jagatsinghpur
-
యాస్ తుపాను ‘అల’జడిలో జననం
భువనేశ్వర్: ‘యాస్’ తుఫాన్ అలజడి సమయంలోనూ పలు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. బాలాసోర్, భద్రక్, జగత్సింగ్పూర్, కేంద్రాపడా జిల్లాల్లో తుపాను ముంచెత్తుతున్న తరుణంలో పలువురు గర్భిణులు ప్రసవించారు. తల్లీబిడ్డలంతా క్షేమంగా ఉన్నట్లు రాష్ట్ర సమాచార, ప్రసార విభాగం ప్రకటించింది. నెలలు నిండిన గర్భిణులను అంబులెన్సుల్లో తుఫాన్‌కు ముందుగానే ప్రసూతి కేంద్రాల్లో చేర్చిన విషయం తెలిసిందే. జగత్సింగ్పూర్ జిల్లాలో నెలలు నిండిన 31 మంది గర్భిణుల్లో 10 మంది ప్రసవించినట్లు సమాచారం. ఇతర ప్రాంతాల సమాచారం అందాల్సి ఉంది. -
ట్రక్కు బీభత్సం: 8 మంది మృతి
ఒడిశా: జగత్సింగ్పూర్ జిల్లాలోని చందోల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో వస్తున్న ప్రయాణికులను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా నెమల అనే ఊరిలో స్నానపూర్ణిమ అనే ఉత్సవంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. చనిపోయిన వారికి సరైన నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే డ్రైవర్‌ను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు జగత్సింగ్పూర్-మచ్చగాం రహదారిని బ్లాక్ చేశారు. పోలీసులను పెద్దమొత్తంలో సంఘటనా స్థలానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
జగత్సింగ్ పుర్: ఒడిశాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిదిమంది దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జగత్సింగ్పూర్ జిల్లా మచ్చోగాం వద్ద చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఎనిమిదిమంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ పన్నెండేళ్ల బాలిక కూడా ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం జగత్సింగ్ పుర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కటక్ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.