ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోలోరాంతోపాటు శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి పర్యటన ఖరారైంది.
రాయికల్ : ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోలోరాంతోపాటు శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి పర్యటన ఖరారైంది. వారు మార్చి 2న రాయికల్‌లో పర్యటిస్తారని తెలిసింది. ఈమేరకు బుధవారం జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. కాగా మంగళవారం జగి త్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ హెలిప్యాడ్ స్థలంతోపాటు సీఎం, గవర్నర్, మంత్రుల బస కోసం అనువైన భవనం పరిశీలించారు.
జీవనభృతి పథకం ద్వారా అర్హులైన వారికి సీఎం అర్హత పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మండల కేంద్రంలోని చిన్నజీయర్‌స్వామి ట్రస్ట్ వద్ద కల్యాణ మండపం, కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలను ఈసందర్భంగా చేపడతారు. సీఎం పర్యటన ఖరారు సంకేతాలు రావడంతో జిల్లాస్థాయి అధికారులు సైతం ఏర్పాట్లలో నిమగ్నమయ్యూరు. అరుుతే, ఈ వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.