C.H vidhya sagar rao
-
వేదాలను రక్షించుకోవాలి
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు తాడేపల్లి రూరల్ : వేదాలు, ఉపనిషత్తులు ఇతిహాసాలు, పురాణాలు భారతీయ వారసత్వ సంపదని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అన్నారు. పరమహంస పరివ్రాజకులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో, శ్రీ మధుభయ వేదాంత చార్య పీఠం ట్రస్టు నిర్వహణలో తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం చిన్నజీయర్ స్వామి వేదవిద్యాలయంలో జరుగుతున్న 50వ ఉభయ వేదాంత పండిత స్వర్ణోత్సవ ముగింపు సభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లడానికి, ఆధ్యాత్మిక గురువులే ముఖ్యకారణమన్నారు. మనిషిలోని అజ్ఞానాంధకారాలను తొలగించి, జ్ఞానబోధ చేసేవాడే గురువన్నారు. అలాంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమన్నారు. త్వరలోనే భారతదేశం ప్రపంచంలో అజేయంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్‌స్వామి, త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, త్రిదండి అష్టాక్షరీ రామానుజ జీయర్‌స్వామి, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, ఉభయ వేదాంత పండితులైన శ్రీమాన్ రామానుజ తాతాచార్య స్వామి, శ్రీమాన్ శ్రీవత్సాంకాచార్య స్వామి, శ్రీమాన్ ఈయుణ్ణి రంగాచార్యస్వామి, శ్రీమాన్ కె.ఈ.తిరువెంకట రామానుజాచార్యస్వామి, శ్రీమాన్ కేవీ రాఘవాచార్య స్వామి, శ్రీమాన్ తూపురాణి ఉడయవర్ల స్వామి, శ్రీమాన్ నేపాల్ కృష్ణమాచార్య స్వామి, శ్రీమాన్ దేవనాథన్ స్వామి వార్లను ఆయన ఘనంగా సత్కరించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళశాసనంతో ముగిసిన కాార్యక్రమంలో ఎం.పి గోకరాజు గంగరాజు, మంగళగిరి డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి తహశీల్దార్ ఎంటీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఖరారు
రాయికల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మార్చి 2న రాయికల్ రానున్నారు. ఆయనతో పాటు మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగరావు, కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి జోలోరాం పర్యటన అధికారికంగా ఖరారైంది. చినజీయర్‌స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయికల్‌లో కల్యాణ మండపానికి భూమిపూజ, కొమురంభీం విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. సీఎం, గవర్నర్, కేంద్రమంత్రి రెండు వేర్వేరు హెలిక్యాపర్టర్లలో రాయికల్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్ హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ సీఎం బహిరంగసభ ఏర్పాట్లు, చిన్నజీయర్‌స్వామి ప్రవచనం కోసం స్థలాన్ని పరిశీలించారు. సుమారు పదివేల మంది జనం సభకు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం ఆర్అండ్బీ ఈఈ ఉపేందర్, డీఈ వెంకటరమణ పనులను పరిశీలించారు. ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హెలిక్యాప్టర్‌లో రాయికల్‌కు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారని టీఆర్ఎస్ సంజయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీడీకార్మికులకు జీవనభృతి పంపిణీ కార్యక్రమాన్ని రారుుకల్ నుంచే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ శుక్రవారం రారుుకల్ వచ్చి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. -
కుటుంబసభ్యులైనా రాజకీయాల్లో శత్రువులే
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావు కోనరావుపేట, న్యూస్‌లైన్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని కుటుంబ సభ్యులతో సహా అందరినీ శత్రువులుగానే భావించాల్సి వస్తుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కుటుంబసభ్యులే ప్రధాన ప్రత్యర్థులుగా మారి పోటీ చేయాల్సి వస్తుందని తెలిపారు. స్వయాన తన అన్న అల్లుడు వినోద్‌కుమార్ ప్రత్యర్థులుగా బరిలో ఉన్నామని, మరో సోదరుడి కుమారుడు రమేశ్‌బాబు వేములవాడ అసెంబ్లీ బరిలో మరో పార్టీ తరఫున బరిలో ఉన్నారని తెలిపారు.