గవర్నర్ను కలిసిన కేసీఆర్ దంపతులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్కు వెళ్లి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తలపెట్టిన ఆయత చండీ మహా యాగంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్ను కేసీఆర్ దంపతులు ఆహ్వానించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఈ నెల 23 నుండి 27 వరకు కేసీఆర్ చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం విజయవాడకు వెళ్లిన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి యాగానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.