మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు
♦ ప్రచార రథాన్ని ప్రారంభించిన ఇన్చార్జి కలెక్టర్
♦ జిల్లాకు కొత్తగా 9 పాఠశాలలు మంజూరు
♦ జూన్ 13వ తేదీ నుంచి దరఖాస్తులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాకు కొత్తగా మంజూరైన తొమ్మిది మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ చెప్పారు. ఇందులో బాలుర పాఠశాలలను కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా బాలికలకు రాజేంద్రనగర్, ఉప్పల్, తాండూరు, మల్కాజ్‌గిరిలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2016-17 విద్యాసంవత్సరంలో 5,6,7 తరగతులను ప్రారంభిస్తున్నామని, ఒక్కో తరగతిలో 80 మందిని చేర్చుకోనున్నట్లు వివరించారు. ఇందుకుగాను ఆన్లైన్ పద్ధతిలో జూన్13 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలున్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు.