెండో కేసు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరస్ సోకినట్లు వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ► అమెరికాలో మనుషులకు సోకిన తొలి బర్డ్‌ఫ్లూ కేసు 2022లో కొలరాడోలో బయటపడింది. ► బర్డ్‌ఫ్లూ వైరస్ గత కొన్ని దశాబ్దాలుగా మహమ్మారుల జాబితాలో తొలి స్థానంలో ఉందని పిట్స్బర్గ్కు చెందిన బర్డ్‌ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేశ్ కూచిపూడి చెప్పారు. ఇది ప్రమాదకరంగా మారుతోందని, మనుషులకు సోకే అవకాశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ► కోవిడ్–19తో పోలిస్తే బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని ఫార్మా ఇండస్ట్రీ కన్సల్టెంట్ జాన్ ఫల్టన్ వెల్లడించారు. ఇందులో మ్యుటేషన్లు(మార్పులు) జరిగితే బాధితుల్లో మరణాల రేటు భారీగా పెరుగుతుందని చెప్పారు. ► నిజానికి ఇతర దేశాల్లోనూ మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకిన సంఘటనలున్నాయి. 2003 జనవరి 1 నుంచి 2024 ఫిబ్రవరి 26 దాకా 23 దేశాల్లో 887 కేసులు బయటపడ్డాయి. వీరిలో 462 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అంటే 52 శాతం మంది మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ► మనుషులు బర్డ్‌ఫ్లూ బారినపడితే శ్వాస ఆడకపోవడం, చలి, అలసట, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులకు యాంటీ వైరల్ ఔషధాలు ఇస్తుంటారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
వృద్ధులకు కరోనా ముప్పు
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మహమ్మారి నుంచి ముప్పు తప్పినట్లేనని ఇన్నాళ్లూ భావించాం. కానీ, తాజాగా అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీఎస్) నిర్వహించిన అధ్యయనంలో టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ వయసు మీద పడిన వారిలో కరోనా ముప్పు అధికంగా ఉంటున్నట్లు తేలింది. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు కరోనా సోకితే వ్యాక్సిన్ తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని ఈ అధ్యయనం వెల్లడించింది. గత ఎనిమిది నెలల్లో రెండు డోసులు తీసుకున్నాక కూడా ఆస్పత్రి పాలైన వారు, లేదంటే ప్రాణాలు కోల్పోయిన వారు 12,908 వరకు ఉన్నారని తెలిపింది. ఆస్పత్రిలో చేరిన వారిలో 70 శాతానికి పైగా మంది 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే. ఇక కరోనాతో మృతి చెందిన వారిలో 87 శాతం మందికి పైగా 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నావారే. సీడీసీ తాజాగా కరోనా కేసుల తీరు తెన్నుల్ని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. -
డెల్టా వేరియంట్ ఆందోళనకరమైంది
వాషింగ్టన్: భారత్‌లో మొట్టమొదటిసారిగా గుర్తించిన కోవిడ్–19 వేరియంట్ ‘డెల్టా’ను ఆందోళనకరమైన వేరియంట్‌గా అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (యూఎస్ సీడీసీ) ప్రకటించింది. అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న బి.1.1.7.(ఆల్ఫా), బి.1.351(బీటా), పి.1(గామా), బి.1.427 (ఎప్సిలన్), బి.1.429(ఎప్సిలన్), బి.1.617.2 (డెల్టా) వేరియంట్లను ఆందోళనకరమైనవిగా గుర్తిస్తున్నాం. అయితే, అత్యంత ప్రభావం చూపే వేరియంట్లను అమెరికాలో ఇప్పటి వరకు గుర్తించలేదు’ అని సీడీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ 5వ తేదీ నాటికి దేశంలో నమోదైన కోవిడ్ కేసుల్లో 9.9% డెల్టా వేరియంట్‌వేనని తెలిపింది. డెల్టా సంక్రమణ వేగం చాలా ఎక్కువనీ, ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానాలు దీనిపై అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయని వివరించింది. డెల్టాను ఆందోళనకర వేరియంట్‌గా మే 10వ తేదీనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా, జూన్ 13వ తేదీ నాటికి అమెరికాలో నమోదైన కేసుల్లో 10.3% డెల్టా వేరియంట్‌వేనని ఔట్‌బ్రేక్ ఇన్ఫో అనే వెబ్సైట్ వెల్లడించింది. వచ్చే నెల రోజుల్లో అమెరికాలోని కోవిడ్ కేసుల్లో అత్యధిక భాగం డెల్టా వేరియంట్‌కు చెందినవే అవుతాయని సీఎన్ఎన్ ఒక కథనంలో హెచ్చరించింది. -
ఈ పని సరిగా చేస్తే వ్యాక్సిన్ వేసుకున్నంత రక్షణ!
సాక్షి, సెంట్రల్ డెస్క్: ఓకే.. వ్యాక్సిన్ల కొరత ఉంది.. అందరికీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు.. మరేం చేద్దాం.. వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా, కొనుగోలు ఇవన్నీ మన చేతిలో లేవు.. మరి మన చేతిలో ఉన్నదానిపైన దృష్టి పెడదామా.. ఎందుకంటే.. ఈ పనిని మనం సరిగా చేస్తే.. దాదాపు వ్యాక్సిన్ వేసుకున్నంత రక్షణ అని అంతర్జాతీయంగా పలు పరిశోధన సంస్థలు అధ్యయనాలు చేసి మరీ తేల్చాయి. ఇంతకీ ఏంటా పని? మాస్కు సరిగా వేసుకోవడం!! సింపుల్. ఆ చాలామంది వేసుకుంటున్నారుగా అని మీరు అనవచ్చు.. ఇక్కడ మేం అన్నది మాస్క్‌ను సరిగా వేసుకోవడం అని.. ఎందుకంటే.. మన దగ్గర మాస్కు ముక్కుకు కాదు..మూతికి అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు కాబట్టి.. మాస్కు వేసుకుంటున్నవారిలో సగం మంది ముక్కు కిందకు దించి వాడుతున్నారు కాబట్టి.. అందుకే మన చేతిలో.. మనం చేయగలిగిన ఈ పనిని సరిగా చేస్తే.. వ్యాక్సిన్ మీ దాకా వచ్చేవరకూ అదే రక్షణ కలి్పస్తుందని అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొంది. అంతేకాదు..ఇటీవల మాస్క్‌ల ధారణ, కొనుగోలుపై మరోమారు మార్గరద్శకాలనూ విడుదల చేసింది.అవేంటో చూద్దామా.. ఎలాంటి మాస్కు తీసుకోవాలి? ♦ ఏది తీసుకున్నా.. అది మలీ్టలేయర్డ్ ఉండేలా చూసుకోండి.. కనీసం మూడు పొరలు ఉండాలి. దగ్గరగా నేసినవై ఉండాలి. మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. డిస్పోజబుల్ మాసు్కలకూ ఇదే వర్తిస్తుంది. ♦ నోస్ వైర్ తప్పనిసరిగా ఉండాలి. మాస్కును కాంతి వస్తున్న వైపు పెట్టినప్పుడు అది దాన్ని నిరోధించేలా ఉండాలి. ఇలాంటివి వద్దు ♦ చాలామంది మాస్కులకు వాల్వులు ఉన్నవి వాడుతున్నారు. అలాంటివి వద్దు. అలాగే ఒకే పొర ఉన్నవి.. కాంతిని నిరోధించలేని మాస్కులను కొనుగోలు చేయవద్దు. ♦ ఎన్–95 లేదా కేఎన్–95 వాడేటప్పుడు దాని మీద మరో మాస్కును వాడవద్దు. వైద్య సిబ్బంది ఎక్కువగా వాడే వీటిని ఇప్పుడు సామాన్య జనమూ వినియోగిస్తున్నారు. ఇవి మరింత సురక్షితమైనవి అని పేరు ఉండటంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, కేఎన్–95 మాసు్కలు ఎక్కువగా చైనాలో తయారవుతాయి. వీటిల్లో నకిలీలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులు అమెరికాలో ఉన్నాయి. కాబట్టి వాటిని కొనేటప్పుడు కాస్త చూసి తీసుకోవాలి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా.. వీటిని వాడవద్దు. ఎలా ధరించాలి? ♦ ఏ మాస్కు అయినా.. సరిగా ఫిట్ అయిందో లేదో చూసుకోవాలి. అన్ని వైపులా కవర్ అవ్వాలి. నోస్ వైర్ ఉన్న మాస్కు తీసుకోవడం వల్ల అది పై నుంచి గాలి బయటకు పోకుండా లేదా రాకుండా నిరోధిస్తుంది. దాన్ని మీ ముక్కుకు తగ్గట్లు ప్రెస్ చేయాలి. సరిగా ఫిట్ అయి ఉంటే.. వేడి గాలి మాస్కు ముందు భాగం నుంచి రావడాన్ని గమనిస్తారు. అంతేకాదు.. శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు దానికి తగ్గట్లు మాస్కు కూడా ముందుకు వెనక్కు కదలడాన్ని గమనించవచ్చు. ♦ ముఖ్యంగా డిస్పోజబుల్ మాసు్కల విషయంలో పై ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇవి కొంచెం లూజుగా ఉంటుంటాయి. సైడ్ నుంచి గాలి పోయే అవకాశము ఎక్కువ. అందుకే వీటి విషయంలో ఈ విధంగా తాళ్లను ముడివేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. ♦ అలాగే.. ఈ మధ్య డబుల్ మాస్క్ ఎక్కువగా ధరిస్తున్నారు. దీని వల్ల అదనపు రక్షణ లభిస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగని రెండు డిస్పోజబుల్ మాసు్కలు ఒకదానిపై ఒకటి పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అటూఇటూ గాలి పోతూనే ఉంటుంది. దానికి బదులుగా డిస్పోజబుల్ మాస్కు వేసుకుని.. దాని మీద క్లాత్ మాస్కు వేసుకుంటే.. ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. అది కూడా డిస్పోజబుల్ మాస్కు అంచులని ముఖానికి అదిమిపట్టేలా క్లాత్ మాస్కు వేసుకోవాల్సి ఉంటుంది. ♦ ఇక గడ్డం ఉన్నవారి విషయంలో మాస్క్ ఫిటింగ్ అన్నది సమస్యగా మారింది. వీరికంటూ ప్రత్యేకమైన మాసు్కలు లేని నేపథ్యంలో.. ఈ కరోనా కాలంలో అయితే షేవింగ్ చేసుకోవడం లేదా.. గడ్డం ట్రిమ్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలని సీడీసీ తెలిపింది. వీరు డబుల్ మాస్క్ ధరిస్తే.. మరింత సురక్షితమని పేర్కొంది. వీటితోపాటు సోషల్ డిస్టెన్స్ కూడా ముఖ్యమని మరోమారు స్పష్టం చేసింది. -
అమెరికాలో నవంబర్ కల్లా కోవిడ్ టీకా
వాషింగ్టన్: కోవిడ్–19 వ్యాక్సిన్‌ని నవంబర్‌కల్లా ప్రజలకి అందుబాటులోకి తెస్తామని అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ప్రకటిం చింది. వ్యాక్సిన్ పంపిణీకి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ రాష్ట్రాల గవర్నర్లకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘అక్టోబర్ ఆఖరి వారం లేదంటే నవంబర్ మొదటి వారానికి కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుంది. దీని పంపిణీకి ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి’’అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారులకు సూచించినట్టుగా న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. సీడీఎస్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ రాష్ట్రాల గవర్నర్లకు ఆగస్టు 27నే ఒక లేఖ రాశారు. మెక్కెసన్ కార్పొరేషన్ టీకా డోసుల్ని సరఫరా చేస్తుందని, రాష్ట్రాలు, వైద్య శాఖ, అన్ని ఆరోగ్య కేంద్రాలకు ఆ సంస్థే వ్యాక్సిన్ సరఫరా చేసేలా సీడీసీతో ఒప్పందం కుదుర్చుకుందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ చివరి వారానికి టీకా డోసులు సిద్ధమవుతాయని, నవంబర్ ఒకటి నుంచి వాటి పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొంది. వచ్చే ఏడాది లోపు కోవిడ్ వ్యాక్సిన్ సిద్ధం కాదని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నప్పటికీ ట్రంప్ సర్కార్ మాత్రం అధ్యక్ష ఎన్నికలకి ముందే కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. వ్యాక్సిన్ ద్వారా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు మెరుగుపడతాయని ట్రంప్ భావిస్తున్నారు మూడో దశ ప్రయోగాలకు ముందే అమెరికా పరిశోధనల్లో ఉన్న కరోనా వ్యాక్సిన్లు చాలా వరకు మూడో దశ క్లినికల్ ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ ప్రయో గాలు పూర్తి కాకుండానే అత్యవసరమైతే వ్యాక్సిన్‌ను ఉపయోగించాలని కూడా ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తుది దశ ఆమోదానికి దగ్గరలో ఉందని ఇటీవల ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కునుకులేని అమెరికా
మేలో అంతా బాగానే ఉందనుకున్నారు. ఆంక్షలు సడలించారు, మార్కెట్లు బార్లా తెరిచేశారు. కంటికి కనిపించని శత్రువుపై విజయం సాధించామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ జూన్‌లో సగర్వంగా ప్రకటించారు. సెకండ్ వేవ్ ప్రశ్నే లేదంటూ ధీమాగా చెప్పారు. పదిహేను రోజులు గడిచాయో లేదో కరోనా కేసులు రెట్టింపు వేగంతో పెరిగిపోయాయి. దక్షిణ, పశ్చిమాది రాష్ట్రాలు కొత్త హాట్స్పాట్లుగా మారాయి. 39 లక్షల 19 వేల కేసులు, లక్షా 43 వేల మృతులతో అమెరికా నిద్రలేని దేశంగా మారింది. వాషింగ్టన్ : ఒకప్పుడు రోజుకి 20 వేల కరోనా కేసులు నమోదైతేనే అందరూ హడలెత్తిపోయారు. కోవిడ్ ధాటికి అంతటి అగ్రరాజ్యం విలవిలలాడిపోయింది. అలాంటిది కళ్ల ముందే ప్రతీ వారం కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి. రోజుకి 30 వేలు, 40 వేలు, 50 వేలు అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ప్రతీరోజూ 60 నుంచి 70వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చేసింది. యూరప్‌లో నమోదవుతున్న కేసుల కంటే అయిదు రెట్లు ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల వెన్నులో కరోనా వణుకు పుట్టిస్తోంది. 50 రాష్టాలకుగాను 40 రాష్ట్రాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. గత రెండు వారాల్లోనే కేసుల్లో 50% పెరుగుదల కనిపిస్తే, మరణాల రేటు 46% పెరిగింది. కొత్త హాట్స్పాట్లు ఏప్రిల్, మే నెలల్లో న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తే ఇప్పుడు అరిజోనా, ఫ్లోరిడా, టెక్సాస్, జార్జియా, అలబామా, లూసియానా వంటి రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఈ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ పాకింది. అరిజోనాలో వారం రోజుల్లోనే 27% కేసులు పెరిగాయి. ఫ్లోరిడా, సౌత్ కరోలినాలో 19% పెరుగుదల కనిపిస్తోంది. టెక్సాస్‌లో 18%, జార్జియాలో 17% పెరుగుదల కనిపిస్తోంది. అప్పుడూ, ఇప్పుడూ కూడా కాలిఫోర్నియాను కరోనా కకావికలం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఏకంగా 27% కేసులు పెరుగుతున్నాయి. టెక్సాస్‌లో రెండు వారాల లాక్డౌన్ విధించారు. కాలిఫోర్నియాలో రెస్టారెంట్లు, బార్లు, చర్చిలు మూసివేశారు. లూసియానా, అలబామా, మోంటానాలో ఇల్లు దాటి బయటకు వస్తే మాస్క్ తప్పనిసరి చేశారు. అరిజోనా, టెక్సాస్, ఫ్లోరిడాలలో మరణాల రేటు అత్యధికంగా ఉంది. ఎందుకీ పెరుగుదల? ►దేశ ఆర్థిక వ్యవస్థా? ప్రజారోగ్యమా? దేనికి ప్రాధాన్యతనివ్వాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థికానికే ప్రాధాన్యమని కుండబద్దలు కొట్టేశారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మార్కెట్లన్నీ ఆదరాబాదరాగా తెరిచేశారు. ►కరోనాని కట్టడి చేయడంలో ముఖ్యపాత్ర పోషించే మాస్కుల చుట్టూ రాజకీయాలు నడిచాయి. డెమొక్రాట్ పార్టీకి చెందిన సెనేటర్ లామర్ అలెగ్జాండర్ మీరు ట్రంప్‌కి అనుకూలమైతే మాస్కులు వేసుకోకండి, వ్యతిరేకమైతే మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. అమెరికన్లలో అత్యధికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం అంటే తమ స్వేచ్ఛ హరించినట్టేనన్న భావనలో ఉన్నారు. ►కేసులు ఎక్కువైతే హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రజలు విశ్వసించారు. ప్రపంచంలో అతి పెద్దదైన వరల్డ్ డిస్నీ పార్క్, బీచ్‌లు, క్లబ్బుల్లో జన ప్రవాహమే కనిపించింది. ►అధ్యక్ష ఎన్నికల ప్రచారం, నిధుల సేకరణతో రాజకీయపరమైన కార్యకలాపాలు జోరందుకున్నాయి. ►జాతి వివక్ష వ్యతిరేక ప్రదర్శనల్లో కూడా ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం అగ్రరాజ్యం కొంప ముంచాయి. ఇక రోజుకి లక్ష కేసులు? అమెరికాలో కేసుల పెరుగుదల చూస్తుంటే రోజుకి లక్ష కేసులు నమోదయ్యే రోజు ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. రానున్న శీతాకాలంలో అమెరికాలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించడానికే భయంగా ఉందని డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాని కట్టడి చేయడంలో అమెరికా చాలా తప్పుదారిలో నడుస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజలు తమ తీరు మార్చుకోకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నిపుణుడు ఆంటోని ఫాసీ హెచ్చరించారు. -
భౌతిక దూరం లేకుంటే.. మాస్క్ వేస్ట్!
సాక్షి, హైదరాబాద్ : ‘కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవాలి. మాస్క్ ధరించాలి’అని మొదటి నుంచీ వైద్య నిపుణులు చెబుతున్న విషయాలే. ఈ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది. వీటిల్లో ఏది పాటించకపోయినా కరోనా బారిన పడే ప్రమాదముందనేది అందరికీ తెలిసిందే. మాస్క్ పెట్టుకున్నాం కదా అని చాలామంది కలసిమెలసి తిరుగుతుంటారు. అయితే భౌతిక దూరం పాటించకుండా మాస్క్ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్పష్టం చేసింది. మాస్క్.. భౌతిక దూరానికి ప్రత్యామ్నాయం కాదని తేల్చి చెబుతూ.. భౌతిక దూరానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించింది. కాబట్టి మాస్క్‌తో పాటు తప్పనిసరిగా భౌతికదూరాన్ని పాటించా లని పేర్కొంది. అవసరమైన పనులను చేస్తున్నప్పుడు, కార్యాలయంలోకి వెళ్తున్నప్పుడు 6 అడుగుల భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమని పేర్కొంది. ఈ మేరకు కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు లేకున్నా వైరస్.. చాలా మందిలో కరోనా వైరస్ లక్షణాలు బయటకు కనిపించట్లేదు. వారివల్ల కరోనా వ్యాప్తి చెందినట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అందువల్ల లక్షణాలు లేవని భావించి ఎవరితోనూ సన్నిహితంగా మెలగొద్దు. దీనివల్ల ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్ ప్రధానంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. అందువల్ల ఎవరితోనూ సన్నిహిత సంబంధాలను కొనసాగించొద్దు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ములు లేదా మాట్లాడేటప్పుడు వెలువడే శ్వాస బిందువులు సమీపంలో ఉన్న వారి నోట్లో లేదా ముక్కులో పడొచ్చు. ఒక్కోసారి ఊపిరి తిత్తుల్లోకి కూడా నేరుగా వెళ్లే అవకాశం ఉంది. ఇంట్లోనూ అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించండి. వీలైతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, ఇతర ఇంటి సభ్యుల మధ్య ఆరు అడుగుల ద్వారాన్ని పాటించాలి. అలాగే ఇంటి బయట ఎవరైనా వస్తే వారితోనూ భౌతిక దూరం పాటించాలి. గుంపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగొద్దు. కరోనా వైరస్ వ్యాధిని నివారించడానికి ప్రస్తుతం టీకా లేదు. కాబట్టి దాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం ఈ వైరస్ బారిన పడకుండా అన్ని విధాలా జాగ్రత్తగా ఉండటమే. రెండేళ్లలోపు పిల్లలకు ఇబ్బంది.. రెండేళ్లలోపు వయసున్న చిన్న పిల్లలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారు లేదా అపస్మారక స్థితిలో ఉన్న వారు, ఇతరత్రా సమస్యలున్న వారు మాస్క్‌లు ధరించకపోవడమే మంచిది. అలాంటి వారికి బదులు పక్కనున్న వ్యక్తులు ధరిస్తే, వారికి ఎలాంటి హాని ఉండదు. వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యం ఉన్న వారు కరోనా వైరస్‌కు ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల్లోనూ వీరే బాధితులుగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పుడు చెక్ చేసుకోవద్దు.. వ్యాయామం చేసిన 30 నిమిషాల్లో లేదా ఉష్ణోగ్రతను తగ్గించే మందులు తీసుకున్న తర్వాత థర్మల్ (జ్వర) పరీక్షలు చేయకూడదు. దీనివల్ల స్పష్టమైన ఫలితం రాదు. జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది ఉంటే కరోనాగా అనుమానించాలి. లక్షణాలు ఉంటే శరీర ఉష్ణోగ్రత తప్పనిసరిగా చూడాలి. కార్యాలయంలో ఒక్కోసారి మాస్క్ లేనప్పుడు దగ్గు లేదా తుమ్ము వస్తే మోచేయి అడ్డం పెట్టుకోవాలి. ఆ తర్వాత చేతులను సబ్బునీరు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్య సిబ్బంది ఉపయోగించే ఫేస్‌మాస్క్‌ను ధరించొద్దు. వస్తువులను క్రిమిసంహారకం చేయాలి.. రోజూ తాకే వస్తువులను, ఉపరితలాలను క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయాలి. టేబుల్స్, లైట్ స్విచ్‌లు, హ్యాండిల్స్, డెస్క్‌లు, ఫోన్లు, కీ బోర్డులు, మరుగుదొడ్లు, సింక్లు ఇలా అన్నింటినీ శుభ్రం చేయాలి. అందుకోసం క్రిమిసంహారక డిటర్జెంట్ లేదా సబ్బు వంటివి వాడాలి. -
మరోసారి కాటేస్తుంది జాగ్రత్త!
వాషింగ్టన్/బీజింగ్/ఇస్లామాబాద్: కరోనా మహమ్మారి ఈ ఏడాది చివరిలో తీవ్రంగా అమెరికాపై విరుచుకుపడే అవకాశముందని సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ హెచ్చరించారు. అమెరికాలో దాదాపు 8.24 లక్షల మంది వైరస్ బారిన పడగా, 45 వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అమెరికాలో ఒకవైపు ఫ్లూ మరోవైపు కరోనా వైరస్లు విజృంభిస్తాయని రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలిదశలో కరోనా వైరస్ వ్యాప్తికి ఫ్లూ తోడై ఉండిఉంటే తట్టుకోవడం కష్టమయ్యేదనీ, అదృష్టవశాత్తూ ఫ్లూ తగ్గుముఖం పడుతున్న సమయంలో కరోనా వచ్చిందన్నారు. రానున్న శీతాకాలంలో ఇప్పటి కంటే తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇమ్రాన్‌కు కరోనా పరీక్ష పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బుధవారం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ ఈదీ ఫౌండేషన్ ఛైర్మన్ ఫైసల్ ఈదీ ఇటీవల ఇమ్రాన్‌ను సందర్శించడం, ఆ తరువాత ఆ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడిన నేపథ్యంలో ఈ పరీక్షలు అవసరమయ్యాయి. కాగా, ఇమ్రాన్‌కు నెగటివ్ అని పరీక్ష ఫలితాల్లో తేలింది. అమెరికాలో చైనాపై కేసు కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహారాలను ప్రశ్నిస్తూ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం ఒక కేసు దాఖలు చేసింది. సమాచారాన్ని తొక్కిపెట్టడం, ముందస్తు హెచ్చరికలు చేసిన వారిని అరెస్ట్ చేయడం, వైరస్ అంటువ్యాధి లక్షణాన్ని తిరస్కరించడం ద్వారా చైనా ప్రపంచానికి సరి చేయలేనంత నష్టం కలుగజేసిందని, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయడంతోపాటు మానవ బాధలకు కారణమైందని మిస్సోరి అటార్నీ జనరల్ ఎరిక్ షిమిట్ స్థానిక కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. వూహాన్ డైరీ రచయితపై వ్యతిరేకత కరోనా వైరస్ పుట్టినిల్లు వూహాన్లో లాక్డౌన్ పరిస్థితులపై ఓ పుస్తకం రాసిన చైనా రచయిత ఫాంగ్ఫాంగ్పై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫాంగ్ఫాంగ్ తన ఆన్లైన్ డైరీలో వూహాన్‌లోని పరిస్థితులను వివరించారు. రోగులతో నిండిన ఆస్పత్రులు, చికిత్స అందించలేమంటూ కొందరిని తిప్పి పంపడం, రోగుల బంధువుల మరణాల వంటి విషయాలను పేర్కొన్నారు. -
కేరళను వణికిస్తున్న ‘నిపా’ వైరస్