నిపుణుల బృందానికి అన్నీ వివరించండి
–7, 8 తేదీల్లో భూగర్భ జలాల పెరుగుదలపై అధ్యయనం
–జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో భుగర్భ జలాల పెరుగుదల అంశాలను పరిశీలించేందుకు వచ్చే కేంద్ర నిపుణుల బృందానికి అన్ని వివరాలు సమగ్రంగా వివరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్.. వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికి రెండు దశల కార్యక్రమం పూర్తి అయిందన్నారు. మూడో దశలో భాగంగా 7, 8 తేదీల్లో ఇద్దరు నిపుణులతో కూడిన బృందం జిల్లాకు వస్తుందన్నారు. ఈ బృందానికి భూగర్భ జలాలు పెరగడానికి తీసుకున్న చర్యలను విశదీకరించాలని తెలిపారు. సమావేశంలో జేసీ హరికిరణ్, సీపీఓ ఆనంద్నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.