కుటుంబసభ్యులైనా రాజకీయాల్లో శత్రువులే
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావు
కోనరావుపేట, న్యూస్‌లైన్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని కుటుంబ సభ్యులతో సహా అందరినీ శత్రువులుగానే భావించాల్సి వస్తుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు.
కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కుటుంబసభ్యులే ప్రధాన ప్రత్యర్థులుగా మారి పోటీ చేయాల్సి వస్తుందని తెలిపారు. స్వయాన తన అన్న అల్లుడు వినోద్‌కుమార్ ప్రత్యర్థులుగా బరిలో ఉన్నామని, మరో సోదరుడి కుమారుడు రమేశ్‌బాబు వేములవాడ అసెంబ్లీ బరిలో మరో పార్టీ తరఫున బరిలో ఉన్నారని తెలిపారు.