మాట్లాడుతున్న వైఎస్ అవినాష్‌రెడ్డి. చిత్రంలో రఘురామిరెడ్డి, సురేష్‌బాబు
సాక్షి, ఖాజీపేట : వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజోలి జలాశయం నిర్మించి చివరి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, మేయర్ సురేష్‌బాబు పేర్కొన్నారు.అప్పనపల్లె పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు, కరువు కవల పిల్లలని, ఆయన పాలన కాలం అంతా రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు.
కేసీకెనాల్ ఆయకట్టు రైతుల కష్టాలను చూసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి జలాశయం నిర్మించాలని శంకుస్థాపన చేశారని అన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పూర్తి చేస్తానని, పంటలను కాపాడతానని హామీ ఇచ్చారని వారు చెప్పారు.అసెంబ్లీకి 41 మంది, పార్లమెంట్‌కు ఏడుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించి బీసీలకు అగ్రతాంబూలం వేశారని అన్నారు. చంద్రబాబు బీసీల పేరుతో అందరినీ దగా చేస్తున్న విషయం గుర్తించాలని అన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు తిరిపాల్‌రెడ్డి,గురురెడ్డి, శ్రీనివాసులరెడ్డి, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment