‘సెట్’ దరఖాస్తులను సరిచూసుకోవాలి
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల అర్హత పరీక్ష (టీఎస్, ఏపీ సెట్)కు దరఖాస్తు చేసిన ఫారంలో తప్పులు ఏవైనా ఉంటే మరొకసారి సరిచూసుకోవాలని సెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టు పేరు, పరీక్ష సెంటర్ మినహా అభ్యర్థి, తల్లిండ్రుల పేర్లు, ఇతర పొరపాట్లు దరఖాస్తులో ఉంటే జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు సెట్ వెబ్సైట్ www.settsap.orgలో సరిచేసి పంపాలని సూచించారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్ చూడవచ్చునని పేర్కొన్నారు.