సాక్షి, అమరావతి: కేంద్ర ప్రాయోజిత పథకాలపై వ్యవసాయ, ఉద్యాన వన శాఖల సిబ్బంది, ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయంపై మంత్రి పలు సూచనలు చేశారు. ఖర్చు చేసే ప్రతి రూపాయి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని కన్నబాబు పేర్కొన్నారు.
రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్(ఆర్‌కేవీవై), జాతీయ వ్యవసాయ స్వావలంబన(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం), ప్రధాన మంత్రి క్రిషి సంచాయి యోజన పథకాల(ఎన్‌ఎంఎస్‌ఏ) అమలు తీరుపై అధికారులతో మంత్రి సుదీర్ఘ చర్చ జరిపారు. రైతాంగానికి మేలు చేసే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాల వారిగా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, ఇతర అంశాలను మంత్రికి అధికారులు వివరించారు.
గ్రామాల్లో రైతులకు రసాయనాలు, పురుగు మందుల వినియోగం తగ్గించేలా అవగాహనా పెంచాలని మంత్రి అన్నారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖలు, వ్యవసాయ, ఉద్యాన వన విశ్వ విద్యాలయాలతో సమన్వయం చేసుకొని రైతాంగానికి శాస్త్రీయ వ్యవసాయ యాజమాన్య పద్ధతులు పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాల కొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఎండి శేఖర్ బాబు, ఫుడ్ ప్రెసెసింగ్ సీఈవో శ్రీధర్ రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ హరినాథ రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: విద్యావ్యవస్థలో సమూల మార్పులు: మంత్రి సురేష్
సీఎం జగన్ సమక్షంలో ‘దిశ యాప్’ లైవ్ డెమో
Comments
Please login to add a commentAdd a comment