chaganti koteshwarrao
-
హైందవ ధర్మాన్ని విదేశాల్లో కూడా ప్రచారం చేయాలి : శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి
-
కుడి ఎడమలు వేరు కాదు...
మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది. ఒకానొకప్పుడు విభావసుడు, సుప్రదీపుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. చాలా మంచివాళ్ళు. అపార ఐశ్వర్యానికి వారసులు. అకస్మాత్తుగా ఒకరోజు తమ్ముడు వచ్చి ఆస్తిలో తనవాటా పంచివ్వమని అడిగాడు. సర్దిచెప్పి అనునయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగిన అన్న ఆగ్రహోదగ్రుడైనాడు. నన్ను అగౌరవపరిచినందుకు ఏనుగువై అడవులను పట్టుకు తిరుగుపో... అంటూ శపించాడు. తమ్ముడు కూడా ఏం తక్కువ తినలేదు. నువ్వొక తాబేలువయి చెరువుల్లో పడి ఉండమని తిరిగి అన్నను శపించాడు. ఇద్దరి జన్మలు వేరువేరు. రెండూవేర్వేరు జంతువులయినా శత్రుభావనలుండిపోయాయి. తరచూ కలహించుకుంటూండేవి. ఒకసారి గరుత్మంతుడికి ఆకలేసి తండ్రి కశ్యప ప్రజాపతిని అడిగితే... ఆ రెండింటినీ తినెయ్యమన్నాడు. ఇది కథే కావచ్చు... ఇటువంటి కథలను విని పాఠాలు నేర్చుకోకపోతే... మనం నిత్యం చూసే అన్నదమ్ముల గొడవలు ఇలానే ముగుస్తుంటాయి. అందుకే బంధువులతో తగాదాలు శ్రేయస్కరం కాదు. అవి వారిద్దరితో పోవు... కుటుంబాలకు కుటుంబాలు తరాల తరబడి కక్షలు పెంచుకుని అన్నివిధాలా నష్టపోతుంటారు. నలుగురిలో చులకనౌతుంటారు. చిన్నతనంలో నువ్వేం అలవాటు చేసుకుంటావో అదే పెద్దయిన తరువాత కూడా నిలబడిపోతుంది. చిన్నప్పుడు దుర్యోధనుడు పొద్దస్తమానం భీముడితో కలియబడుతుండేవాడు. భీముడిమీద అక్కసు పెంచుకున్నాడు. అదే చిట్టచివరికి కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళింది. చిన్నప్పటి పగ భీముడు దుర్యోధనుడి తొడ విరగ్గొట్టేదాకా వెళ్ళింది. చిన్నప్పుడు కలిసిమెలిసి ఉంటే పెద్దయిన తరువాత కూడా సఖ్యత గా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో క్రికెట్ ఆటలో కనబరుస్తున్న నైపుణ్యం చూసి అన్న అజిత్ టెండూల్కర్ క్రికెట్ ఆటను నేర్పించే అచ్రేకర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయన ఒక పరీక్షపెట్టాడు. అచ్రేకర్ పట్ల ఉన్న భయాందోళనలతో ఆ పరీక్ష సచిన్ నెగ్గలేకపోయాడు. శిష్యుడిగా తీసుకోవడానికి ఆయన నిరాకరించాడు. కానీ అన్న వదలకుండా... ‘‘మిమ్మల్ని చూసి భయపడినట్టున్నాడు. నిజానికి బాగా ఆడతాడు. మరొక్క అవకాశం ఇవ్వమని బతిమిలాడుకున్నాడు. మీరు దూరంగా ఉండి పరిశీలించమన్నాడు. ఈసారి గురువు అక్కడ లేడనే ధైర్యం కొద్దీ సచిన్ అద్భుతంగా ఆడాడు. సచిన్‌ను శిష్యుడిగా స్వీకరించడానికి వెంటనే అచ్రేకర్ సమ్మతించాడు. ఇదెలా సాధ్యపడింది...అన్నదమ్ముల సఖ్యత వల్ల. అబ్దుల్ కలాంగారికి మద్రాస్‌లో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వస్తే... ఫీజు కట్టడానికి తండ్రివద్ద అంత డబ్బు లేదు. అప్పటికే పెళ్ళయిపోయిన అతని సోదరి జోహ్రా తన నగలు తాకట్టుపెట్టి డబ్బు సర్దుబాటు చేసింది. ఇదెలా సాధ్యపడింది ... తోడబుట్టినవారి సఖ్యత కారణంగానే కదా ... అందువల్ల పాండవుల్లా, రామలక్ష్మణభరతశత్రుఘ్నుల్లా చిన్నప్పటినుంచి కలిసుండడం అలవాటు కావాలి. పెద్దయ్యాక మారడం అంత తేలిక కాదు. అదే బద్దెనగారు చెప్పేది... ఆస్తులు, అంతస్తులు, హోదాలు, లేదా మాటామాటా పెరిగి వాదులాడుకోవడాలవంటివి మనసులో ఉంచుకుని, పైకి సఖ్యత నటిస్తూ బంధువులను చిన్నచూపు చూడవద్దు. వారిని దూరం చేసుకోవద్దు. ఎక్కడికెళ్ళినా స్నేహితులు, శ్రేయోభిలాషులు దొరుకుతారు... కానీ జన్మతః నీకు భగవంతుడు అనుగ్రహించిన బంధువులు ఈ జన్మకు మళ్ళీ దొరకరు. కుడి చేయి ఎడమ చేయి వేరు కాదు. దేని బలం దానికున్నా.. ఆ రెండూ కలిస్తే బలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. చిన్నప్పటినుంచి ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉన్న కారణంగా ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవాలి. అప్పుడు మీ ఐకమత్యబలం సమాజంలో మరో నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. -
విద్వాన్ సర్వత్ర పూజ్యతే!
ధనం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంలో ఉండే భౌతికమైన ధనం. రెండవది మానసిక ధనం. మూడవది పుణ్యరూపమయిన ధనం. ఈ మూడూ సమానమైన ప్రాతినిధ్యాన్ని, సమానమైన ప్రతిపత్తిని పొంది ఉంటాయి. అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకోకపోతే మాత్రం బాహ్యంలో ధనమున్నప్పటికీ అది ప్రమాదహేతువై కూర్చుంటుంది. అందుకే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో – సరస్వతీదేవి, లక్ష్మీదేవి.. ఇద్దరి అనుగ్రహం అవసరమేనని అంటారు. సరస్వతీకటాక్షం లేని లక్ష్మీదేవికటాక్షం బాహ్యంలో భయ హేతువు. ఐశ్వర్యం ఉంది. చదువు లేదు. ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. అంతరంలో–ఎక్కడ దానం చేయాలో తెలియదు, అపాత్రదానం చేసి తనకున్న వైభవాన్ని పాడుచేసుకుంటాడు. అదే సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీకటాక్షంలో అభ్యున్నతి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరస్వతీ కటాక్షమున్నవారికి లక్ష్మీకటాక్షం లేకపోవడం అన్నమాట ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత చదువున్నా తాదాత్మ్యత చెందడు. ప్రసాదబుద్ధితో బతుకుతుంటాడు. ‘ఇవన్నీ నావి కావమ్మా, నీ పాదాలు పట్టుకోవడం చేత వచ్చిన కీర్తి’ అనే భావనతో ఉంటాడు. అది అభ్యున్నతికి హేతువవుతుంది. ఇది బాహ్యంలో శాంతికి, భోగాన్ని అనుభవించడానికి, పుణ్యకర్మ చేయడానికి అత్యంత ప్రధానం. రెండవది మానసిక ధనం. అంటే శాంతి. శాస్త్ర ప్రకారం మనం ఏది చేసినా...‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అంటాం. తాను శాంతంగా ఉండాలి. పదిమందిని శాంతంగా ఉంచగలగాలి. ప్రశాంతంగా ఉండడంకన్నా ఐశ్వర్యం లోకంలో మరొకటి ఉండదు. బాహ్యంలో ఎంత ఐశ్వర్యవంతుడయినా తనకింకా ఏదో లేదనే బాధతో బతికేవాడు దరిద్రుడు. తనకి ఏది లేకపోయినా ‘నాకేం తక్కువయిందని’..అన్నభావనతో బతికేవాడు మహదైశ్వర్యవంతుడు. కొంతమంది పూరింట్లో ఉన్నా ఎంతో తృప్తిగా జీవిస్తుంటారు. పెద్దపెద్ద రాజభవంతుల్లో ఉన్నా ఇంకా ఏదో లేదని ఎప్పుడూ వెంపర్లాడుతుండేవాడు నిత్య దరిద్రుడు. అందుకే మానసికమైన ధనం భౌతికమైన ధనం కన్నా చాలా గొప్పది. ఐశ్వర్యమయినా, ఆనందమయినా మానసికమైన ధనాన్ని ఆవహించి ఉంటాయి. మూడవది పుణ్యధనం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు. మంచిదే. ఇక్కడ ధనవంతుడిగా ఉన్నావు. మంచిదే. కానీ జన్మ పరంపర ఇక్కడితో ఆగిపోతుందని నమ్మకం ఏమిటి? జ్ఞానం కలుగుతుందనీ, దానివల్ల పునరావృతి పొందవనీ, మళ్ళీ జన్మ స్వీకరించవనీ నమ్మకమేం లేదుగా! ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ, ప్రశాంతత కానీ గత జన్మల పుణ్యఫలమేగా! దానిని నీవు అనుభవిస్తున్న కొద్దీ ఖర్చయిపోతుంటుందిగా! మరి వచ్చే జన్మకి పుణ్యం ఎక్కడినుంచి వస్తుంది ? ఇక్కడి ధనాన్ని, ఇక్కడి పుణ్యాన్ని, ఇక్కడి తెలివిని, ఇక్కడి శక్తిని పుణ్యం కింద మార్చుకోవాలిగా! అదెలా మారుతుంది? పాండిత్యం ఉంటే నీకున్న పాండిత్యాన్ని పదిమందికీ పంచి పెట్టడానికి ఉపయోగిస్తే అది అందరికీ చేరుతుంది. తరగని సంపదలా నీ వద్దే ఉంటుంది కూడా! అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! -
రావణా! నిన్ను చంపింది రాముడు కాదు!
సాధారణంగా ఎటువంటి స్త్రీఅయినా తట్టుకోలేని శోకం ఎప్పుడు అనుభవిస్తుందంటే... భర్త అలాగే కడుపున పుట్టిన కొడుకు దిగజారిపోయినప్పుడు... ఆ దుఃఖానికి అవధి ఉండదు. మండోదరి మహా పతివ్రత. మయుడు, హేమల కుమార్తె. పది తలలు ఉన్న రావణాసురుని పట్టమహిషి. ఇంత గొప్పది. రావణుడి వక్షస్థలాన్ని చీల్చుకుని, గుండెను ఛేదించుకుని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తూణీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమ్మీద పడిపోయి ఉంటే... గద్దలు, రాబందులు పైన ఎగురుతుంటే... దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే... మండోదరికి కబురందించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధభూమికొచ్చింది. రావణుడి శరీరానికి కొద్దిదూరంలో ఒక చెట్టుకింద రామలక్ష్మణులు, పక్కన విభీషణుడు నిలబడి ఉన్నాడు. సాధారణంగా ఆ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా వెంటనే... రాముడెక్కడ? అని అడుగుతుంది లేదా తన భర్తను చంపేసాడన్న కోపంతో రాముడిని నింద చేస్తూ విరుచుకుపడుతుంది.. అని అనుకుంటారు. కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే...పల్లకీ దిగి రావణుడి దగ్గరకెళ్ళి... ఏడుస్తూ...‘‘వీళ్లందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటున్నది రావణా! రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు... నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకానొకనాడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్లు నీ ఇంద్రియాలను తపస్సు కోసం తొక్కిపట్టావు. నువ్వు బలవంతంగా వాటిని కోరికలకోసం తొక్కిపెట్టావు. తొక్కి పెట్టిన కాలుకింద నుంచి తప్పించుకున్న పాములా పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేసాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు... అయినా నాలోలేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది?’’ ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లడడం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది. ఎటువంటి నిష్పక్షపాత తీర్పు చెప్పిందో చూడండి! అదీ ఈ జాతివైభవం. ఈ ఒక్కమాట లోకానికి అందితే జాతి చేయకూడని పొరబాట్లు చేయదు. పిల్లలకు పాఠశాలల్లో రామాయణం చెపితే తప్పు, భారత భాగవతాలు చెపితే తప్పు. మంచి శ్లోకం ఉండకూడదు... అన్నప్పుడు సంస్కారం ఎక్కడినుంచి అందుతుంది? ఒక పాత్రలో పాయసం పోశారు. అది రాగిపాత్ర. మరొక బంగారు పాత్రలో పాయసం పోసారు. బంగారు పాత్రలోది తాగినా, రాగిపాత్రలోది తాగినా పాయసానికి రుచి ఒకటే. రాగి పాత్ర నీదయినప్పుడు ధర్మం తప్పకుండా రాగిపాత్రలోనే తాగు. నీది కాని బంగారు పాత్రలోది తాగాలని మాత్రం అలమటించకు. పాత్ర మెరుగులు, మిలమిలలు చూసి గీత దాటితే భ్రష్టుడవయిపోతావు. కొన్ని కోట్ల జన్మలు కిందకు జారిపోతావు. మండోదరిలాంటి స్త్రీల వారసత్వం ఈ జాతి సంపద. ఎక్కడున్నా వాళ్లు భర్తకు శాంతి స్థానాలు. వాళ్ళు భర్తలకు మంచి మాటలు చెప్పారు తప్ప భర్త పరిధి దాటి అక్కరలేని విషయాల జోలికి వెళ్ళి పైపై మెరుగులకోసం, తాత్కాలిక సుఖాలకోసం కష్టాలను కౌగిలించుకోవాలని ఎన్నడూ ప్రబోధం చేయలేదు.. -
నేరాల సంఖ్య తగ్గాలంటే..?
లలితాపరా భట్టారికా స్వరూపాన్ని చూడడానికి ఏ కాంచీపురమో, శృంగేరీయో వెళ్ళక్కరలేదు, అప్పుడే పుట్టిన తన పిల్లలకు పాలు ఇస్తున్న కుక్కలో కనబడుతుంది. తన్నుకు పోవడానికి వచ్చిన గద్దనుంచి రక్షించడానికి పిల్లలను రెక్కల కింద దాచిని కోడిపెట్ట కళ్ళల్లో ఆ మాతృత్వం, లలితా పరా భట్టారికా తత్త్వం కనబడుతుంది. ఆ మాతృత్వానికున్న విశేషం ఏమిటో నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్న నాడు ప్రతి స్త్రీలో నిబిడీకృతమై ఉన్న మాతృత్వాన్ని చూడవచ్చు. ‘‘కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావనచేత మరలువాడు..‘‘ అంటారు పోతన గురించి. ఇంత పరమ పవిత్రమైన అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి–అని ఆమె పాదాలను చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైన భావనలు మనసులో పొంగే అవకాశమే ఉండదు. మాతృత్వం చేత స్త్రీ పట్టాభిషేకాన్ని పొందింది. ఈ జాతిలో అన్యభావనలు, అనవసర విషయాలు ఎప్పుడు ప్రబలుతాయి? మన సంస్కృతిని ఉపదేశం చేయనప్పుడు, కావ్యాలు, పురాణాల్లో ఎంతో గొప్పగా చెప్పబడిన స్త్రీ వైశిష్ట్యాన్ని ప్రబోధం చేయడం ఆగిపోయినప్పుడు... నేర మనస్తత్వం పెరుగుతుంది. మన శాస్త్రాల్లోని మంచి మాటలు, స్త్రీలను గౌరవిస్తూ వేదాలు చెప్పిన విషయాలు మనం మన పిల్లలకు చెప్పగలిగినప్పుడు, చెప్పినప్పుడు అసలు నేరాల సంఖ్య ఇలా అయితే ఉండదు. ఆమె చదువుకుందా లేదా అన్నదానితో సంబంధం ఉండదు. అవసరమయితే తన ప్రాణాన్ని ఇస్తుంది. అది పురుషుడివల్ల వశం కాదు. ఒకసారి తన ముగ్గురు బిడ్డలు, భరత్‌తో కలిసి ఒక సాధారణ ప్యాసింజరు రైలనుకుని వేరొక రైలెక్కిన నిరక్షాస్యురాలయిన ఒక పేద స్త్రీ. విషయం తెలుసుకుని దిగిన తరువాత చూసుకుంటే ఒక బిడ్డ లోపలే ఉండిపోయాడని తెలిసి.. ప్రాణాలకు తెగించి అప్పుడే బయల్దేరిన రైలువెంట పరుగులు తీస్తున్నది. ఛస్తావని అందరూ చివరకు భర్తకూడా హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ప్లాట్‌ఫారమ్ మీద పరుగులు తీస్తుంటే చూసిన రైల్వే అధికారి ఒకరు రైలును ఆపించి బిడ్డను తల్లికి చేర్చారు. బిడ్డను తీసుకొచ్చేలోగా ఆమె స్పృహ తప్పింది. తరువాత బిడ్డను తడిమి చూసుకుని ఆమె పడ్డ ఆనందం మాటల్లో చెప్పనలవికాదు. అది కేవలం తల్లికే సాధ్యమయిన విశిష్ట లక్షణం. ఒక ప్రత్యేకమైన యాగం చేస్తే పితృరుణం తీరుతుంది. కానీ మాతృరుణం అలా తీరేది కాదని వేదం చెప్పింది. అందుకే దేశంలో ఒక సత్సంప్రదాయం ఉంది. సన్యాసం తీసుకుని పీఠాధిపత్యం పొందిన తరువాత ఆయనను చూడడానికి పూర్వాశ్రమంలోని తండ్రి వెడితే... మిగిలిన అందరిలాగే దర్శించుకుని నమస్కారం చేసి రావాల్సి ఉంటుంది. అంతే తప్ప మరో ఏర్పాటేదీ ఉండదు. అదే తల్లి కనబడిందనుకోండి. అప్పటిదాకా కూర్చుని ఉన్న పీఠాధిపతి లేచి నిలబడాలి. తల్లి అన్న మాటకు సన్యాసాశ్రమంలో కూడా అంత గౌరవం ఇచ్చింది శాస్త్రం. పరమాత్ముడంతటివాడు కూడా అంత విలువనిస్తాడు. స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారానికి కూడా మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఇంత గౌరవం, ఇంత ప్రాధాన్యత ఆమెపట్ల మాత్రమే ప్రకాశిస్తాయి. అది పురుషుని శరీరం విషయంలో అలా ప్రకాశించదు. -
కొత్తదనం... మనిషిలోనే ఉంది
అనంతమైన దేవుని కాలాన్ని రోజులు, నెలలు, ఏడాదులంటూ ‘ఖండాలు’ చేసి ఆ ఖండాలను ‘కేలెండర్ల’లో రకరకాల పేర్లతో బిగించాడు మానవుడు. అలాంటి ఒక క్యాలెండరు పాతబడి, కొత్త క్యాలెండరుగా గోడకెక్కుతున్న మరో ‘కొత్త ఏడాది’కి ముందున్న ప్రాంగణంలో మనం నిలబడి ఉన్నాం. సూర్యుని పోకడలు, కదలికలు, దాగుడుమూతలతో సాగే మనందరి ‘కాలం’ మన ప్రమేయం లేకుండానే ఒకరోజున అర్ధాంతరంగా ముగుస్తుంది. మరి అప్పుడేమవుతుంది? అక్కడినుండి కాలం తాకని, దాని నీడ కూడా పడని ‘నిత్యత్వం’ దేవునిలో/తో విశ్వాసి అనుభవైకం పొందుతాడని బైబిల్ చెబుతోంది. బైబిల్ సందేశమంతటికీ మూల వాక్యంగా చెప్పుకోతగిన ‘దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానిలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ జీవితానికి అతీతమైన నిత్యజీవితాన్ని కానుకగా పొందాలని దేవుడు అనుగ్రహించాడు’ అన్న ఆ వాక్య భాగమే నిత్యత్వానికి పునాది (యోహాను 3:16).పగలు, చీకటి, బతకడం, చావడం ఇదే కదా మన జీవితం.. కాని వీటి ప్రమేయం లేనిదే దేవునిలో విశ్వాసి అనుభవించే ‘నిత్యజీవితం’. మరణంతో అంతమయ్యేది జీవితమని, మరణానంతరం ఆరంభమయ్యేది నిత్యజీవితమన్నది చాలామంది అభిప్రాయం. కానీ బేతని సోదరీమణులైన మార్త, మరియల ఏకైక సోదరుడు లాజరు రోగియై మరణించినపుడు, వారితో జరిపిన పారలౌకిక చర్చలో యేసు అందుకు భిన్నమైన సత్యాలను ఆవిష్కరించాడు. రోగిగా ఉన్నపుడే నీవు వచ్చి బాగుచేసి ఉంటె నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదని వాపోయింది మార్త ఆలస్యంగా వచ్చిన యేసు ప్రభువుతో. మరణం తన సోదరుని జీవితాన్ని అర్ధాంతరంగా తుంచేసిందన్నది మార్త బాధ పాపం!! అంత్యదినమున యూదుల పునరుత్థానంలో తన సోదరుడు తిరిగి లేస్తాడని తాను నమ్ముతాను కాని అప్పటివరకూ తాను లాజరును చూడలేను కదా అంటూ ఆమె బాధపడింది. అయితే ‘నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని, నాలో నివసించేవాడికి మరణం లేదంటూ’ యేసుప్రభువు ఆ రోజు ఆమెకిచ్చిన అద్భుతమైన వాగ్దానం లాంటి జవాబు భూలోకంలో ప్రతి మూలనా ఈ రోజు కూడా ప్రతిధ్వనిస్తోంది. నిత్యజీవితం మరణానంతరం ఆరంభమయ్యేది కాదు, ‘నిత్యజీవితం’ మన ఈ లోక జీవితానికి దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన విస్తరణ మాత్రమే అన్నది ప్రభువు తాత్పర్యం. అందుకే నిత్యజీవితానికి ఈ లోకంలోనే పునాదులు వేసుకోవాలని ప్రభువు బోధించాడు. ప్రభువులో ఉన్నవాడు ఇప్పటికే నిత్యజీవితాన్ని కలిగి ఉన్నాడని దానర్ధం. జీవితం అనే తాత్కాలికమైన దృష్టితో కాక, నిత్యజీవితం అనే శాశ్వత దృష్టితో, విలువలతో ఆలోచించేవాడు, జీవించేవాడు, పరలోకంలో ధనవంతుడని యేసుప్రభువు అత్యంత స్పష్టంగా బోధించాడు (మత్త 6:20). అందుకే ప్రతిసారీ మనం ఎదురుచూసే ఏడాది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నిత్యజీవితానికి మనం పునాదులు వేసుకునేది ఇందులోనే. సూర్యుడు తాకిన ప్రతిదీ ఈ లోకంలో పాతదైపోతుంది. అందుకే కొన్ని నెలల క్రితం కొత్త యేడాదంటూ మనమంతా ముచ్చటపడి ఎన్నో కొత్త ఆశలతో, ఆశయాలతో స్వాగతం పలికిన ఈ ఏడాది అనే కాల ఖండం ఇపుడు పాతదై పోయి దీనంగా కనిపిస్తోంది.. కానీ దేవుడు దేన్ని తాకినా అది పాతదైనా సరే కొత్తదై పోతుంది. అందువల్ల ఒక్క మానవునిలో తప్ప, ఈ విశ్వమంతటిలో అసలు కొత్తదనమనేదే లేదు. అయితే దేవుని హృదయాన్నెరిగి జీవించే ప్రతి వ్యక్తీ దేవునిలో నిరంతరం వినూత్నమవుతూ నూతన çసృష్టిగా వెలుగొందుతాడు. అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని కాదు, హ్యాపీ న్యూ మ్యాన్... అని ఒకర్నొకరు అభినందించుకోవాలేమో!!! మనిషి కొత్తవాడైతే విశ్వమంతా కొత్తదే, రోజులు, నెలలు, ఏడాదులు కూడా కొత్తవే అంటాడు దేవుడు. (2 కొరింతి 5:17) – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి పరిశుభ్రత అనేది ఎప్పుడూ రెండు అంశాలుగా ఉంటుంది. ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత, రెండవది సామాజిక పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత అంటే ముఖానికి ఏదో పులుముకుని సువాసనలు వెదజల్లడం కాదు. కట్టుకున్న బట్టలు, కాళ్ళకు తొడుక్కునే మేజోళ్ల వరకు శుభ్రంగా ఎప్పటికప్పుడు ఉతికి ఆరేసినవి వేసుకోవాలి. విద్యార్థులుగా మీ అమ్మగారికి మీరు చేయవలసిన మహోపకారం ఏమిటంటే...ఇంట్లో ఉన్నప్పుడు కనీసం మీ పనులను మీరు స్వయంగా చక్కబెట్టుకోగలగడం. మీ పుస్తకాలు, మీ వస్తువులు పని అయిన తరువాత వాటిని వాటి స్థానాల్లో సర్దిపెట్టుకోవడం, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోగలిగితే, మీ బట్టలు మీరు ఉతుక్కోగలిగితే, పరిశుభ్రతలోని శ్రామిక సౌందర్యం, దాని విస్తృత ప్రయోజనం మీకు సులభంగా బోధపడుతుంది.ఒకసారి గాంధీగారు ఆశ్రమంలోకి వెడుతుంటే ఒక ఉపాధ్యాయురాలు వచ్చి నమస్కారం చేసింది. ముందుకు వెళ్ళిపోతున్న గాంధీగారు ఒక్క నిమిషం వెనక్కి వచ్చి ఆమెచేతి గోళ్ళుచూసి...‘‘నీ చేతి గోళ్ళు అంత పెరిగి ఉన్నాయి. అలా ఉంటే మట్టి చేరుతుంది. సూక్ష్మ జీవులు చేరతాయి. అన్నం తిన్నప్పుడు లోపలికి వెళ్ళి వ్యాథులు కలగచేస్తాయి. పది మంది పిల్లలకు పాఠాలు చెప్పేదానివి. నీవే గోళ్ళు అలా ఉంచుకుంటే పరిశుభ్రత గురించి పిల్లలకు ఏం చెబుతావు? ఇకమీదట పాఠం చెప్పేటప్పుడు గోళ్ళు తీసి వెళ్ళు’’ అని సుతిమెత్తగా మందలించారు.ఆయన ఒకసారి కాశీ విశ్వనాథ దేవాలయానికి వెళ్లారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండడం చూసి చలించిపోయారు. దేవాలయంలో దర్శనం చేసుకున్న తరువాత ప్రధాన అర్చకుడికి దక్షిణ ఇచ్చేటప్పడు తన జేబంతా వెతికి తన దగ్గరున్న నాణాలలో అతి తక్కువ విలువున్న దానిని తీసి అతని చేతిలో వేసి ‘పవిత్రమైన ఈ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలి కదా. నిర్మాల్యాన్ని తీసి శుభ్రపరచకపోతే ఎలా..?’ అని మందలించబోతే.. ఆ అర్చకుడు..‘‘ఇంతసేపు వెతికి ఇంత చిన్న నాణాన్ని వేసావు. నరకానికి పోతావ్.’’ అని అక్కసు వెళ్ళబోసుకున్నాడు. వెంటనే గాంధీజీ ‘‘నరకానికి పోవాల్సిఉంటే అక్కడికే పోతాను గానీ, నువ్వు ముందు పరిశుభ్రత నేర్చుకో, పాటించు’’ అని చెప్పారు.వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. మన ప్రమేయం లేకుండా కూడా వ్యాధులు వస్తుంటాయి. నిర్లక్ష్యంతో కూడా వస్తుంటాయి. ఏది ఎలా వచ్చినా మన విలువయిన కాలం ఎంత వథా అవుతున్నదో ఒక్కసారి ఆలోచించండి. రాకూడని వ్యాధి వచ్చి మంచం పడితే ఎన్ని తరగతులు, ఎన్ని పాఠాలు, ఎంత విలువైన కాలం వృథా అవుతుందో, మనల్ని ఎంత వెనక్కి నెట్టేస్తుందో ఆలోచించండి. ప్రస్తుతం ప్రభుత్వాలు ఆరోగ్య, వైద్య శాఖల పద్దుల కింద కొన్ని వందల కోట్ల రూపాయలు ఏటా ఖర్చుపెడుతున్నాయి. అదే మనలో ప్రతి ఒక్కరం ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే అంటే... ఆహారవిహారాల్లో, పరిసరాల్లో – శుచి, శుభ్రత పాటిస్తే... మీరేం దీనికి పెద్దగా శ్రమపడక్కర్లేదు, తినేటప్పడు చేతులు, కాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి అలవాటు చేసుకుంటే చాలు!అలాగే గాంధీగారు ఒక మాట చెప్పేవారు. ‘ఒక వ్యక్తి శుభ్రత అనేది ఎలా తెలుస్తుంది? చీకట్లో కూడా ఒక వ్యక్తి తన వస్తువులు తాను సులభంగా తెచ్చుకోగలిగినప్పడు... ఆ వ్యక్తికి వస్తువులు వాడుకున్న తరువాత తిరిగి వాటిని యథాస్థానంలో ఉంచే అలవాటుందనీ, పరిసరాల పరిశుభ్రత పట్ల సరియైన అవగాహనతో ఉన్నాడని గ్రహించవచ్చు.’ అనేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ పనిచేస్తున్నా పరిశుభ్రతకోసం పరితపించేవారు, అది ఫొటోల కోసం చేయలేదు. తాను నమ్మి, ఆచరిస్తూ, అందర్నీ చైతన్యపరిచేవాడు. -
గృహస్థు అతిథి పూజలో తరించాలి
మీ ఇంట పెళ్ళి జరగబోతున్నది. శుభలేఖ వేస్తారు. అందులో ‘మంగళం మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ’ అని రాస్తారు. అయ్యా! మంగళములను అపేక్షించి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీవంటి పెద్దల పాద స్పర్శచేత మా మంటపం పునీతమవుతుందన్న భావనతో ‘మదర్పిత చందనతాంబూలాది సత్కారాలు గ్రహించి మమ్మానందింప చేయ ప్రార్థన’ అని కూడా రాస్తారు. చందనతాంబూలాది... అన్న తరువాత మళ్ళీ విందు అనీ, ఇంకోటి అని రాయడం ఎందుకు? చందనం అంటే... దేవతార్చన, పిదప భోజనం... తరువాత లేచి వెళ్ళబోయేముందు చందనం రాసుకుని లేస్తారు. కాబట్టి పెద్దలయిన అతిథులొచ్చారంటే గౌరవసూచకంగా ఓ తాంబూలం చేతిలో పెడతారు. తాంబూలమంటే మళ్ళీ రు.1116/–లా ? రు.116/–లా అని అడక్కండి. తమలపాకులు, రెండు అరటిపళ్ళు, రెండు వక్కలు చాలు. తాంబూలమిచ్చారంటే గౌరవమిచ్చారని గుర్తు. విరాటపర్వంలో–బృహన్నలరూపంలో అర్జునుడు వస్తే ఆయన తేజస్సును చూసి విరాట్‌రాజు–‘చూస్తే బృహన్నల. కానీ గొప్ప క్షత్రియుడిలా ఉన్నాడు. ఈయన సామాన్యుడు కాడు.’ అని ఉత్తరని పిలిచి తాంబూలం ఇవ్వమంటాడు. అది గౌరవ చిహ్నం. ఇక పెళ్ళిమంటపంలో వధూవరులిద్దరూ ఒకళ్ల కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటారు. అలా చూసుకున్న ఘడియే సుముహూర్తం. ‘‘అయ్యా! మీరందరూ ఇది శుభముహూర్తం’’ అనండి అని అడుగుతారు. అప్పుడు అతిథులందరూ లేచి ‘ఇది శుభముహూర్తమే’ అని ముందుకొస్తారు. నడుం విరగని బియ్యానికి పసుపురాసి మీ చేతిలో పెడితే మీరు అతిథి దేవుళ్ళు కనుక మీరు చేసిన భగవదారాధన వలన మీరు స్మరించి మీ శక్తితో ఆ అక్షతలను వధూవరుల మూర్ధన్య స్థానమందువేస్తే వారికి అభ్యున్నతి కలిగి దీర్ఘాయుష్మంతులవుతారు. ‘మీరలా చేయడంవల్ల మా వంశం నిలబడుతుంది. అందుకని మీరు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేయాలి కనుక చందనం ఇస్తాను. అంటే భోజనం పెట్టి తాంబూలం ఇస్తాను. కనుక మీరు దయతో రావలసింది’ అని ప్రేమతో పిలిచారని అర్థం. తీరా వారు వచ్చిన తరువాత పెళ్ళికి పిలిచిన పెద్దలు అతిథులను వారి మానాన వారిని వదిలేసి వీడియో బృందం సేవల్లో మైమరిచిపోతుంటే, వధూవరులు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు చూసుకోకుండా మెడతెగిన కోడిపెట్టల్లా వీడియో కెమెరాలకేసి చూస్తుంటే, కర్ణుడు కవచకుండలాలను వదలకుండా వెంటేసుకుని తిరిగినట్లు.. వచ్చిన అతిథులు కూడా పాదరక్షలతోపాటూ మంటపం ఎక్కి క్యూలైన్లలో తరించి పోతుంటారు. చుట్టూ కమ్ముకున్న వీడియోగ్రాఫర్ల మధ్యనుంచి పెళ్ళితంతు చూడలేక, భోజనాల దగ్గర కూడా చేతిలో పళ్ళెం పట్టుకుని నిలబడలేక, కూర్చోలేక, తినలేక, తినకుండా ఉండలేక, గొంతుపట్టుకుంటే నీళ్ళు తాగలేక ఇటూ అటూ తిరిగే అతిథులది దిక్కుమాలిన స్థితి. అది ఈ జాతి సంస్కారం కానే కాదు. ఈ జాతి లక్షణం కూడా కాదు. ఎక్కడినుంచో ఎవడో దిగుమతి చేసేశాడు. అంటువ్యాధిలా వ్యాపించిపోయింది. ప్రేమగా అతిథులను పలకరిస్తూ కూర్చోబెట్టి వడ్డించి పెట్టడం ఈ జాతి ధర్మం. అంతే తప్ప పెళ్ళికి పిలిచి, ఆశీర్వచనానికి పిలిచి చందనతాంబూలాలిస్తాం రమ్మనమని పిలిచి– అతిథిని పట్టించుకోకపోతే ఎలా? అన్నం ఎక్కడా దొరకదని అతిథి అక్కడికి రాలేదు కదా! నువ్వే పిలిచావు. అతిథిని పిలిచి నిర్లక్ష్యం చేయకూడదు. అలా చూసుకోలేనప్పుడు పిలవకూడదు. కనుక గృహస్థు అనేవాడు ఇంట్లో అయినా, శుభకార్యంలో అయినా సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం అయిన అతిథి పూజలో తరించాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అమ్మవారిని దర్శించుకున్న ‘చాగంటి’
బాసర(ముథోల్): చదువుల తల్లి శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని చాగంటి కోటేశ్వరరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయాధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్‌రెడ్డి ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్, పాలకవర్గసభ్యులు ఉన్నారు. -
వివాహంతోనే సమాజ శాంతి
చెన్నై: దంపతులకు, వారి వారసులకే కాదు, సమాజానికి శాంతి కలిగించడమే వివాహంలోని విశిష్టతని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు స్పష్టం చేశారు. దాంపత్య జీవితంలోని అశాంతి ఆ కుటుంబానికి తద్వారా సమాజానికి అశాంతి కలిగించి చేటుగా మారుతుందని ఆయన తెలిపారు. ‘వివాహ విశిష్టత’ అనే అంశంపై భారతీయ సాంస్కృతిక పీఠం (చెన్నై) వారి ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు చాగంటి వారి ప్రవచనాలు అద్భుతంగా సాగాయి. ముగింపు ప్రవచనాలు ఆయన మాటల్లోనే. ‘‘వివాహం ద్వారా దంపతుల జీవితంలో శాంతి ప్రారంభం కావాలి. శాంతి లేని నాడు ఒకరికి ఒకరు బరువు, ఈ సమాజానికే బరువుగా మారిపోతారు. భర్త ఉండడం భార్యకు శాంతి, భార్య ఉండడం భర్తకు శాంతి అదే వైవాహిక జీవితంలోని గొప్పదనం. వివాహ మహోత్సవంలో జీలకర్ర బెల్లం తలపై పెట్టడం, ఈ సమయంలో వధూవరుల మధ్యన తెరను పట్టుకోవడం, మెడలో మాంగల్యధారణ, తలంబ్రాలు ఇదంతా ఒక లౌకికమైన తంతుగా భావించరాదు. ప్రతి విధానం వెనుక ఒక మహోత్కృష్టమైన అర్థం ఉంది. జీలకర్ర ఆరోగ్యానికి మంచిది, బెల్లం నిల్వదోషం లేనిది. కలిపి దంచిన ఈ రెండింటినీ వధూవరులు ఒకరితలపై ఒకరు పెట్టుకున్నపుడు వారిద్దరి మధ్య త్యాగభావన, సద్భావన కలిగిస్తుంది. తెరదీయగానే ఒకరి నొకరు చూసుకోవడమే మంచి ముహూర్తం కింద లెక్క. అందుకే మధ్యనున్న తెరపై స్వస్తిక్ ముద్ర వేయాలేగానీ తొంగితొంగి చూడమాక చందమామ’ వంటి పాటలు రాయరాదు. అలాగే మనిషి జీవితంలో మెదడు పాత్ర ఎంతో ముఖ్యమైనది, చెడు చేసినా, మంచిని ఆచరించినా మెదడే ప్రధానం. కష్టసుఖాలను గుర్తిస్తుంది, రాకుండా జాగ్రత్తలు చెబుతుంది. మెదడు చెప్పినట్లు దేహం, అందులోని అవయవాలు వింటాయి. దేహాన్ని, మెదడును కలిపే భాగం మెడ. అందుకే మంగళసూత్రాన్ని మెడలోనే కడతారు. బుద్ది అవయవాలు ఒకదానికి ఒకటిగా ఎలా నడుచుకుంటాయో వైవాహిక జీవితంలో మనిద్దరం అలా ఉందామని దంపతులు ఇద్దరూ మంగళసూత్ర ధారణతో చాటుకుంటారు. అలాగే తలంబ్రాలు, ఏడు అడుగులు వేయడం ఒక ముచ్చటకాదు, ఎంతో విశిష్టమైనది. నీవులేని అయోధ్య నాకు అరణ్యంతో సమానమని సీతమ్మవారు అరణ్యవాసానికి రామునితో కదిలి వెళ్లారు. అంతటి త్యాగం భార్యలో ఉండాలి. ఒకరిపై ఒకరు చేసే విమర్శలను సహృదయంతో స్వీకరించాలి, ఒకరి బలహీనత మరొకరికి ప్రేమగా మారాలి, వృద్ధాప్యంలో తీపి గుర్తులుగా మిగలాలి. అలాగే ఒకరి బలహీనత ఒకరిని విడిచి వెళ్లడం, విడాకులు ఇవ్వడం మన దేశ సంస్కృతి కాదు. దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోవడమే ఈ దేశ గొప్పదనం. అలా జీవించినపుడే వివాహమైన కొత్తల్లోని ఆకర్షణ రోజు రోజుకీ తరగని అభిమానంగా మారి జీవితాంతం నిలబడుతుంది. దాంపత్య జీవితంలో భార్యా భర్తలు ఇద్దరూ సమానమే, ఎవరు ఎక్కువకాదు, తక్కువ కాదు. వేర్వేరుగా మొదలై ఒకరికి ఒకరుగా జీవితాన్ని కొనసాగించి చివరకు ఆధ్యాత్మం పొందడం వివాహంలోని విశిష్టత. సాక్షాత్తు సీతారాములు, శివపార్వతులే దాంపత్య జీవితానికి ఆదర్శంగా నిలిచారు. వివాహ సమయంలో మంగళసూత్ర ధారణ కేవలం ఒక క్రతువుగా భావించరాదు. అది ఒక సర్వమంగళకారిణి. అందుకే మంగళసూత్రానికి ఎన్నడూ దోషం అంటదు. పురుషునికి యజ్ఞోపవీతం ఎంత పవిత్రమైనదో, స్త్రీకి మంగళ సూత్రం అంత పవిత్రమైనది. జీవిత కాలంలో మంగళ సూత్రానికి శౌచం, అశౌచం అనేవి ఉండవు. స్త్రీ తన జీవితంలో మంగళసూత్రాన్ని ఎవ్వరినీ తాకనివ్వదు. మహిళ మెడలో మంగళసూత్రం భర్త ఉన్నాడు అనేందుకు తార్కాణం. మంగళప్రదమైన మంగళ సూత్రంతో నేను నిండునూరేళ్లు హాయిగా జీవించాలనేది నీ చేతిలో ఉంది అని భర్త భావించగలగాలి.''