Chandol
-
ట్రక్కు బీభత్సం: 8 మంది మృతి
ఒడిశా: జగత్సింగ్పూర్ జిల్లాలోని చందోల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో వస్తున్న ప్రయాణికులను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా నెమల అనే ఊరిలో స్నానపూర్ణిమ అనే ఉత్సవంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. చనిపోయిన వారికి సరైన నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే డ్రైవర్ను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు జగత్సింగ్పూర్-మచ్చగాం రహదారిని బ్లాక్ చేశారు. పోలీసులను పెద్దమొత్తంలో సంఘటనా స్థలానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ- జీపు ఢీ: ఏడుగురు మృతి
ఒడిశాలోని కేంద్రపడ జిల్లా చాందోల్ వద్ద గురువారం లారీ - జీపు ఢీ కొన్నాయి. ఆ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఆ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.