chaithanya
-
‘పారిజాత పర్వం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘షరతులు వర్తిస్తాయి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఏపీ పోలీస్ తులసి చైతన్యకు ప్రతిష్టాత్మక అవార్డు!
ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన మోతుకూరి తులసి చైతన్య ఇవాళ(మంగళవారం జనవరి 9న) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అందుకోనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో ఈ అవార్డు ప్రదానం జరగనుంది. తులసి చైతన్య ఏపీ పోలీస్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వాటర్ అడ్వెంచర్ విభాగంలో 2022 సంవత్సరానికి ‘టెంజిగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’కు ఆయన ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి పోలీస్ ఈ నెల 5న కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ప్రకటిస్తూ చైతన్యకు లేఖ రాసింది. అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 15 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం చైతన్యకు అందజేస్తుంది. ఈత పోటీల్లో అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్న తులసి చైతన్య, తనలా మరికొందరికి స్విమ్మింగ్‌లో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో ట్రిపుల్ క్రౌన్ సాధించిన మొదటి భారతీయ పోలీసు అధికారిగానూ ఆయన రికార్డు సృష్టించారు. 2022 జులై 26న ఇంగ్లాడ్ – ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ ఛానెల్ (33.5 కి.మీ)ను 15 గంటల 18 నిమిషాల 45 సెకన్లలో ఈదుకుంటూ చేరుకున్నారు. జిబ్రాల్టర్ జలసంధి, కేటలినా ఛానల్, పాక్ జలసంధి సహా అనేక సాహసోపేతమైన ఈత పోటీల్లో ఆయన పాల్గొని విజయం సాధించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2022 సంవత్సరానికి గాను ‘టెంజిగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’కు ఎంపిక చేసింది. తులసి చైతన్యలో ఉన్న ప్రతిభను గుర్తించిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచారు. (చదవండి: డబ్బుతో సంతోషాన్ని కొనగలమా? సర్వేలో తేలిందిదే!) -
'చైతన్య'పథం! థర్మకోల్‌తో గ్రీన్ ఇన్నోవేషన్..
'వేడుకలు, స్కూల్ ప్రాజెక్ట్‌లు, ప్యాకింగ్ అవసరాలు.. మొదలైన వాటి కోసం థర్మోకోల్‌ను ఉపయోగిస్తుంటాం. స్టోర్‌రూమ్‌లలో వాడేసిన థర్మోకోల్లు కుప్పలుగా పడి ఉంటాయి. మన అవసరం మేరకు తప్ప వాటి గురించి అంతగా ఆలోచించం. కొత్త విషయాలు తెలుసుకుంటే ఏమొస్తుంది? కొత్తగా ఆలోచిస్తాం. కొత్తగా ఆలోచిస్తే ఏమొస్తుంది? కొత్తదారులు కనిపిస్తాయి. కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. చైతన్య దూబే కొత్తదారులలో ప్రయాణిస్తున్నాడు. సంప్రదాయ థర్మోకోల్కు భిన్నంగా బయోడిగ్రేడబుల్ థర్మోకోల్ తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.' థర్మోకోల్ నాన్–బయోడిగ్రేడబుల్.. పర్యావరణంపై వాటి ప్రభావం ఎంతగానో ఉంది. థర్మోకోల్కు సూర్యరశ్మి తగిలి హానికరమైన వాయు కాలుష్య కారకాలు ఉత్పత్తి అవుతాయి, థర్మోకోల్ కాల్చడం వల్ల విషపూరిత రసాయన సమ్మేళనాలు విడుదల అవుతాయి. దీని ప్రభావంతో కంటి, ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి విషయాలు తెలుసుకున్న చైతన్య ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి విజయం సాధించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పుట్టి పెరిగిన చైతన్య బెంగళూరులో ఇంజనీరింగ్ చేశాడు. ఎంబీఏ చేసిన తరువాత బెంగళూరులోని ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయాలనుకున్నాడు. అయితే చిన్న బిజినెస్ కోర్స్ ఒకటి చేయడంతో అతడి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఉద్యోగం కాదు బిజినెస్ చేయాలి అనుకున్నాడు. ఆ కోర్స్ తన గమనాన్నే మార్చింది. కెరీర్‌కు సంబంధించి ఎన్నో అవకాశాలను పరిచయం చేసింది. పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఔషధ పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టాడు.. రకరకాల పుట్టగొడుగుల గురించి తెలుసుకునే క్రమంలో పుట్టగొడుగుల నుంచి లెదర్ తయారుచేసే కాన్సెప్ట్ చైతన్యను ఆకట్టుకుంది. ‘ఇలాంటిదే కొత్తగా ఏదైనా చేయవచ్చా’ అని ఆలోచించి పరిశోధనలు మొదలుపెట్టాడు. పరిశోధనలో భాగంగా ఐఐటీ–కాన్పూర్ వెళ్లి ప్రొఫెసర్లతో మాట్లాడాడు. పుట్టగొడుగులను ఉపయోగించి పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను తయారుచేయాలనే ఆలోచనలో భాగంగా రూపొదించిందే సరికొత్త థర్మోకోల్. పుట్టగొడుగులతో పాటు సహజమైన పదార్థాలతో బయోడిగ్రేడబుల్ థర్మోకోల్‌ను తయారుచేశాడు. ఇది 60 నుంచి 90 రోజుల్లో కుళ్లిపోవడం మొదలవుతుంది. దీన్ని మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ థర్మోకోల్ తయారీకి అయిదు నుంచి ఏడు రోజులు పడుతుంది. ‘మీ అవసరాలకు ఉపయోగించుకున్న తరువాత క్రష్ చేయండి. ఇది మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది’ అంటున్నాడు చైతన్య. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడం, దాని గురించి లోతుగా ఆలోచించడం అంటే చైతన్యకు ఇష్టం. 29 సంవత్సరాల చైతన్య దూబే బయోటెక్ కంపెనీ ‘కినోకో బయోటెక్’ ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాడు. బయోడిగ్రేడబుల్ థర్మోకోల్ దగ్గరే ఆగిపోలేదు చైతన్య దూబే. పుట్టగొడుగుల ద్వారా విగ్రహాల తయారీకి ఉపయోగపడే పదార్థం గురించి పరిశోధనలు చేస్తున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపి)కి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇవి కూడా చదవండి: భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం -
విడిపోయిన కొణిదెల నిహారిక, చైతన్య దంపతులు
-
చైతన్య చివరి వీడియోపై కమెడియన్ అదిరే అభి..
-
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్
-
'ఆ వార్తలు బాధాకరం..ఈనెల 10న ఫ్లాట్ ఖాళీ చేస్తున్నాం'
-
అన్నవరం లో నిహారిక చైతన్య ప్రత్యేక పూజలు
-
ఆశ తీరక.. అవమానం భరించలేక
వైఎస్ఆర్ జిల్లా,బద్వేలు అర్బన్ : ఆ యువకుడు చిన్నతనం నుంచి కష్టపడి చదివేవాడు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివించారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఆశ నెరవేరలేదన్న కారణంతో పాటు డబ్బుల విషయంలో తన స్నేహితుడు చేసిన అవమానం భరించలేకఅర్ధాంతరంగా తనువు చాలించాడు. కన్నవారి కలలను దూరం చేశాడు. బద్వేలు పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయనగర్‌లో నివసించే వెంకటసుబ్బయ్య, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటసుబ్బయ్య జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. వెంకటసుబ్బయ్య పెద్ద కుమారుడైన ఆవులేటిచైతన్య (27) బీటెక్ పూర్తిచేసి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొన్ని నెలలుగా తన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని, తన స్నేహితుని ఉద్యోగం కోసం డబ్బులు చెల్లిస్తే వారు మోసం చేశారని, ఇదే సమయంలో తన స్నేహితుడు డబ్బుల కోసం ఒత్తిడి పెట్టడంతో పాటు జరిగిన విషయాన్ని వాట్సాప్ ద్వారా తన మిత్రులకు తెలిపి తన పరువు తీశాడని మదనపడుతుండేవాడని తెలిసింది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన చైతన్య స్వగ్రామానికి చేరుకున్నాడు. అదే రోజు తల్లి, తమ్ముడు కర్నూలుజిల్లా చాగలమర్రిలో జరిగే వివాహానికి వెళ్లారు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి తలుపులు తట్టగా తీయలేదు. కిటికీలో నుంచి చూడగా ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి సోదరుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకుని మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్నో కష్టాలు పడి నిన్ను చదివించాం. నీకు ఉన్న ఇబ్బందులు మా దృష్టికి తీసుకు వచ్చింటే తీర్చేవారం కదరా, ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా నాయనా అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
బధిర చైతన్యం..!
అద్దంకి రూరల్: పూనూరి ఆరోగ్యం అనే మహిళ తన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితుల పిల్లల్లో ఉన్న వికలత్వాన్ని చూసి చలించారు. వారికి విద్యను అందించి సమాజంలో భాగస్వాములను చేయాలనే తపనతో 2000 సంవత్సరంలో అద్దంకి పట్టణంలోని పాత కోర్టు భవనాల వద్ద అద్దె గృహంలో 30 మంది విద్యార్ధులతో చైతన్య బధిరుల ఆశ్రమ పాఠశాల ప్రారంభించారు. మొక్క పెరిగి వృక్షం అయినట్లు 10 సంవత్సరాల అనంతరం అంటే 2010లో ప్రభుత్వం చేయూత, దాతల సహకారంతో సింగరకొండ వెళ్లే రహదారిలోని కాకానిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో సొంత భవనం సమకూర్చారు. ప్రస్తుతం 100 మంది చిన్నారులకు ఆశ్రయం కల్పించారు. 18 వసంతాలుగా ఎందరో బధిరులు, మానసిక వికలాంగులను ఈ విద్యాలయం అక్కున చేర్చుకుంది. పాఠశాలలోని బధిర విద్యార్థులందరికీ విద్యతో పాటు ఉచితంగా భోజనం, ఉదయం టిఫిన్, సాయంత్ర స్నాక్స్, పాలు, బాలబాలికలకు వేర్వేరుగా వసతి, యూనిఫాం అందజేస్తున్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో బోధన ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం మేళవించి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక విద్యతో పాటు స్పీచ్ థెరపీ, గ్రూప్ హియరింగ్ పరికరాలు సమకూర్చి మాటలు రాని వారికి శిక్షణ ఇస్తూ ప్రత్యేక బోధనతో ముందుకు సాగుతున్నారు. వృత్తివిద్య కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి చదివిన విద్యార్థులు ఇప్పుడు ఇంటర్మీడియెట్‌లో 20 మంది, డిగ్రీలో 10 మంది, పాలిటెక్నిక్‌లో 5 గురు విద్యాభ్యాసం చేస్తుండటం తోటి విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది. సృజనకు దర్పణం బధిరుల విద్యార్థులు తమలోని కళాహృదయంతో పనికి రాని చిత్తు కాగితాలతో మానవుడి మెదడు, నౌకా, జాతీయ జెండా, గుండె, సైకిల్ వంటి కళాకృతులు నిర్మించారు. పాఠశాలకు వచ్చినవారు చిన్నారులను అభినందిస్తున్నప్పుడు వారిలో మరింత ఉత్సాహం కలుగుతోంది. ఇక్కడి వారు ప్రభుత్వ ఉద్యోగులుగా.. ఇక్కడ విద్యను అభ్యసించిన వారిలో ఇద్దరు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారిలో ఒకరు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో, మరొకరు పొదిలి మార్కెట్ యార్డులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 80 శాతం నిధులు అందజేస్తుండగా.. మిగిలిన 20 శాతం దాతల ద్వారా సమకూరుతోంది. 10 మంది బోధన సిబ్బంది ఉన్నారు. -
చైతన్యకుమార్ మృతదేహం నేడు రాక
చిలకలపూడి(మచిలీపట్నం): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామిలో గత నెల 31వ తేదీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన మచిలీపట్నానికి చెందిన యువకుడు బొమ్మల చైతన్యకుమార్ మృతదేహాన్ని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం చొరవతో మృతదేహం శుక్రవారం మచిలీపట్నం చేరనుంది. మరణవార్త విన్న వెంటనే కలెక్టర్ రాష్ట్ర సాధారణ పరిపాలనా (ప్రోటోకాల్ ) విభాగానికి త్వరితగతిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని లేఖ రాశారు. ఈ లేఖను ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెన్షియల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు మెయిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపారు. దీంతో పాటుగా కలెక్టర్ లేఖకు స్పందించిన తెలుగు అసోసియేషన్, తానా ప్రతినిధులు మృతదేహాన్ని మచిలీపట్నం చేర్చడానికి కావాల్సిన వనరులను సమకూర్చి ప్రయత్నాలను ప్రారంభించారు. అమెరికా నుంచి కృష్ణా జిల్లాకు మృతదేహం రావాలంటే సాధారణంగా 20 రోజుల సమయం పడుతుంది. అయితే కలెక్టర్ రాసిన లేఖకు స్పందించిన తెలుగు స్వచ్ఛంద సంస్థలు కేవలం ఎనిమిది రోజుల్లోనే అన్నీ అంశాలను పూర్తి చేసి గురువారం రాత్రికి హైదరాబాద్‌కు పంపుతున్నట్లు కలెక్టర్, ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌లకు మెయిల్, మెసేజ్ ద్వారా వివరించారు. వీరు ఇరువురు మచిలీపట్నంలోని చైతన్యకుమార్ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని అందించారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి మృతదేహ శుక్రవారం ఉదయానికి చేరనుంది. -
షార్ట్ సర్క్యూట్‌తో చిన్నారి మృతి
ముదిగుబ్బ : మండల పరిధిలోని దొరిగిల్లు క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో చిన్నారి చైతన్య (3) మృతి చెందాడు. దొరిగిల్లు బీసీ క్వార్టర్స్‌లో ప్రభాకర్, నారాయణ మ్మ నివాసం ఉంటున్నారు. వారి ఇంటి వద్ద విద్యుత్‌లైను, వేపచెట్టు సమీపంలోనే ఉన్నాయి. రాత్రి తీగలు చెట్టుపై పడటంతో ఆ ఇంటికి విద్యుత్ సరఫరా అయింది. చిన్నారి చైతన్య (3) చార్జింగ్ పెట్టిన సెల్‌ను పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ముదిగుబ్బ ఆస్పత్రికి తరలించగా చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
వేటకొడవలితో యువతిపై దాడి
మహిళా హాస్టల్లో యువకుడి ఘాతుకం హైదరాబాద్: ప్రేమించమని ఓ యువతిని ప్రేమోన్మాది కొద్దికాలంగా వేధిస్తున్నాడు. అం దుకు యువతి నిరాకరించడంతో ఆమెను హతమార్చేందుకు నగరానికి వచ్చా డు. యువతి డ్యూటీకి వెళ్లడంతో ఆమె గదిలో ఉన్న మరో యువతిని కొడవలితో నరికిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన శ్రావణ్ అలియాస్ చరణ్ తన ఊరికే చెందిన సమీపబంధువు చెతన్యను ప్రేమించాలని వెం టపడేవాడు. అందుకు యువతి నిరాకరించడం తో కోపం పెంచుకుని ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన శ్రావణ్ సోమవారం మధ్యాహ్నం యువతి ఉంటున్న హాస్టల్‌కు వచ్చాడు. చైతన్య తనకు చెల్లి అవుతుందని, ఆమెను పిల వాలని వాచ్‌మెన్‌కు చెప్పాడు. చైతన్య డ్యూటీకి వెళ్లిందని చెప్పడంతో ఆమె గదిలోనే ఉండి వచ్చిన తర్వాత హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. వాచ్మెన్ కళ్లుగప్పి నేరుగా చైతన్య ఉండే గదిలోకి వెళ్లాడు. అయితే గదిలో చైతన్య రూంమేట్ మమత ఉంది. తాను వేసిన పథకానికి మమత అడ్డొస్తుందని భావించి తన వెంట తీసుకొచ్చిన వేటకొడవలితో ఆమె తలపై వేటువేశాడు. అతడి నుంచి తప్పించుకుని మమత అరుస్తూ గది నుంచి బయటకు రావడాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది శ్రావణ్‌ను పట్టుకున్నారు. గాయపడిన మమతను ఆస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మమత స్వస్థలం చిత్తూరు జిల్లా తిరుపతి. ఆమె ఈసీఐఎల్‌లోని ఓ కంపనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. మమత ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు.