Challa srinivasa rao
-
హైదరాబాద్‌లో ఎస్బీఐ యోనో తొలి బ్రాంచ్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ ఎస్బీఐ బ్యాంక్ హైటెక్ సిటీలో తొలి యోనో బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్‌లు వర్చువల్ పద్ధతిలో ఈ బ్రాంచిని ఆవిష్కరించారు. ఇది సౌతిండియాలో మొదటిదికాగా, దేశంలో 4వది కావడం విశేషం. ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా అందించనుంది. బ్రాంచి ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా మాట్లాడుతూ ‘‘యోనో కేవలం ప్రొడెక్ట్ మాత్రమే కాదు. దాదాపు అన్ని బ్యాంక్ సేవలను అందించే వేదిక’’ అన్నారు. -
చంద్రబాబు కనుసన్నల్లోనే డెయిరీ నాశనం
సాక్షి, ఒంగోలు: అనుకున్నదే జరిగింది.. ఒంగోలు డెయిరీ నిండా మునిగింది.. టీడీపీకి చెందిన పాలకమండలి నిండా ముంచితే నూతనంగా ఏర్పడిన అధికారులతో కూడిన కమిటీ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు డెయిరీని కోలుకోలేని స్థితిలోకి నెట్టింది. పాడి రైతుల ఆందోళనలతో దిగొచ్చిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పాలక మండలిని రద్దు చేసి అధికారులతో కూడిన నూతన కమిటీని ఏర్పాటు చేసింది. నూతన కమిటీ ఉన్న ఉద్యోగులను కాదని అదనంగా మరో ముగ్గురు ఉన్నతాధికారులను తీసుకొని జీతాల రూపంలో డెయిరీపై నెలకు అదనంగా రూ.3 లక్షల భారం మోపింది. అలా 18 నెలల పాటు కాలంగడిపి అదనపు భారం డెయిరీ నెత్తిన మోపి ఇంకా ముంచేశారు. చివరకు డెయిరీకి ఏదో వెలగబెడతారకున్న సీఈవో జగదీశ్వరరావు వారం రోజుల క్రితం రాజీనామా చేసి జారుకున్నారు. అదనపు ఉద్యోగులు కేటాయింపుతో డెయిరీకి అదనంగా రూ.62 లక్షల భారం తప్ప ఒరిగిందేమీ లేదు. అంతకు ముందే సొసైటీ యాక్టులో ఉన్న డెయిరీని కంపెనీ యాక్టులోకి మార్చి అప్పటి చైర్మన్ చల్లా శ్రీనివాసరావు డెయిరీని కోలుకునే అవకాశాలు కూడా లేకుండా చేశాడు. పాత పాలకమండలి చైర్మన్ చల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డెయిరీని అప్పట్లో నిండా ముంచారు. పాల‘మాల్యా’గా పేరొందిన ఆయన డెయిరీని దాదాపు రూ.80 కోట్ల అప్పుల్లోకి నెట్టి ఒట్టిపోయిన గేదెను వదిలించుకున్న తీరులా చేశాడు. చంద్రబాబు కనుసన్నల్లోనే డెయిరీ నాశనం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఒంగోలు డెయిరీ సర్వనాశనమైందని జిల్లాలోని ప్రతి పాడి రైతుకు తెలుసు. తన హెరిటేజ్ డెయిరీని లాభాల్లోకి వచ్చేలా చేసి ఒంగోలు డెయిరీని కోలుకోలేని స్థితిలోకి తెచ్చిందే చంద్రబాబు.. అన్న ప్రచారం జిల్లా రైతుల్లో ఉంది. డెయిరీని తిరిగి యథావిధిగా నిర్వహించుకునేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీడీడీసీఎఫ్ నుంచి రూ.35 కోట్ల రుణం ఇప్పించింది. డెయిరీని పూర్తిగా కోలుకోలేని స్థితిలోకి నెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టించి మరీ రుణం ఇప్పించింది. రుణానికి తాకట్టుగా డెయిరీకి చెందిన రూ.58.98 కోట్ల విలువైన 8.75 ఎకరాలను తనఖా పెట్టారు. దీనికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయా సందర్భాల్లో ప్రకటించిన రెపోరేటు మీద 2 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం ప్రస్తుతం ఈ రుణానికి 8.25 శాతం వడ్డీ రేటు పడుతుంది. అందుకుగాను రుణాన్ని 2020 నవంబర్ నుంచి నెల నెలా కంతుల వారీగా వాయిదాలు చెల్లించేలా మారిటోరియం ఉంటుంది. అప్పటి నుంచి నెలకు రూ.18,01,062 వాయిదాలుగా చెల్లించాలి. ఆ నిధులను డెయిరీ నిర్వహణతో పాటు అంటే ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, డెయిరీ అభివృద్ధికి వినియోగించాల్సిందిపోయి అప్పనంగా కాజేశారు. ఈ ఏడాది నవంబర్ నుంచి 120 సమాన వాయిదాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంది. భారంగా జీత భత్యాలు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు తయారైంది ఒంగోలు డెయిరీ పరిస్థితి. అసలే అప్పుల్లో ఉన్న డెయిరీకి అదనంగా కొత్తగా బి.జగదీశ్వరరావు అనే వ్యక్తిని సీఈఓను నియమించారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు సంబంధించిన జీతాలు నెలకు రూ.40 లక్షలు. అసలే భారంగా మారితే నూతన కమిటీ కొత్తగా అదనంగా మరో ముగ్గురు ఉద్యోగులను నియమించింది. ఈ ముగ్గురి జీతభత్యాలు వెరసి నెలకు అక్షరాలా రూ.3 లక్షలు. సీఈవోకు నెలకు రూ.లక్ష జీతం, అదనంగా అదనపు సౌకర్యాల పేరుతో హీనపక్షాన నెలకు రూ.50 వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా నియమించింన కమిటీ ముగ్గురికీ కలిపి నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తూ వచ్చారు. అదనంగా చేరిన వారి జీతభత్యాలు పేరుతో మొత్తం 18 నెలలకు కలిపి రూ.62 లక్షలు అప్పనంగా తీసుకున్నారు. డెయిరీని గాడిలో పెట్టి లాభాల బాట పట్టిస్తారనుకుంటే ఆ విషయాన్ని విదిలేసి పాత కమిటీని కాపాడే పనిలో నిమగ్నమై డెయిరీని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టారు. చివరకు కోలుకోలేని స్థితిలోకి డెయిరీని నెట్టి డెయిరీని కాపాడతాడనుకున్న సీఈవో జగదీష్ రాజీనామా చేసి గప్‌చప్‌గా వెళ్లిపోయాడు. బొక్కింది కక్కించేదెవరు? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు బొక్కిన రూ.కోట్లు కక్కించేది ఎవరు. పాత కమిటీ దాదాపు రూ.80 కోట్లకు పైగా బొక్కి డెయిరీని నిలువునా నష్టాల్లోకి నెట్టింది. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం రోజు డెయిరీ చైర్మన్ జె.మురళీ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించి కాజేసిన మొత్తాన్ని తిరితి రాబడతామని ప్రతినబూనారు. ఇప్పటికీì ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా పాత కమిటీ పాపాలను వెనకేసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారన్న ఆరోపనలు వినవస్తున్నాయి. ఫొరెన్సిక్ ఆడిట్లో ఎన్నో అక్రమాలు బయట పడుతుంటే అందుకు ప్రస్తుతం ఉన్న అధికారులు రికార్డులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. లాభాలతో సాగిపోతున్న డెయిరీని చల్లా శ్రీనివాసరావు కంపెనీ చట్టంలోకి మార్చటం వెనుకే దోచుకునే దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్లు అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. దోచుకున్న డబ్బును అప్పులు తిరిగి చెల్లిస్తున్నామంటూ నూతన కమిటీ తిరిగి డెయిరీని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టేసిందనడంలో సందేహం లేదు. 15 ఏళ్లకు పైగా చైర్మన్‌గా ఉన్న కందుకూరుకు సమీపంలోని ఓగూరుకు చెందిన టీడీపీ నాయకుడు చల్లా శ్రీనివాసరావు రూ.కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
సోషల్ మీడియాలో డెయిరీ వివాదం
రచ్చకెక్కిన ఒంగోలు పాల డెయిరీ అవినీతి చైర్మన్‌ను ‘పాలమాల్యా’గా అభివర్ణించిన టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరిన చైర్మన్‌పై ఆరోపణలు డెయిరీ చైర్మన్‌పై దుమ్మెత్తిపోస్తున్న స్వపక్షం డెయిరీని కాపాడుకుందామంటూ ఉద్యమం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు డెయిరీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయా.. నిబంధనలకు విరుద్ధంగా డెయిరీని కంపెనీ యాక్టులోకి మార్చడమే కాకుండా కోట్లాది రూపాయల నిధులు మింగేశారా.. ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వకుండా సొమ్ము స్వాహా చేశారా.. ఇవి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలువడుతున్న ఆరోపణలు. ఒంగోలు డెయిరీపై పతాకస్థాయికి చేరిన ఆరోపణలు చూస్తే ఎవరికైనా నిజమేనని అనిపించక మానదు. విశేషమేమిటంటే ఆరోపణలు చేస్తోంది సాక్షాత్తు అధికార పార్టీ కార్యకర్తలే. నేతల అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఒంగోలు డెయిరీని కాపాడుకుందామంటూ టీడీపీ కార్యకర్తలు ఏకంగా డెయిరీ చైర్మన్‌పైనే పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగారు. ఇందుకు సోషల్ మీడియానే వేదిక చేసుకోవడం గమనార్హం. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆరోపణలు పరిశీలిస్తే.. డెయిరీ చైర్మన్ చల్లాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ ఇలా.. ఆంధ్రా బ్యాంక్ కు నుంచి రూ.10 కోట్ల రుణం తెచ్చి ఆ నిధులను చైర్మన్‌నే స్వాహా చేసినట్లు సోషల్ మీడియాలో పచ్చ పార్టీ కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. మళ్లీ అదనంగా మరో రూ.10 కోట్లు ఇవ్వమని బ్యాంకు అధికారులను చైర్మన్ కోరగా ట్రాక్ రికార్డు సరి లేదంటూ వారు ముఖం చాటేసినట్లు సమాచారం. ఇండేస్ బ్యాంక్ విశాఖ నుంచి రూ.5 కోట్లు సైతం స్వాహా చేసినట్లు ఆరోపిస్తున్నారు. రాయలసీమ పాలను పొడిగా మార్చినందుకు వచ్చిన డబ్బులను సైతం స్వాహా చేశారని, డెయిరీలోని సరుకు, గ్రాట్యుటీకి కట్టాల్సిన సొమ్ము సైతం స్వాహా అయినట్లు ఆరోపిస్తున్నారు. డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావును ‘పాల మాల్యా’ అంటూ పేరు పెట్టి మరీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కర్ణాటక ఫెడరేషన్ నుంచి ఒంగోలు డెయిరీకి వచ్చే పాలను పొడిగా మార్చి వారికి వెనక్కి ఇవ్వవలసిన 700 టన్నుల పొడిని సొంతానికి అమ్ముకున్నారని, హేరిటేజ్ పాలను పొడిగా మార్చి దాన్ని సైతం అమ్ముకోగా గొడవ కావడంతో గోప్యంగా డబ్బులు కట్టిన వైనాన్ని సోషల్ మీడియాలో చూపించారు. 423 పాల సొసైటీలుండగా కేవలం 10 సొసైటీల మద్దతుతో డెయిరీని కంపెనీల యాక్టులోకి మార్చిన వైనంపై విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఆస్తుల బదలాయింపుపై స్టే ఇచ్చిన ఆ ఆస్తులను తనఖా పెట్టి లోన్లు తెస్తున్నారని ట్రైపార్టీ అగ్రిమెంటు బ్యాంకుల ద్వారా మీకు రైతులకు ఇప్పించిన బర్రెల లోన్లు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద జమ చేసుకుంటున్న దానిలో కిరికిరి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పాల లెక్క సొంత జేబుల్లోకి వెళ్తుందని చైర్మన్‌పైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒంగోలు డెయిరీ ప్రకాశం జిల్లా పాడి రైతుల బకాయిలు చెల్లించని దివాలాకోరు తనానికి దిగజార్చింది మీరేనంటూ చైర్మన్‌పై ధ్వజమెత్తుతున్నారు. ప్రకాశం జిల్లా పాడి రైతుల ఆత్మాభిమానాన్ని విశాఖ డెయిరీకి తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. డెయిరీ ఉద్యోగుల సహకార పరపతి సంఘం లిమిటెడ్ జూలై 1వ తేదీకి జమ చేయాల్సిన రూ.4 లక్షలు నేటి కీ జమ చేయలేదని ఆరోపిస్తున్నారు. పాల డెయిరీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత తమపైన ఉందంటూ అధికార పార్టీకి చెందిన డెయిరీ చైర్మన్‌పై ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగడం పెద్ద చర్చకు దారి తీసింది. -
అగ్ని ప్రమాదంలో డెయిరీకి రూ.2 కోట్ల నష్టం
ఒంగోలు క్రైం: ఒంగోలు విజయ డెయిరీలోని పాలకేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నట్లు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రమాదం జరగటంతో ఆయన శుక్రవారం బోర్డు ఆఫ్ డెరైక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక డెయిరీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పాలపొడి ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై నిశితంగా సమీక్షించారు. ప్రమాదానికి గురైన ఎయిర్‌హీటర్ చాంబర్ పక్కనే ఆపరేటర్ ఉన్నప్పటికీ అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అన్నారు. పాలపొడి తయారీ నిలిచిపోయిందని, దీని వలన రోజువారి నష్టం అధికంగానే ఉంటుందని చెప్పారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలను పొడిగా మార్చే ఈ ఎయిర్ హీటర్ చాంబర్ పునరుద్ధరించేందుకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అందుకోసం ఢిల్లీ మదర్ డెయిరీలో పని చేస్తున్న వెంకట్ అనే నిపుణుడ్ని పిలిపిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. విజయవాడ నుంచి కూడా సాంకేతిక నిపుణులను రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజూ రూ.7 లక్షల చొప్పున ఎన్ని రోజులు పాలపొడి ఉత్పత్తి ఆగిపోతే అంత మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు వివరించారు. డెయిరీలో ప్రస్తుతం 6 లక్షల లీటర్ల పాలు నిల్వ ఉన్నాయని ఈ పాలను వేరే ప్రైవేట్ డెయిరీలకు తరలించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. డెయిరీలో పాలపొడి ఉత్పత్తి ఆగిపోవడంతో తమిళనాడు, కర్ణాటకలోని వినియోగదారులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందన్నారు. అనంతరం బోర్డు ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. -
అమ్మ తనములోని అనురాగమును పంచు
"సీ " అమ్మ తనములోని అనురాగమును పంచు పొలుపైన కథలెన్నో తెలుగులోన నాన్నలా రక్షించి నవ్యనీతులు నేర్పు చెలువైన మణులెన్నొ తెలుగులోన అన్నయ్య నీడగా అండగా నిలుచుండు కొలువైన గతులెన్నో తెలుగులోన అత్తయ్య తోడుగా చక్కగా అలరించు విలువైన గనులెన్నో తెలుగులోన "తే" గీ" ఎన్నొ కావ్యాల గేయాల ఇంపు సొంపు ముగ్ధ మొహన భావాల మోహరింపు తెలుగు భాషంటె జగతికే వెలుగు చూడ వాణి వినిపించు తెలుగోడ ! వాడ వాడ - తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా పేరు :- చల్లా శ్రీనివాసరావు తెలుగు పండిట్ నిజాంపేట, హైదరాబాద్