Centrally sponsored schemes
-
ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కన్నబాబు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రాయోజిత పథకాలపై వ్యవసాయ, ఉద్యాన వన శాఖల సిబ్బంది, ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయంపై మంత్రి పలు సూచనలు చేశారు. ఖర్చు చేసే ప్రతి రూపాయి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్(ఆర్కేవీవై), జాతీయ వ్యవసాయ స్వావలంబన(ఎన్ఎఫ్ఎస్ఎం), ప్రధాన మంత్రి క్రిషి సంచాయి యోజన పథకాల(ఎన్ఎంఎస్ఏ) అమలు తీరుపై అధికారులతో మంత్రి సుదీర్ఘ చర్చ జరిపారు. రైతాంగానికి మేలు చేసే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాల వారిగా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, ఇతర అంశాలను మంత్రికి అధికారులు వివరించారు. గ్రామాల్లో రైతులకు రసాయనాలు, పురుగు మందుల వినియోగం తగ్గించేలా అవగాహనా పెంచాలని మంత్రి అన్నారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖలు, వ్యవసాయ, ఉద్యాన వన విశ్వ విద్యాలయాలతో సమన్వయం చేసుకొని రైతాంగానికి శాస్త్రీయ వ్యవసాయ యాజమాన్య పద్ధతులు పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాల కొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఎండి శేఖర్ బాబు, ఫుడ్ ప్రెసెసింగ్ సీఈవో శ్రీధర్ రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ హరినాథ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: విద్యావ్యవస్థలో సమూల మార్పులు: మంత్రి సురేష్ సీఎం జగన్ సమక్షంలో ‘దిశ యాప్’ లైవ్ డెమో -
కేంద్ర పథకాల కుదింపునకు ఓకే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్ఎస్) 30కి మించకుండా కుదించాలంటూ ముఖ్యమంత్రుల కమిటీ చేసిన కీలక సిఫార్సును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అలాగే ఈ పథకాల ఫ్లెక్సీ నిధులను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్న సూచనకూ పచ్చజెండా ఊపింది. దీంతో నిధులను వెచ్చించడంలో నిర్ధిష్ట లక్ష్యాన్ని అందుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ లభిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రం ఫ్లెక్సీ నిధులను 30 శాతానికి పెంచారు. సీఎంల కమిటీ మొత్తం 66 కేంద్ర పథకాలను సమీక్షించింది. -
కేంద్ర పథకాల కుదింపు
-
కేంద్ర పథకాల కుదింపు
* 72 నుంచి 30కి తగ్గించేందుకు ‘నీతి’ సీఎం సబ్ కమిటీ భేటీలో ఏకాభిప్రాయం * ప్రాధాన్యాల వారీగా రెండు గ్రూపులుగా పథకాల వర్గీకరణ * మొదటి గ్రూపులో ముఖ్యమైన స్కీంలు.. రెండో విభాగంలో సంక్షేమ పథకాలు * ఫ్లెక్సీ ఫండ్ వాటాను 10% నుంచి 25 శాతానికి పెంచాలని సిఫారసు న్యూఢిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్య భారీగా తగ్గనుంది. ప్రస్తుతం 72 ఉన్న ఈ పథకాలను 30కి కుదించనున్నారు. ఈ మేరకు నీతి ఆయోగ్ ముఖ్యమంత్రుల సబ్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కేంద్రం ఇచ్చే నిధుల్లో ప్రస్తుతం 10 శాతం నిధులను (ఫ్లెక్సీ ఫండ్) రాష్ట్రాలు తమ అభీష్టం మేరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ఈ వాటాను 25 శాతానికి పెంచాలని సబ్ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. శనివారమిక్కడ నీతి ఆయోగ్‌లో సబ్ కమిటీ భేటీ అయింది. అనంతరం కమిటీ కన్వీనర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడారు. ‘మా తుది సిఫారసులు జూలై 5నాటికి ఖరారవుతాయి. మరిన్ని సలహాలు స్వీకరించాల్సి ఉంది. ప్రధాని మోదీకి నివేదిక సమర్పించేందుకు ముందు కమిటీలోని సభ్యులతోపాటు సీఎంలందరి అభిప్రాయాలు తెలుసుకుంటాం. ఆ తర్వాతే నివేదిక ఇస్తాం’ అని ఆయన చెప్పారు. రెండు గ్రూపులుగా పథకాలు ఇప్పటిదాకా జరిగిన సబ్ కమిటీ సమావేశాల్లోని ప్రతిపాదనలను క్రోడీకరించి తాజా భేటీలో సభ్యులకు ముసాయిదా నివేదికను సమర్పించారు. దీన్ని నీతి ఆయోగ్ సీఈవో సింధుశ్రీ ఖుల్లర్ రూపొందించారు. కేంద్ర పథకాలను ప్రధానంగా రెండు గ్రూపులుగా విభజించాలని అందులో పేర్కొన్నారు. మొదటి గ్రూపులో కీలకమైన గ్రామీణ ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్, మధ్యాహ్న భోజనం వంటి పథకాలను చేర్చాలని ప్రతిపాదించారు. ఇక రెండో గ్రూపులో సామాజిక సంక్షేమ పథకాలను చేర్చాలని సూచించారు. మొత్తంగా 30 కేంద్ర పథకాలు ఉంటాయని, వీటి లో కేంద్రం వాటా 50 శాతానికి తగ్గకుండా ఉండాలని ప్రతిపాదించారు. స్పెషల్ కేటగిరీలో ఉన్న 11 రాష్ట్రాల్లో మాత్రం కీలక పథకాలకు సంబంధించి.. కేంద్రం, రాష్ట్రాల వాటా 90:10 నిష్పత్తిలో ఉండాలని సూచించారు. రెండో గ్రూపులోని పథకాల్లో ఈ వాటా 80:20గా ఉండాలని ముసాయిదా నివేదికలో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్, గ్రామీణ విద్యుదీకరణ, మహిళ, శిశు ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణం పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే ఇప్పటివరకు 30 శాతం పనులు జరిగిన కేంద్ర పథకాలను పూర్తి చేయాలని, వాటికి నిధులను ఎప్పట్లాగే అందించాలని ప్రతిపాదించారు. శనివారం నాటి సమావేశానికి మధ్యప్రదేశ్ సీఎంతోపాటు రాజస్తాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సబ్ కమిటీలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు కూడా సభ్యుడిగా ఉన్నారు. అయితే తాజా భేటీకి ఆయన హాజరు కాలేదు. అగ్రనేతలను కలవకుండానే వెళ్లిన రాజే న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీ వివాదంతో సతమతమవుతున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే.. శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ ఉప సంఘం సమావేశంలో పాల్గొని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను కానీ కలవకుండానే రాజస్తాన్‌కు న్కు తిరిగివెళ్లారు. ప్రత్యేక విమానంలో రాజస్తాన్ నుంచి ఢిల్లీ వెళ్లిన రాజే.. సమావేశం అనంతరం అదే విమానంలో తిరుగుపయనమయ్యారు. అక్కడ మీడియాకు కూడా ఎదురుపడలేదు. దీంతో.. పార్టీ అగ్ర నాయకత్వం ఆమెను కలవటానికి విముఖంగా ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పర్యటనలో ఎవరితోనూ సమావేశాలను నిర్ణయించలేదని రాజస్తాన్ సీఎంఓ ఆ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. మోదీది ‘రాజే ధర్మం’: కాంగ్రెస్ దేశంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న లలిత్‌మోదీ బ్రిటన్‌లో ప్రయాణ పత్రాలు పొందేలా సహాయపడిన రాజే, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌లను సమర్థించుకోవటం ద్వారా.. ప్రధాని మోదీ ‘రాజ ధర్మాన్ని’ కాకుండా ‘రాజే ధర్మాన్ని’ పాటిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. వారితో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మహిళా మంత్రులను తొలగించటంలో విఫలమైన ప్రధాని.. రాజీనామా చేయాలని కాంగ్రెస్ ప్రతినిధి రాజ్‌బబ్బర్ అన్నారు. -
ఆర్థిక సమరం.. అత్యవసరం
పథకాలకు కేంద్ర నిధుల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన ⇒ గతంలో ఉన్న పద్ధతి కొనసాగించాలని ప్రతిపాదన ⇒తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి ⇒28న భోపాల్‌లో నీతి ఆయోగ్ సమావేశం.. హాజరవనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ధనిక రాష్ట్రమని చెప్పుకున్నప్పటికీ... కేంద్రం నిధుల కోతతో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతున్నాయని తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఆర్థిక సాయానికి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయిం చింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రాల భాగస్వామ్యపు వాటాను పెంచటం ఆర్థికం గా గుదిబండగా మారింది. రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటా పది శాతం పెంచినందున ప్రాయోజిత పథకాలను పునర్వ్యవస్థీకరించాల్సి వచ్చిందని కేంద్రం చెప్పుకుంటోంది. దీంతో ఆర్థికంగా తమపై ఒత్తిడి పెరిగిం దని తెలంగాణ సర్కారు తల పట్టుకుంటోంది. అందుకే.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈనెల 28న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అక్కడ ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. ఆర్థిక , ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఈ అంశాన్ని ప్రత్యేకంగా చర్చిం చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర సౌజన్య పథకాల్లో రాష్ట్రాల వాటాను గతంలో ఉన్న పద్ధతిలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేయాలని.. లేనిపక్షంలో కొత్త రాష్ట్రమైనందున తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని కోరాలని నిర్ణయించారు. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ కేం ద్రానికి లేఖ రాయటంతో పాటు.. నీతి ఆయోగ్ సమావేశంలో వీటిని ప్రధాన ఎజెండాగా ప్రస్తావించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పథకాల వారీగా రాష్ట్రంపై ఎంత భారం పడుతుందని విశ్లేషించేందుకు సీఎం సూచనల మేరకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. రెంటికీ చెడ్డ రేవడి: గత ఏడాది వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 75 శాతం వాటాను కేంద్రం చెల్లించగా.. మిగతా 25 శాతమే రాష్ట్రం సమకూర్చేది. ఈ ఏడాది నుంచి కేంద్రం తమ పథకాలను పునర్వ్యవస్థీకరించి వాటాను కేవలం 50 శాతానికి పరిమితం చేసింది. మిగతా సగం రాష్ట్రాలే భరించాలని నిర్దేశించింది. పన్నుల వాటా ను పెంచిన సాకుతో కేంద్రం ప్రాయోజిత పథకాల్లో కత్తెర వేయటంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు దాదాపు రూ. 2,233 కోట్లు కోత పెట్టినట్లయింది. కానీ పాత జనాభా ప్రాతిపదికన నిధులి వ్వడంతో తెలంగాణకు వచ్చే పన్నుల వాటా కూడా తగ్గి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. మొత్తంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.4622 కోట్లు నిలిచిపోయాయని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అన్ని పథకాలకు వాతే గత ఏడాది వరకు అమలైన 63 పథకాల్లో కేంద్రం ప్రస్తుతం 31 పథకాలనే కొనసాగిస్తోంది. అందులో 24 పథకాలకు తామిచ్చే నిధుల వాటాను తగ్గించుకుంది. చిన్నారులు బాలింతలు, గర్భిణుల ఆరోగ్యం, పౌష్టికాహారానికి ఇచ్చే నిధులను సగానికి సగం కుదించింది. ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గత ఏడాది రూ.16,316 కోట్లు మంజూరు చేయగా ఈసారి కేవలం రూ. 8 వేల కోట్లు కేటాయించింది. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పథకాలు, స్వచ్ఛభారత్ అభయాన్ కింద అమలు చేసిన ఈ కార్యక్రమాలన్నింటికీ నిధుల వాత పెట్టింది. వీటికి అవసరమయ్యే భాగస్వామ్య వాటాకు నిధులను మళ్లిస్తే.. రాష్ట్రంలో తలపెట్టిన ప్రాధాన్య కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తటం ఖాయమని ఆర్థిక నిపుణులు వేలెత్తి చూపుతున్నారు. అందుకే ముందుజాగ్రత్తగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రాష్ట్ర సర్కారు మొగ్గు చూపుతోంది.