ట్రక్కు బీభత్సం: 8 మంది మృతి | Eight Killed, Two Injured in Road Accident in Odisha | Sakshi
Sakshi News home page

ట్రక్కు బీభత్సం: 8 మంది మృతి

Published Sat, Jun 10 2017 3:54 PM | Last Updated on Sat, Mar 9 2019 4:29 PM

Eight Killed, Two Injured in Road Accident in Odisha

ఒడిశా: జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలోని చందోల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో వస్తున్న ప్రయాణికులను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా నెమల అనే ఊరిలో స్నానపూర్ణిమ అనే ఉత్సవంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
ఘటన జరిగిన అనంతరం ట్రక్కు డ్రైవర్‌ పరారయ్యాడు. చనిపోయిన వారికి సరైన నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే డ్రైవర్‌ను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు జగత్‌సింగ్‌పూర్‌-మచ్చగాం రహదారిని బ్లాక్‌ చేశారు. పోలీసులను పెద్దమొత్తంలో సంఘటనా స్థలానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement