charakonda mandal
-
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
-
ఠాణాకు తాళం!
చారకొండ (కల్వకుర్తి): 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీస్ స్టేషన్కు తాళం వేశారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో వెలుగు చూసింది. నిబంధనల ప్రకారం ఒకరి తర్వాత మరొకరు మధ్యాహ్నం భోజనాలకు వెళ్లాల్సి ఉండగా, స్టేషన్కు తాళం వేసి అందరూ ఒకేసారి వెళ్లారు. చారకొండ పోలీసు స్టేషన్లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఎస్సై పోచయ్య దొంగతనం కేసు విచారణకు ఆదివారం బయటకు వెళ్లారు. కానిస్టేబుల్ శరత్ భోజనానికి బయటకు వెళ్లారు. ఆయన వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ భూపతిరెడ్డి స్టేషన్కు తాళం వేసి వెళ్లిపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఫొటో తీసి వాట్సాప్లో పెట్టారు. ఇది కాస్తా వైరల్గా మారి వెల్దండ సీఐ దృష్టికి వెళ్లింది. ఆయన హుటాహుటిన చారకొండ పోలీస్ స్టేషన్కు చేరుకునే సరికే స్టేషన్ తాళం తీశారు. దీనిపై సీఐని వివరణ కోరగా తాళం ఎందుకు వేశారో విచారించి తెలుసుకుంటామని తెలిపారు. -
చారకొండ మండల ఏర్పాటుపై కసరత్తు
–సౌకర్యాల కోసం పీడీ అధ్యయనం వంగూరు : మం డల పరిధిలోని చారకొండ గ్రామాన్ని మండల కేం ద్రం చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభమయింది. శుక్రవారం మెప్మా పీడీ లింగ్యానాయక్ వంగూరు, చారకొం డ గ్రామాల్లో పర్యటించారు. వంగూరు రెవెన్యూ కార్యాలయంలో మండలానికి సంబంధించిన మ్యాపు, గ్రామాల మధ్య ఉన్న దూరాన్ని పరి శీలించారు. అనంతరం చారకొండ గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి, భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలను పరిశీలించారు. అయితే గ్రామంలోని అతిథిగృహం, గ్రామపంచాయతీ కార్యాలయంతోపాటు ఇతర భవనాలను అఖిలపక్ష నాయకులు చూపించారు. ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులపై కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.