Chakrayapeta
-
అంజన్న సాక్షిగా టీటీడీ పరిధిలోకి గండి
సాక్షి, చక్రాయపేట(కడప) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు జిల్లాలోని గండి ఆలయం టీటీడీ పరిధిలో చేరింది. రాయల సీమ జిల్లాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన చక్రాయపేట మండలం,మారెళ్ల మడక గ్రామం గండి క్షేత్రంలో వెలసిన శ్రీవీరాంజనేయ స్వామి ఆలయ బాధ్యతలను బుధవారం టీటీడి అధికారులకు గండి ఆలయ అధికారి అప్పగించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటలకు ముందుగా సిద్ధం చేసిన ఫైళ్లపై ఆలయ అధికారి పట్టెం గురుప్రసాద్ తొలి సంతకం చేయగా టీటీడీ డిప్యూటీæ ఈఓ గోవింద రాజన్ రెండవ సంతకం చేసి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆలయంతో పాటు గుడికి సంబందించిన స్థిర,చరాస్థులు,బంగారు,వెండితో పాటు ఇక్క డ పనిచేస్తున్న అందరు ఉద్యోగులను టీటీడీకి అప్పగిస్తున్నట్లు గురుప్రసాద్ ప్రక టించి సంబంధిత ఫైల్‌ను టీటీడీ డిప్యూటీ ఈవోకు అందజేశారు.ఆలయాన్ని టీటీడి వారికి అప్పగించే సమయానికి ఎఫ్డీలు,బ్యాంక్ అకౌంట్లతో కలపి రూ. 4,33,71,153 నగదు,సుమారు 900 గ్రాముల బంగారు,వంద కిలోల వెండితో పాటు సుమారు13 ఎకరాల భూమిని ఉన్నట్లు గురుప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు .ఇదంతా కూడా ఇకపై టీటీడీ వారి ఆధ్వర్యంలోనే ఉంటాయని వాటి బాధ్యత కూడా వారిదే నని చెప్పారు. టీటీడీ ఎస్టేట్ అధికారి విజయసారధి,సాధారణ పరిపాలనా విభాగం డిప్యూటీ ఈవో సుధారాణి,ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్,ఏవిఎస్వో పవన్ కుమార్‌తో పాటు రెవెన్యూ,జ్యువెలరి,హెల్త,విద్యుత్ తదితర శాఖలకు చెందిన అధికారులు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ జీఓపై హైకోర్టుస్టే: గండి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి అనే భక్తుడు జీవో రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.దీనిపై కోర్టు జీవో రద్దు చేసింది. దీనిపై తాము నిర్ణయించుకున్న సమయం మేరకు ఉదయం 10 గంటలకే ఆలయాన్ని విలీనం చేసుకున్నామని అలాంటప్పుడు మధ్యలో జీవో రద్దు ఎలా చేస్తారని టీటీడీ∙తరపు న్యాయవాది వాదించడంతో స్టే వెకేట్ చేసుకొనేందుకు పిటీషన్ వేసుకోవాలని.. కేసును 30వ తేదీకి వాయిదా వేసింది.దీంతో టీటీడీ,దేవదాయ శాఖల అధికారులు కోర్టులో పిటీషన్ వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
సోలార్ ప్లాంటేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
వైఎస్సార్ జిల్లా: చక్రాయపేట మండలం గండికొవ్వూరు వద్ద నున్న అనంతపూర్ ఎనర్జీ ప్రాజెక్ట్ సోలార్ ప్లాంటేషన్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సోలార్ సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. హైవోల్టేజ్ విద్యుత్ తీగలకు సమీపంలో ఉండటం వల్ల ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. ఒకే ఒక్క ఫైర్ ఇంజన్‌తో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమానులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాబుకు ఓటేస్తే కరువు కొని తెచ్చుకున్నట్లే
సాక్షి, చక్రాయపేట: చంద్రబాబుకు మళ్లీ ఓట్లేస్తే కరువును కొని తెచ్చుకున్నట్టేనని కడప పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జ్ వైఎస్ కొండారెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం వారు మండలంలోని కొండుగారిపల్లె, బలిజపల్లె, వడ్డేపల్లె, నెర్సుపల్లె, గొట్లమిట్ట, ఎద్దులవాండ్లపల్లె, గంగారపువాండ్లపల్లె గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు కురవడం ఆగిపోయాయన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుండటం కనిపిస్తోందన్నారు. చంద్రబాబుకు మళ్లీ ఓట్లేస్తే ప్రజలు కరువు కోరల్లో చిక్కుకున్నట్లేనని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని.. మళ్లీ రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. గ్రామాలన్నింటిని అభివృద్ది చేస్తారని తెలిపారు. జగనన్ ప్రవేశపెడుతున్న నవరత్నాలతో ప్రతి ఇంటికి ఎంతో లబ్ది చేకూరుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో భారత్‌రెడ్డి, యోగాంజులరెడ్డి, మహేశ్వర రెడ్డి, శ్రీరామమూర్తి, కడప పార్లమెంటరీ ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, మునిరత్నంరెడ్డి, గంగిరెడ్డి, బాబు, సూర్యప్రసాదరెడ్డి, వేదమూర్తి, చెన్నకేశవులు, నారాయణ, రాజారెడ్డి, బ్రహ్మంరెడ్డి, మధు, చెన్నప్ప, చలపతినాయుడు, అంజలిరెడ్డి, గఫూర్, చంద్రశేఖర్, డీలర్ కృష్ణారెడ్డి, దేవ, శివారెడ్డి, గోపాల్ నాయక్, వెంకటరమణలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాల్లో వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డిలకు జనం హారతులు పట్టారు. -
పాము కాటుకు మహిళ మృతి
చక్రాయపేట : కుమారకాల్వ గ్రామంలోని గొళ్లపల్లెకు చెందిన ముడియం లక్షుమ్మ(45) అనే మహిళ శుక్రవారం పాము కాటుకు గురై మృతి చెందింది. వివరాలలోకి వెళితే.. శుక్రవారం ఉదయం లక్షుమ్మ తన పొలంలో వ్యవసాయ పనుల కోసం వెళ్లింది. అక్కడ కొద్దిసేపటికి పాము కాటుకు గురి కావడంతో బంధువులు హుటాహుటిన సమీపంలోని రాయచోటికి తీసుకెళ్తుండగా.. మార్గంమధ్యలో పాయలోపల్లె సమీపంలో మృతి చెందింది. ఆమెకు భర్త శేషయ్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.