ఆ 6 కంపెనీల చైర్మన్‌గా తొలగింపు అంతతేలిక్కాదు..
న్యూఢిల్లీ: ఏడు లిస్టెడ్ కంపెనీల్లో ఆరు సంస్థల చైర్మన్ బాధ్యతల నుంచి సైరస్ మిస్త్రీని తొలగించాలని టాటా సన్స భావిస్తే, అది అంత తేలిక వ్యవహారం కాదని ఇన్‌గవర్న్ రిసెర్చ్ సర్వీసెస్ తన నివేదికలో పేర్కొంది. ‘నేడు మిస్త్రీని చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించిన టీసీఎస్‌ను మినహారుుస్తే... మిగిలిన 6 సంస్థల్లో ప్రమోటర్ హోల్డింగ్ 30-39% మధ్య ఉంది. కనుక టాటా సన్స కోరిక నెరవేరాలంటే, వ్యవస్థాత ఇన్వెస్టర్ల మద్దతు తప్పనిసరి’ అని నివేదిక పేర్కొంది. ఈ 6 కంపెనీల్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్, గ్లోబల్ బేవరేజెస్లు ఉన్నారుు.
టాటా మోటార్స్ యూనియన్‌తో రతన్ భేటీ
టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా గురువారం మోటార్స్ ఉద్యోగ యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు. వచ్చే వారం టాటా మోటార్స్ కీలక బోర్డ్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.