CEO Jack Dorsey
-
ట్విటర్ కొత్త నిబంధన
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్ స్పామ్‌పై బెడద నుంచి బయటపడేందుకు చర్యలు చేపట్టింది. స్పామ్ మెసేజ్‌లు, ఖాతాలనుంచి ట్విటర్ వినియోగదారులను రక్షించేందుకు కీలక చర్య తీసుకుంది. ట్విటర్ వినియోగదారుడు ఫాలోఅయ్యే ఖాతాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఒక ట్విటర్ యూజర్ ఒక రోజులో ఇతర యూజర్లను ఫాలో అయ్యే సంఖ్యను 400కు తగ్గించింది. గతంలో రోజుకు 1000 అకౌంట్లను ఫాలోఅయ్యే అవకాశం ఉంది. స్పామ్ సమస్య నుంచి బయట పడేందుకే ఈ చర్యకు దిగినట్లు ట్విటర్ తెలిపింది. ఈ మేరకు ట్విటర్ సాంకేతిక భద్రతా విభాగం ట్వీట్ చేసింది. మరోవైపు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే అందుకున్న జీతం ఎంతో తెలుసా. అక్షరాలా రూ.100. 2018 సంవత్సరానికిగాను ఆయనకు కంపెనీ 1.40డాలర్లు (సుమారు రూ.100) జీతం చెల్లించినట్లు సంస్థ వెల్లడించింది. అదేవిధంగా 2018లోనూ డోర్సేకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను ఆయన తిరస్కరించారని, వేతనంగా మాత్రం 1.40 డాలర్లు తీసుకున్నారని సీఈఎస్ ఫైలింగ్‌లో ట్విటర్ వెల్లడించింది. ట్విటర్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొద్ది సంవత్సరాలుగా సహవ్యవస్థాపకుడైన డోర్సే జీతం తీసుకోవడం లేదని పేర్కొంది. కాగా వేతనంతో సహా కంపెనీ ఇచ్చే అన్ని సదుపాయాలను మూడేళ్ల పాటు (2015, 2016, 2017) తీసుకోబోనని గతంలో డోర్సే ప్రకటించిన సంగతి తెలిసిందే. Follow, unfollow, follow, unfollow. Who does that? Spammers. So we’re changing the number of accounts you can follow each day from 1,000 to 400. Don’t worry, you’ll be just fine. — Twitter Safety (@TwitterSafety) April 8, 2019 -
ట్విట్టర్ సీఈవోకు షాక్.. అకౌంట్ బ్లాక్!
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్.. సాక్షాత్తూ తన బాస్కే షాక్ ఇచ్చింది. ఇటీవలే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ సంఘటన మరువకముందే ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ అకౌంట్ మళ్లీ బ్లాక్ అయింది. మంగళవారం రాత్రి ట్విట్టర్ లో ఆయనను వెదికినవారికి ‘ప్రస్తుతం ఈ ఖాతా రద్దైంది’అనే సమాచారం కనిపించింది. దీంతో ఆయన ఫాలోవర్లేకాక పలువురు యూజర్లూ ఆందోళన చెందారు. అసలేం జరిగిందో కొన్ని గంటల తర్వాత డార్సీనే వివరణ ఇచ్చారు.. సిబ్బంది చేసిన చిన్న సాంకేతిక పొరపాటు వల్ల తన ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయిందని, వెంటనే వాళ్లతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టానని జాక్ డార్సీ ట్విట్టర్ లో తెలిపారు. సంస్థ సీఈవోకు ఎదురైన అనుభవం తమలో కొద్ది మందికి తరచూ ఎదురవుతున్నదని, ఉన్నపళంగా అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయని, దీనిపై ట్విట్టర్ సమాధానం చెప్పాల్సిందేనని కొందరు ట్విట్టరియన్స్ డిమాండ్ చేశారు. అయితే ట్విట్టర్ సంస్థ మాత్రం ఈ ఉదంతంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్విట్టర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డార్సీ సంస్థకు తొలి సీఈవో కూడా. కొంత కాలానికి రాజీనామా చేసి వెళ్లిపోయిన ఆయన.. గతేడాది తిరిగి ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయనతోపాటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ల ట్విట్టర్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన సంగతి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన తెలిసిందే. just setting up my twttr…again (account suspension was an internal mistake) — -
'జుకర్ బర్గ్, జాక్‌లను చంపేస్తాం'!
లండన్: ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నరమేధం కొనసాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కన్ను ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్లపై పడింది. ఈరెండు సంస్థల బాస్‌లను తాము త్వరలోనే హత్య చేస్తామంటూ ఐసిస్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో డిజిటల్ టెక్నాలజీతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జూకర్ బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేల ఫొటోలను చూపిస్తూ వాటికి బుల్లెట్లతో రంధ్రాలు పెడుతున్నట్లు చూపించారు. ఉగ్రవాదానికి, తీవ్ర భావజాలానికి సంబంధించిన అంశాలకు చోటులేదని ప్రకటించి అలాంటి కంటెంట్ మొత్తాన్ని ఈ రెండు వెబ్ సైట్లు తొలగించడంతోపాటు మున్ముందు అలాంటివి పోస్ట్ చేసే అవకాశం లేకుండా చేశాయి. ఈ నేపథ్యంలోనే ఐసిస్ ఈ రెండు సైట్ల పెద్ద తలకాయలను టార్గెట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సన్స్ ఆఫ్ కాలిపత్ ఆర్మీ అనే పేరిట విడుదల చేసిన ఈ వీడియోలో పలు హెచ్చరికలను కూడా ఐఎస్ చేసింది. తాము ఇప్పటి వరకు 10,000 ఫేస్ బుక్ ఖాతాలు,150 ఫేస్ బుక్ గ్రూప్స్ ను హ్యాక్ చేసినట్లు చెప్పింది. 5,000 ట్విట్టర్ ఖాతాలను కూడా దొంగిలించినట్లు వెల్లడించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తన చర్యలు ఆపేయకుంటే వాటిని తన మద్దతుదారులకు తాము హ్యాక్ చేసిన ఖాతాలను కేటాయిస్తామని బెదిరించింది. 'మీరు, మీ అమెరికా ప్రభుత్వం మా ఖాతాలను ఎన్నైనా తొలగించుకోవచ్చు. వాస్తవానికి ఇప్పటి వరకు మాకు లక్ష్యంగా లేరు. కానీ ఇప్పటి నుంచి మీరు ఒక్క ఖాతా తొలగిస్తే మేం పది సృష్టిస్తాం. త్వరలోనే మీ పేర్లు చెరిపేస్తాం, మీ సైట్లను కుప్పకూల్చేస్తాం' అని ఐఎస్ హెచ్చరించింది.