‘ఎర్ర’ స్మగ్లర్లకు రిమాండ్
- మదనపల్లె కోర్టుకు చైనా దేశీయుడు చెన్యీ ఫియాన్
- చిత్తూరు కోర్టుకు చెన్నైకి చెందిన సెల్వరాజ్
మదనపల్లె రూరల్/పూతలపట్టు : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్న చైనాకు చెందిన చెన్యీ ఫియాన్‌ను, చెన్నైకి చెందిన ఆర్.సెల్వరాజ్‌ను బుధవారం చిత్తూరు జిల్లా పోలీసులు కోర్టు హాజరుపరిచారు. వారిని కోర్టురిమాండ్కు ఆదేశించింది. మే 28న మదనపల్లె నుంచి డాబా శ్రీను, హరిబాబు ఎర్రచందనం తరలిస్తుండగా పోలీసులు అరెస్టుచేసి విచారించగా చైనాకు చెందిన చైనాకు చెందిన చెన్యీ ఫియాన్, తమిళనాడుకు చెందిన ఆర్.సెల్వరాజ్ పేర్లు చెప్పాడరు. దీంతో గత శుక్రవారం ఢిల్లీలో చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. పూతలపట్టు పోలీసులు బుధవారం చెన్నైలో ఆర్.సెల్వరాజ్‌ను అరెస్టుచేశారు. చెన్యీ ఫియాన్‌ను మదనపల్లె కోర్టులో హాజరు పరిచారు. సెల్వరాజ్‌ను చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు.
నేను దొంగను కాదు ..
‘‘సారీ.. ఐయామ్ నాట్ ఏ తీఫ్.. ఐయామ్ బిజినెస్ పర్సన్’’ అంటూ విలేకరుల ముందు చెన్యీఫియాన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య ప్రోద్భలంతో అప్పుచేసి వ్యాపారం చేయడానికి ఢిల్లీకి వచ్చానన్నారు. తనను పోలీసులు అరెస్టు చేశారని, తన భార్య చుయాన్‌ఛుంగ్ ఆత్మహత్య చేసుకుంటుందని విలపించాడు. కాగా ఢిల్లీలో చెన్యై ఫియాన్‌ను అరెస్టు చేసినపుడు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు బుధవారం చిత్తూరుకు చేరుకున్నాయి.