Vidhya Sagar Rao
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ సంచలన వ్యాఖ్యలు
-
కోరుట్ల 'రెవెన్యూ' డివిజన్
సాక్షి, కోరుట్ల: ‘జిల్లాలోనే పెద్ద పట్టణం కోరుట్ల.. దీనిని పక్కాగా రెవెన్యూ డివిజన్ చేస్తామని సీఎం కేసీఆర్ మాటగా ప్రకటిస్తున్నా..’ అని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కోరుట్ల డివిజన్ ఏర్పాటు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, మెట్పల్లి ప్రజలు ఆగం కావద్దని, మెట్పల్లి డివిజన్ అలాగే ఉంటుందని తెలిపారు. ఒకే సెగ్మెంట్లో రెండు డివిజన్లు ఉంటాయని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చిండు.. ఇగో అట్లనే మీ కేటీఆర్ కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు రెవెన్యూ డివిజన్లు సాధించి చరిత్ర సృష్టిస్తున్నారు..అని పేర్కొన్నారు. ఈ విషయం చెప్పడానికే ప్రత్యేకంగా కోరుట్లకు వచ్చానని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్లో ముంబయి రైలు ఆగేలా అనుమతి సాధిస్తామన్నారు. ఈ మూడు హామీలు నేరవేర్చే బాధ్యత తనదేనన్నారు. విద్యాసాగర్‌రావు అందరికీ అందుబాటులో ఉంటాడు.. మూడుసార్లు అభిమానాన్ని చాటి గెలిపించారు.. మరోసారి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి..అని కేటీఆర్ కోరారు. మహాకూటమి ముసుగులో కాంగ్రెస్‌కు ఓటేయాలని వస్తున్నారు.. వారిని నమ్మద్దు. ఎన్నికలు అయిపోగానే తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికో పోతారు.. ఈ విషయం మీకు కూడా తెలుసు..అందుకే ఎప్పుడూ అందుబాటులో ఉండే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు ఓటేసి ఆశీర్వదించండి..’ అని కోరారు. 24గంటల ఉ చిత కరెంట్, రైతుబంధు, రుణమాఫీతో రైతులకు అండగా నిలిచిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. పేద ప్రజల కష్టాలు గుర్తించి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, బీడి, నేత, గీత కార్మికులకు పించన్లు అందించారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పించన్లను రూ.2016 చేస్తామన్నారు. పింఛన్ అందించే వయసును 57కు కుదిస్తామన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉంటుందన్నారు. సోనియాను తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆశీర్వదించండి: విద్యాసాగర్‌రావు కోరుట్ల సెగ్మెంట్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని, మరోసారి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరారు. పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిరోజూ అందుబాటులో ఉన్నానన్నారు. మిషన్ భగీరథతో మంచినీరు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాల్టీలకు రూ.50కోట్ల చొప్పున నిధులు తెచ్చామన్నారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చాంబర్లో ధర్నా చేసి కోరుట్లలో వెటర్నరీ కళాశాలకు రూ.300 కోట్లు మంజూరు చేయించానని గుర్తు చేశారు. సభలో గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కటారి చంద్రశేఖర్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి అ«ధ్యక్షులు చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్లు ఉమారాణి, శీలం వేణు, కోరుట్ల పట్టణ, మండల టీఆర్ఎస్ అ ద్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశం, జడ్పీటిసిలు, ఎంపీటిసిలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఏం ముఖం పెట్టుకుని ఎన్నికలకు పోతావ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆర్ భూపతిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నిజామాబాద్ నుంచి ప్రారంభమైందని, పతనం కూడా ఇక్కడి నుంచేనని హెచ్చరించారు. బుధవారం నిజామాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీరును తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్ రూరల్ తాజామాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పైనా విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ వెంట ఉన్న గుప్పెడు మంది నేతల్లో తాను ఒకడినని, తన లాంటి అనేక మందికి కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపించారు. రూరల్ నుంచే పోటీ.. ఈ ఎన్నికల్లో తాను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేర్చుకున్న 25 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశాకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. టీఆర్ఎస్ జిల్లాలో పూర్తిగా అస్తవ్య స్తంగా తయారైందని, ఎంపీ కవిత పీఏకున్న విలువ పార్టీ రాష్ట్ర కార్యదర్శులకు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు విమర్శించారు. -
పన్నీరు సెల్వం రాజీనామా ఆమోదం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసేంత వరకు పదవిలో కొనసాగాల్సిందిగా పన్నీరు సెల్వంను కోరారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చింది. ఆదివారం అన్నా డీఎంకే రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా పన్నీరు సెల్వం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాల్సిందిగా కోరుతూ లేఖను గవర్నర్‌కు పంపారు. నిన్న అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి శశికళ పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ నిర్ణయాలు తెలియజేసేందుకు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. చదవండి: చిన్నమ్మే చీఫ్ మినిస్టర్ -
సీఎం, గవర్నర్ పర్యటన ఖరారు
రాయికల్ : ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోలోరాంతోపాటు శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి పర్యటన ఖరారైంది. వారు మార్చి 2న రాయికల్‌లో పర్యటిస్తారని తెలిసింది. ఈమేరకు బుధవారం జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. కాగా మంగళవారం జగి త్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ హెలిప్యాడ్ స్థలంతోపాటు సీఎం, గవర్నర్, మంత్రుల బస కోసం అనువైన భవనం పరిశీలించారు. జీవనభృతి పథకం ద్వారా అర్హులైన వారికి సీఎం అర్హత పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మండల కేంద్రంలోని చిన్నజీయర్‌స్వామి ట్రస్ట్ వద్ద కల్యాణ మండపం, కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలను ఈసందర్భంగా చేపడతారు. సీఎం పర్యటన ఖరారు సంకేతాలు రావడంతో జిల్లాస్థాయి అధికారులు సైతం ఏర్పాట్లలో నిమగ్నమయ్యూరు. అరుుతే, ఈ వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
నిరుపేదలకు ‘సాక్షి’ ఆసరా
కోరుట్ల : నిరుపేదల ఆవేదనను ‘సాక్షి’ తమ దృష్టికి తెచ్చి ఆసరాగా నిలుస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. పట్టణంలోని 20వ వార్డులో కౌన్సిలర్ జక్కుల జమున-జగదీశ్వర్ అధ్యక్షతన ‘సాక్షి’ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ప్రతీ నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సాంకేతిక కారణాలతో మొదటి దఫాలో కొంతమంది అర్హులకు పింఛన్లు అందలేదన్నారు. పింఛన్ల పంపిణీ ఈ రోజుతో ఆగిపోయేది కాదని, నిరంతర ప్రక్రియ అని తెలిపారు. రీసర్వేకు ఎమ్మెల్యే ఆదేశం అర్హులైన తమకు పింఛన్లు రావడం లేదని సుమారు 110 మంది ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. స్పందించిన ఆయన 20వ వార్డులో సర్వే సమయంలో పొరపాట్లు జరిగాయని గుర్తించారు. దరఖాస్తులపై రీసర్వే నిర్వహించి అర్హులందరికీ ఆసరా అందించాలని మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డిని ఆదేశించారు. ఇంటింటికి స్వయంగా తిరిగి పింఛన్లందించాలని సూచించారు. వార్డులో గతంలో 170 పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు 30 మందికి మాత్రమే పింఛన్లు రావడం సర్వేలో లోపంగానే భావిస్తున్నామన్నారు. ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమకు పింఛన్లు రాలేదనే విషయాన్ని ‘సాక్షి’ ప్రజావేదిక ద్వారా తన దృష్టికి తెచ్చారని, అర్హులందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మున్సిపల్ చైర్మన్ శీలం వేణు పాల్గొన్నారు. 18 ఏళ్ల పింఛన్ ఆగిపోయింది నా భర్త 19 ఏళ్ల క్రితం చనిపోయిండు. 18 ఏళ్లుగా నాకు వితంతు పింఛన్ వస్తంది. నెల రోజుల క్రితం సర్వేకు వచ్చిన సారు... నా భర్త చనిపోయిన సర్టిఫికెట్ కావాలని అడిగిండు. అప్పుడు తీసుకోలేదు. లేదన్నాను. అప్పటి సర్టిఫికెట్ గిప్పుడెవలు ఇస్తరు. దీంతో పింఛన్ ఆగిపోయింది. సర్టిఫికెట్లు లేకున్నా పింఛన్ ఇత్తమని ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్పిండు. మస్త్ సంతోషమనిపించింది. నాకు మళ్ల పింఛన్ వస్తదని నమ్మిక వచ్చింది. - అందె లక్ష్మీబాయి, కోరుట్ల మూగబిడ్డకు పింఛన్ ఆపారు నా బిడ్డ పేరు గాజంగి స్వరూప. పుట్టు మూగ,చెవిటి. ఆమెకు 2008 నుంచి వికలాంగుల పింఛన్ వస్తంది. మొన్నటి నెలల దరఖాస్తు చేసుకొమ్మంటే చేసుకున్నం. సార్లు సర్వే చేసిండ్రు. ఏం జరిగిందో.. ఏమో గానీ నా బిడ్డకు అర్హత లేదని పింఛన్ ఆపేసిండ్రు. వికలాంగురాలైన నా బిడ్డకు పింఛన్ ఇంత ఆసరా ఉంటదనుకున్న. గిట్ల జేసిండ్రు. ఎవరికి చెప్పాలో తెలియలేదు. సాక్షి పేపర్ పుణ్యమా అని ఎమ్మెల్యే సాబ్ పింఛన్ ఇప్పిస్తనన్నడు. - గాజెంగి స్వరూప, కోరుట్ల 20వ వార్డు -
కాంగ్రెస్‌కు పాలించే సత్తా లేదు
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ నాయకులకు దమ్ము, సత్తా లేదని, వారు తెలంగాణను పాలించలేరని సినీనటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దారుణమేనని అన్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్‌రావుకు మద్దతుగా హుస్నాబాద్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రెండు ఎంపీ సీట్లున్న టీఆర్ఎస్తో తెలంగాణ రాలేదని, బీజేపీ మద్దతుతోనే చిరకాల స్వప్నం సాకారమైందని అన్నారు. కేసీఆర్ ఎంపీ సీట్లను రూ. 30 కోట్ల చెప్పున అమ్ముకున్నారని ఆరోపించా రు. సీమాంధ్రులను తిడుతూనే వారి సంబంధీకులకు టిక్కెట్లు ఇచ్చాడని ఆరోపించారు. కేసీఆర్‌కు అధికారంపై ఉన్న ఆరాటం అభివృద్ధిపై లేదన్నారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి సాగనంపాలని, కేంద్రంలో ఎన్డీఏకు అధికారం అప్పగించాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ బలమైన నాయకుడని, బీజేపీపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. ఎంపీ అనుకుంటే నిలబడి పనులు చేయాలని, ఆ సత్తా ఉన్న విద్యాసాగర్‌రావును కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని కోరారు. కేవలం ఎన్నికలప్పుడే రావడం కాదని, ఓట్లు అడిగి ముఖం చాటేయడం చేతకాదని, మళ్లీ హుస్నాబాద్ వచ్చి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు. పెద్దపల్లి టీడీపీ, రామగుండం బీజేపీ అభ్యర్థులైన గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీహెచ్.విజయరమణారావులకు మద్దతుగా ప్రచారం నిర్వహించాల్సి ఉందని, హెలిక్యాప్టర్‌లో సాంకేతిక కారణాల వల్ల అక్కడకు వెళ్లలేకపోయానని, దానికి చింతిస్తున్నానని తెలిపారు. వారిద్దరిని సైతం గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఓటు వేయడం బాధ్యతగా తీసుకోవాలని, మన భవిష్యత్తును ఆ ఒక్క రోజే నిర్ణయిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సభలో మాట్లాడే ముందు పవన్‌కల్యాణ్ తెలంగాణ అమరుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించి నివాళులు అర్పించారు. సభలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సిహెచ్.విద్యాసాగర్‌రావు, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, అప్కాబ్ మాజీ చైర్మన్ దేవిశెట్టి శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కొత్త శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటమే స్ఫూర్తి.. తెలంగాణ సాయుధ పోరాటమే తనకు స్పూర్తి అని, సమాజంలో అన్యాయం జరిగితే ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చిందని పవన్‌కల్యాణ్ తెలిపారు. టీఆర్ఎస్ పుట్టకముందు నుంచే తనకు తెలంగాణపై ప్రేమ ఉందన్నారు. సాయుధ పోరాట చరిత్రను చదవి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు. పొన్నం.. కేసీఆర్‌ను ఏంజేత్తండ్రు.. ‘ఈ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ నన్ను తిడుతున్నాడు.. పొన్నం.. సరే అబ్బ.. నన్నుతిడితే నేను పడతా.. కానీ కేసీఆర్ మిమ్మల్ని సవటలు.. సన్నాసులు అని తిడుతుంటే ఏమీ మాట్లాడరు.. మీ నాయకురాలిని.. మిమ్మల్ని బూతులు తిట్టినా స్పందించరు. నాపై మాత్రం విమర్శలు చేస్తారా..’ అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. -
కమలదళం
కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : నామినేషన్ల గడువు చివరి రోజున బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మంగళవారం రాత్రి వరకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సీహెచ్.విద్యాసాగర్‌రావు, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ అభ్యర్థులుగా సురభి భూంరావు, కన్నం అంజయ్యను ఖరారు చేయగా.. మిగిలిన నాలుగు స్థానాలపై ఉత్కంఠ ఏర్పడింది. చివరకు కరీంనగర్ నుంచి బండి సంజయ్‌కుమార్, సిరిసిల్ల ఆకుల విజయ, రామగుండం గుజ్జుల రామకృష్ణారెడ్డి, హుస్నాబాద్ దేవిశెట్టి శ్రీనివాసరావు, వేములవాడకు ఆది శ్రీనివాస్‌ను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈమేరకు అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వగా బుధవారం నామినేషన్ వేశారు. నలుగురు కొత్తవారే... బీజేపీ అభ్యర్థుల్లో నలుగురు పార్టీకి కొత్తవారే. కరీంనగర్ టికెట్ దక్కించుకున్న బండి సంజయ్ ఏబీవీపీలో, పార్టీలో చురు గ్గా పనిచేశారు. కౌన్సిలర్‌గా, కార్పొరేటర్ గా గతంలో ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కోరుట్లకు చెందిన సురభి భూంరావు గతంలో టీఆర్ఎస్లో ఉన్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్నేళ్లు స్తబ్ధుగా ఉన్న ఆయన కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. సిరిసిల్ల టికెట్ దక్కించుకున్న ఆకుల విజయ అంతకుముందు దేవేందర్‌గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీలో పనిచేశారు. భర్త కొట్టాల మోహన్‌రెడ్డితో కలిసి కొద్ది నెలల క్రితమే బీజేపీలో చేరారు. ధర్మపురి అభ్యర్థి కన్నం అంజయ్య వడ్కాపూర్ ఎంపీటీసీగా, దళిత మోర్చా అధ్యక్షుడిగా... ప్రస్తుతం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. హుస్నాబాద్ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాసరావు గతంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. రెండు నెలల క్రితమే బీజేపీలో చేరిన ఆయన అనూహ్యంగా చివరిక్షణంలో పార్టీ బీఫారం అందుకున్నారు. వేములవాడలో పార్టీకి సీనియర్ నాయకు లు, బలమైన క్యాడర్ ఉండగా... నియోజకవర్గంలో బాగా పట్టున్న ఆది శ్రీనివాస్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్ అప్పగించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గమైన పెద్దపల్లి పొత్తుల్లో భాగంగా టీడీపీకి వెళ్లడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రామగుండం సీటుకు మారారు. ఏడుగురు అభ్యర్థుల్లో గుజ్జులతోపాటు బండి సంజయ్, కన్న అంజయ్య మాత్రమే పార్టీలో మొదటినుంచి పనిచేస్తున్నారు. మిగతా నలుగురు కొత్తగా పార్టీలో చేరినవారే. వీరికి టికెట్ కేటాయించడంతో ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని పలువురు నాయకులు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీఫారం దోబూచులాట కరీంనగర్ నుంచి టికెట్ ఆశించిన ఎడవెల్లి విజయేందర్‌రెడ్డికి మొదటగా హుస్నాబాద్ స్థానం కేటాయించినట్లు ప్రకటించారు. ఆయన హుస్నాబాద్‌కు వెళ్లి నామినేషన్ వేసే సమయంలోనే.. దేవిశెట్టి శ్రీనివాస్‌రావు తనకు బీఫారం వచ్చిందని చెప్పడంతో విజయేందర్‌రెడ్డి అవాక్కయ్యారు. టికెట్ తనకే అని చెప్పిన పార్టీ చివరి నిమిషంలో శ్రీనివాసరావుకు ఇవ్వడంతో ఖిన్నుడైన విజయేందర్‌రెడ్డి భారమైన హృదయంతో నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు.