Chadalavada srinivasarao
-
యాక్షన్ ఎంటర్టైనర్
తమిళ, మలయాళ భాషల్లో యాక్షన్ హీరోగా చేసిన ఆర్.కె.సురేశ్ ‘శివలింగాపురం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తోట కృష్ణ దర్శకత్వంలో రావూరి అల్లికేశ్వరి సమర్పణలో రావూరి వెంకటస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. మధుబాల కథానాయిక. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ –‘‘అభిరుచితో ఆయన తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు. ‘‘గతంలో లిటిల్ హార్ట్స్, మా తల్లి గంగమ్మ, కొక్కొరోకో’ వంటి సినిమాలు తీశాను. మేము పెరిగిన లొకేషన్లో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు వెంకటస్వామి. ‘‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఫాంటసీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలిచాను. అన్న, చెల్లెలి సెంటిమెంట్ హైలైట్ అవుతుంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, సాయివెంకట్, రాకేష్ రెడ్డి, పద్మిని నాగులపల్లి, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలి తర్వాత శరభ
‘‘నరసింహారావు నా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘శరభ’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత నాకు విజువల్ పరంగా బాగా నచ్చిన చిత్రం ‘శరభ’’ అని నటుడు–దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. డా.జయప్రద, ఆకాశ్‌కుమార్, మిస్తి చక్రవర్తి, నెపోలియన్, నాజర్, పునీత్ ఇస్సార్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, పొన్వణ్ణన్, సాయాజీ షిండే, అవినాష్, పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘శరభ’. యన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం మేకింగ్ వీడియోను ఆర్.నారాయణమూర్తి, ట్రైలర్‌ను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా చిత్రమిది. ‘భక్త ప్రహ్లాద’ తర్వాత అంత గొప్పగా ఆడుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా టెక్నీషియన్లందరూ కలిసి నన్ను శంకర్ స్థాయిలో నిలబెట్టేలా కృషి చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు అశ్వనీకుమార్ సహదేవ్. ‘‘సినిమా వాడిగా పుట్టడం గొప్ప విషయం. నా బ్యానర్లో తొలి సినిమాగా ఎన్టీఆర్‌గారి ‘జీవిత ఖైదు’ విడుదల చేశాను. ఏఎన్నార్గారితోనూ చేశాను. మధ్యలో చాలా సినిమాలు చేశా. ఇప్పుడు ‘శరభ’ రిలీజ్ చేస్తున్నా. నేను జయప్రదగారికి పెద్ద ఫ్యాన్’’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ‘‘నేను ఫోన్ చేయగానే నా మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న చదలవాడ శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. నేను తెలుగమ్మాయిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో నటించినప్పుడు ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుంది. నాకు తెలుగు ఇండస్ట్రీ అమ్మలాంటిది’’ అన్నారు జయప్రద. మిస్తి చక్రవర్తి పాల్గొన్నారు. -
అంతరిక్షంలో టిక్ టిక్
‘జయం’ రవి, నివేదా పేతురాజ్ జంటగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో అంతరిక్ష (స్పేస్) నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘టిక్ టిక్ టిక్’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని తెలుగులో త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘జనవరి 1న నేను ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌పై కూర్చున్నప్పుడు ఓ ఫారిన్ కపుల్ వచ్చి, ‘మీది ఇండియానా?’ అనడిగారు. అవునని చెప్పా. ‘బాహుబలి’ పదిసార్లు చూశామన్నారు. మన ఇండియన్ సినిమాకి అంత గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ మనవాళ్లు అమెరికన్ సినిమాలు చూస్తారు. అటువంటి స్థాయిలో తీసిన సినిమా ‘టిక్ టిక్ టిక్’’ అన్నారు. ‘‘మన దేశంలో వచ్చిన ఫస్ట్ స్పేస్ ఫిల్మ్ ఇది. ఇటువంటి సినిమాలను ఈజీగా చేయలేం. ఒక్కొక్క షాట్ వెనుక చాలా కష్టం ఉంటుంది. టీజర్, ట్రైలర్లలో ప్రేక్షకులు చూసినదాని కంటే సినిమాలో పది రెట్లు ఎక్కువ ఉంటుంది’’ అన్నారు ‘జయం’ రవి. ‘‘స్టార్ వార్స్’ టైమ్ నుంచి స్పేస్ నేపథ్యంలో ఇండియాలో ఎవరు సినిమా చేస్తారా? అనుకునేవాణ్ణి. తమిళంలో ‘టిక్ టిక్ టిక్’ చేస్తున్నారని తెలిసి పోటీ ఎక్కువగా ఉన్నా తెలుగు హక్కులు తీసుకున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు చదలవాడ లక్ష్మణ్. దర్శకులు అజయ్, అల్లాణి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, కెమెరా: వెంకటేశ్. -
పూరీని కాదని.. కొత్త దర్శకుడితో..
సందేశాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న నటుడు ఆర్.నారాయణమూర్తి. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఎదిగిన నారాయణమూర్తి కొంత కాలంగా తన స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. దాసరి లాంటి దిగ్దర్శకుల సినిమాల్లో హీరోగా నటించిన నారాయణమూర్తి.., ఈ జనరేషన్ దర్శకులు పిలిచి అవకాశాలు ఇచ్చినా కాదనేశారు. టెంపర్ సినిమా సమయంలో పూరి జగన్నాథ్, ఓ కీలక పాత్రకు ఆర్ నారాయణమూర్తిని సంప్రదించినా.. బయటి దర్శకులతో కలిసి పనిచేసే ఉద్దేశం లేదంటూ కాదన్నారు. అయితే ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించారు పీపుల్స్ స్టార్. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధించిన చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడిగా మారి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ నచ్చటంతో నారాయణమూర్తి టైటిల్ రోల్ పోషించేందుకు అంగకీరించారు. ఈ సినిమాలో నారాయణమూర్తి జంటగా స్టార్ హీరోయిన్ జయసుథ నటిస్తుండటం విశేషం. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నాడు.