Chapman
-
గుండెపోటుతో ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ మృతి
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, మిడ్ ఫీల్డర్ కార్ల్టన్ చాప్మన్ కన్నుమూశాడు. గుండెపోటుతో బెంగళూరులో సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఆదివారం అస్వస్థతకు గురైన 49 ఏళ్ల చాప్మన్ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించినట్లు ఆయన టీమిండియా సహచరుడు బ్రూనో కౌటిన్హో తెలిపాడు. 1995 నుంచి 2001 వరకు చాప్మన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతని సారథ్యంలోని టీమిండియా 1997 ‘శాఫ్’ కప్‌ను గెలుచుకుంది. -
హాంకాంగ్‌పై స్కాట్లాండ్ విజయం
నాగ్‌పూర్: టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌ను స్కా ట్లాండ్ జట్టు విజయంతో ముగించింది. ఇప్పటికే ఈ గ్రూపు నుంచి అఫ్ఘాన్ ప్రధాన టోర్నీకి అర్హత సాధిం చగా నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 8 వికెట్ల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన స్కాట్లాండ్ నెగ్గింది. ఐసీసీ గ్లోబల్ ఈవెంట్లో స్కాట్లాండ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. చాప్మన్ (41 బంతుల్లో 40; 1 ఫోర్; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మకాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో లక్ష్యాన్ని 10 ఓవర్లలో 76 పరుగులకు కుదించగా... 7.4 ఓవర్లలో రెండు వికెట్లకు 78 పరుగులు చేసి గెలిచింది. క్రాస్ (14 బంతుల్లో 22; 1 ఫోర్; 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. -
పరదేశి బావార్చి
పాట్రిక్ లారెన్స్ చాప్‌మ్యాన్ . వయసు 74 ఏళ్లు. ఈ లండన్ దొర ఇండియాకు 44 సార్లు వచ్చాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతూనే ఉంటాడు. వెరైటీ ఇండియన్ వంటకం కనిపిస్తే చాలు లొట్టలేసుకుని తినడమే కాదు.. దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటాడు. ఆ ఘుమఘుమలను తాను స్థాపించిన కర్రీ క్లబ్‌లోని మెంబర్స్‌కు నేర్పిస్తాడు. ఇటీవల బార్బీక్యూ నేషన్ రెస్టారెంట్ కోసం చాప్‌మ్యాన్ హైదరాబాద్ వచ్చాడు. ఈ ఎర్రతోలు మనిషికి మన మసాలాల గురించి ఎలా తెలిసిందని అడిగితే.. ‘ఇండియాకు స్వాతంత్య్రం రావడానికి ముందు మా పూర్వీకులు ఇక్కడే ఉండేవారు. మా అమ్మమ్మ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పుట్టింది. ఆమె ఇక్కడే పెరిగింది. నా చిన్నతనంలో ఆమె నాకు రుచి చూపించిన ఇండియన్ క్వీజిన్ టేస్ట్ ఎప్పటికీ మరచిపోలేను. 1965 నుంచి తరుచూ ఇండియాకు వస్తూనే ఉన్నాను. నాకు ఇష్టమైన ఇండియన్ వంటకాల గురించి తెలుసుకుంటూనే ఉన్నా. వాటిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని 1982లో కర్రీక్లబ్ స్థాపించాను. ఆ క్లబ్లో సభ్యత్వం తీసుకున్నవారికి భారతీయ వంటకాలపై శిక్షణ అందిస్తున్నా. ఇప్పుడు మా క్లబ్లో 10వేల మంది సభ్యులున్నారని’ చెప్పుకొచ్చారు. భారతీయ వంటకాలపై విస్తృత పరిశోధనలు చేసిన చాప్‌మ్యాన్.. ఇండియన్ క్యుజిన్స్‌పై 36 పుస్తకాలు రాశారు కూడా. ఈ ఫారిన్ నలుడి పాకప్రావీణ్యానికి హ్యాట్సాఫ్ చెప్పేద్దాం.