మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు | admissions to residencial schools for minorities | Sakshi
Sakshi News home page

మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు

Published Sat, Apr 30 2016 5:01 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు - Sakshi

మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు

ప్రచార రథాన్ని ప్రారంభించిన ఇన్‌చార్జి కలెక్టర్
జిల్లాకు కొత్తగా 9 పాఠశాలలు మంజూరు
జూన్ 13వ తేదీ నుంచి దరఖాస్తులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాకు కొత్తగా మంజూరైన తొమ్మిది మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ చెప్పారు. ఇందులో బాలుర పాఠశాలలను కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా బాలికలకు రాజేంద్రనగర్, ఉప్పల్, తాండూరు, మల్కాజ్‌గిరిలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2016-17 విద్యాసంవత్సరంలో 5,6,7 తరగతులను ప్రారంభిస్తున్నామని, ఒక్కో తరగతిలో 80 మందిని చేర్చుకోనున్నట్లు వివరించారు. ఇందుకుగాను ఆన్‌లైన్ పద్ధతిలో జూన్13 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలున్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement