![Lock to the police station at Charakonda - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/7/thal.jpg.webp?itok=4d62oatw)
చారకొండ (కల్వకుర్తి): 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీస్ స్టేషన్‌కు తాళం వేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండలో వెలుగు చూసింది. నిబంధనల ప్రకారం ఒకరి తర్వాత మరొకరు మధ్యాహ్నం భోజనాలకు వెళ్లాల్సి ఉండగా, స్టేషన్‌కు తాళం వేసి అందరూ ఒకేసారి వెళ్లారు. చారకొండ పోలీసు స్టేషన్‌లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు.
వీరిలో ఎస్సై పోచయ్య దొంగతనం కేసు విచారణకు ఆదివారం బయటకు వెళ్లారు. కానిస్టేబుల్ శరత్ భోజనానికి బయటకు వెళ్లారు. ఆయన వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ భూపతిరెడ్డి స్టేషన్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టారు. ఇది కాస్తా వైరల్‌గా మారి వెల్దండ సీఐ దృష్టికి వెళ్లింది. ఆయన హుటాహుటిన చారకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకునే సరికే స్టేషన్ తాళం తీశారు. దీనిపై సీఐని వివరణ కోరగా తాళం ఎందుకు వేశారో విచారించి తెలుసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment