
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని అడుగుతున్న వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, చక్రాయపేట: చంద్రబాబుకు మళ్లీ ఓట్లేస్తే కరువును కొని తెచ్చుకున్నట్టేనని కడప పార్లమెంటు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జ్ వైఎస్ కొండారెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం వారు మండలంలోని కొండుగారిపల్లె, బలిజపల్లె, వడ్డేపల్లె, నెర్సుపల్లె, గొట్లమిట్ట, ఎద్దులవాండ్లపల్లె, గంగారపువాండ్లపల్లె గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు కురవడం ఆగిపోయాయన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుండటం కనిపిస్తోందన్నారు. చంద్రబాబుకు మళ్లీ ఓట్లేస్తే ప్రజలు కరువు కోరల్లో చిక్కుకున్నట్లేనని చెప్పారు.
ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని.. మళ్లీ రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. గ్రామాలన్నింటిని అభివృద్ది చేస్తారని తెలిపారు. జగనన్ ప్రవేశపెడుతున్న నవరత్నాలతో ప్రతి ఇంటికి ఎంతో లబ్ది చేకూరుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో భారత్‌రెడ్డి, యోగాంజులరెడ్డి, మహేశ్వర రెడ్డి, శ్రీరామమూర్తి, కడప పార్లమెంటరీ ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, మునిరత్నంరెడ్డి, గంగిరెడ్డి, బాబు, సూర్యప్రసాదరెడ్డి, వేదమూర్తి, చెన్నకేశవులు, నారాయణ, రాజారెడ్డి, బ్రహ్మంరెడ్డి, మధు, చెన్నప్ప, చలపతినాయుడు, అంజలిరెడ్డి, గఫూర్, చంద్రశేఖర్, డీలర్ కృష్ణారెడ్డి, దేవ, శివారెడ్డి, గోపాల్ నాయక్, వెంకటరమణలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాల్లో వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డిలకు జనం హారతులు పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment