రాయికల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మార్చి 2న రాయికల్ రానున్నారు. ఆయనతో పాటు మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగరావు, కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి జోలోరాం పర్యటన అధికారికంగా ఖరారైంది. చినజీయర్‌స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయికల్‌లో కల్యాణ మండపానికి భూమిపూజ, కొమురంభీం విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. సీఎం, గవర్నర్, కేంద్రమంత్రి రెండు వేర్వేరు హెలిక్యాపర్టర్లలో రాయికల్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్ హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ సీఎం బహిరంగసభ ఏర్పాట్లు, చిన్నజీయర్‌స్వామి ప్రవచనం కోసం స్థలాన్ని పరిశీలించారు. సుమారు పదివేల మంది జనం సభకు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం ఆర్‌అండ్‌బీ ఈఈ ఉపేందర్, డీఈ వెంకటరమణ పనులను పరిశీలించారు.
ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హెలిక్యాప్టర్‌లో రాయికల్‌కు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారని టీఆర్‌ఎస్ సంజయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీడీకార్మికులకు జీవనభృతి పంపిణీ కార్యక్రమాన్ని రారుుకల్ నుంచే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ శుక్రవారం రారుుకల్ వచ్చి ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
సీఎం పర్యటన ఖరారు
Published Fri, Feb 27 2015 2:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement