ch. Vidyasagar Rao
-
అంబేద్కర్‌కు ఘన నివాళి
జనసంద్రంగా మారిన చైత్యభూమి సదుపాయాలు కల్పించిన బీఎంసీ అన్నదానం చేసిన స్వచ్ఛంద సంస్థలు సాక్షి, ముంబై: శివాజీపార్క్‌లోని చైత్యభూమి పరిసరాలు జనసంద్రంగా మారాయి. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని శనివారం దాదర్ ప్రాంతమంతా ఆయన అభిమానులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది జనం శుక్రవారం అర్ధరాత్రి నుంచి చైత్యభూమి వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం ప్రారంభించారు. శనివారం ఉదయం గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మేయర్ స్నేహల్ అంబేకర్, బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ నాయకుడు ప్రకాష్ ఆంబేకర్, ఆర్పీఐ నాయకుడు రాందాస్ ఆఠవలే, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన కొందరు కొత్త మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ చైత్యభూమికి పక్కనే ఉన్న ఇందు మిల్లు స్థలంలో 2015 ఏప్రిల్ 14న అంబేద్కర్ స్మారకానికి భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడతాయని చెప్పారు. మహాపరినిర్వాణ్ సందర్భంగా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అన్ని సౌకర్యాలు కల్పించింది. శివాజీపార్క్ మైదానంలో లక్ష చదరపు టడుగుల విస్తీర్ణంలో నేలపై కార్పెట్లు పరిచారు. మూడు రోజుల ముందు నుంచి ఇక్కడ అభిమానుల సందడి మొదలైంది. వారికి బస మొదలుకుని స్నానాల గదులు, తాగునీరు, సంచార మరుగు దొడ్లు, కుళాయిలు ఇతర సదుపాయాలు కల్పించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లు సిద్ధంగా ఉంచింది. తప్పిపోయిన వారి వివరాలు అందించేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బలగాలను మోహరించారు. వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అవసరమైతే అస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. చైత్యభూమికి సమీపంలో ఉన్న ఇందూ మిల్లు ఖాళీ స్థలంలో కూడా సౌకర్యాలు కల్పించారు. లక్షలాదిగా తరలివచ్చిన అంబేద్కర్ అభిమానులు ఇబ్బందులు పడకుండా శివాజీపార్క్ పరిసరాల్లో వాహనాల రాకపోకల్లో మార్పులు చేశారు. చైత్యభూమి ఇరువైపుల క్యూలో నిలబడేందుకు తాత్కాలిక బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ఇటు సెంచూరి బజార్, అటు మాహిం దిశగా ఫుట్‌పాత్‌లపై రెండు కి.మీ. మేర క్యూ లైను ఏర్పాటుచేశారు. శివాజీపార్క్ మైదానంలో అంబేద్కర్ ఆనుయాయులకు అనేక సేవా సంస్థలు అల్పాహారాలు, తాగు నీరు, భోజనం తదితరా తినుబండరాలు పంపిణీ చేశాయి. టీవీవీ ఆధ్వర్యంలో అన్నదానం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చైత్యభూమి వద్ద తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ), తెలుగు బహుజన మహాసభ (టీబీఎం) ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాన్ని టీబీఎం అధ్యక్షుడు నాగ్‌సేన్ మాల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీవీవీ కన్వీనర్ కె. నర్సింహ గౌడ్, భీవరత్న మాల, రాంతంగారే మాదిగ, తలారి నవీన్, చాందన్ అహ్మద్, సంపత్ కుమార్ మాదిగ, మూల్నివాసి మాల తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్.. సాగర్జీ
జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లావాసిని తొలిసారి గవర్నర్‌గిరీ వరించింది. బీజేపీ సీనియర్ నేత సీహెచ్. విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితు లయ్యారు. సాగర్‌జీకి ఉన్నత పదవితో జిల్లావ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. విద్యార్థి నాయకుడిగా ప్రారంభ మైన ఆయన ప్రస్థానంలో ఎన్నో విజయాలున్నాయి. శాసనసభాపక్ష నేతగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగానూ సేవలందించారు. ఇటీవల కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంతో అనూహ్యంగా సాగర్‌జీని గవర్నర్‌గా నియమించింది. విద్యార్థి నేత నుంచి... విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ నాయకుడిగా విద్యాసాగర్‌రావు గుర్తింపు పొందారు. 1972లో ‘లా’ చదువుతుండగా.. ఏబీవీపీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ‘మీస’ చట్టం కింద అరెస్టై ఏడాదిపాటు జైలు జీవితం తర్వాత జనసంఘ్‌లో రాష్ట్ర, జాతీయస్థాయి రాజకీయల్లో క్రియాశీలక పా త్ర పోషించారు. మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి (1985, 1989, 1994) ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. మూడుసార్లు బీజేపీ శాసనసభాపక్షనేతగా పనిచేశారు. జాతీ య నాయకత్వం ఆదేశాలతో 1998లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 1999లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా మళ్లీ ఎన్నికయ్యారు. అప్పుడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. కొన్నాళ్లు వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయమంత్రిగానూ పనిచేశారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏడు ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నుంచి పోటీచేసిన విద్యాసాగర్‌రావు తన మేనల్లుడు, టీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ చేతిలో ఓటమి పాలయ్యా రు. ప్రధాని మోడీతో సాగర్‌జీకి సన్నిహిత సం బంధాలున్నాయి. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పటేల్ విగ్రహ నిర్మాణం కోసం ఇనుము, ఇతర సామగ్రి సేకరణకు ఏర్పాటు చేసిన ఏక్తా ట్రస్ట్‌కు తెలంగాణలో విద్యాసాగర్‌రావే ఇన్చార్జిగా వ్యవహరించారు. కేంద్రం లో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అనూహ్యంగా సాగర్‌జీని గవర్నర్‌గిరీ వరించింది. ఇప్పటివరకు పీవీ.నర్సింహరావు మాత్రమే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసి జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో చాటారు. జాతీయస్థాయిలో.. విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడంతో జిల్లాకు తొలిసారి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటివరకు ఒక్క పీవీ.నర్సింహరావు మాత్రమే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసి జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో చాటి చెప్పారు. ఎమ్మెస్సార్, కాకా కన్న ముందే.. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు ఎం. సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్) గవర్నర్ పదవి కోసం, జి. వెంకటస్వామి(కాకా)రాష్ట్రపతి పదవి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కానీ వారి కల నెరవేరలేదు. వీరికి జాతీయస్థాయిలో పలుకుబడి ఉండటమే కాకుండా ఏఐసీసీలో అత్యున్నత పదవులు అనుభ వించి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలతో నేరుగా పరిచయాలు ఉన్నా.. వీరి ఆకాంక్ష నెరవేరలేదు. పలు సందర్భాల్లో కాకా, ఎమ్మెస్సార్లు ఆయా పదవులపై తమ మక్కువను బాహాటంగానే ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో వీరి కల నెరవేరకుండా పోయింది. జిల్లా నుంచి తొలిసారి గవర్నర్‌గా ఎన్నికైన సాగర్జీ.. పై ఇద్దరు నాయకుల తర్వాతే రాజకీయాల్లోకి రావడం గమనార్హం. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కరీంనగర్ అర్బన్ : విద్యాసాగర్‌రావుకు మహారాష్ట్ర గవర్నర్ పీఠం దక్కడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మెట్పల్లి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు. 1999లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏడు ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకున్నారు. 2003లో వరంగల్ జిల్లా పరకాలలో అమరదామాన్ని నిర్మించారు. గోదావరి నది జలాలు వృథాగా పోతుండడంతో ఆవేదన కు గురైన ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇటీవల నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పటేల్ విగ్రహ ం ఏర్పాటుకు ఏక్తా ట్రస్టు ఆధ్వర్యంలో విద్యాసాగర్‌రావు ప్రత్యేక దృష్టి సారించి గ్రామగ్రామాన ఇనుము, మట్టి సేకరించారు. గౌరవం దక్కించుకున్న సాగర్జీ ఇటీవల కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీచేసిన విద్యాసాగర్‌రావు ఓడిపోయారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం.. అప్పటికే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారన్న నమ్మకమున్న విద్యాసాగర్‌రావుకు గవర్నర్ గిరీ దక్కడం ద్వారా ఆయన తెలంగాణ ప్రాంతం నుంచే తొలిసారి అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తిగా చరిత్రకెక్కారు. అంబరాన్నంటిన సంబరాలు.. విద్యాసాగర్‌రావుకు గవర్నర్ పీఠం దక్కడంతో జిల్లాలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా స్వీట్లు పంచిపెట్టారు. టపాసులు కాల్చారు. -
బీజేపీ మద్దతుతోనే తెలంగాణ: విద్యాసాగర్ రావు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు నిప్పులు చెరిగారు. బుధవారం విద్యాసాగర్ రావు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతిపక్షనేతగా చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణపై బాబు అనుసరిస్తున్న వైఖరిపట్ల బాధ్యతారాహిత్యంగా ఉందని ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చంద్రబాబు పాత్ర శూన్యమని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి వర్గ బృందం(జీఓఎం)కు ఇచ్చే నివేదికపై తమ పార్టీకి కాలపరిమితి లేదని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ మద్దతు వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతుందని, తమ పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అసాధ్యమని విద్యాసాగర్ రావు తెలిపారు.