Minority residential school
-
బెంచీపై కూర్చునే విషయంలో ఘర్షణ
డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): మెస్ హాల్లోని బెంచీ మీద కూర్చునే విషయమై ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్‌కు చెందిన ఓవిద్యార్థి(14) బర్ధిపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో మెస్ హాల్లోని బెంచీ మీద కూర్చునే విషయమై ఈ విద్యార్థితోపాటు మరో విద్యార్థి పోటీపడ్డారు. ‘నేను ముందుగా వచ్చానంటే, నేను ముందుగా వచ్చాను’అని ఇద్దరూ గొడవపడ్డారు. సదరు విద్యార్థి ఛాతీపై పిడికిలి బిగించి బలంగా కొట్టడంతో నేలపై బోర్లా పడిపోయాడు. టీచర్లు, తోటి విద్యార్థులు వెంటనే వచ్చి బాధిత విద్యార్థిని పైకి లేపేందుకు యత్నించగా, అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఆందోళన చెందిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ ఎండీ జమీల్‌కు చేరవేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి బాధిత విద్యార్థిని తరలించగా వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించా రు. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం మేరకు ఆస్పత్రికి చేరుకున్న బాధితుడి తల్లి, కుటుంబీకులు, బంధువులు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థి మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది భిన్నమైన కథనాలు చెప్పడంతో అతడి కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ప్రిన్సిపాల్సహా బా ధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్పల్లి ఎస్సై గణేశ్ తెలిపారు. -
సిద్ధిపేట: పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 120 మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. దాదాపు 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. గోప్యంగా ఉంచిన అధికారులు, కొంత మంది విద్యార్థుల పరిస్థితి విషమించడంతో హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఫుడ్ పాయిజన్ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: భారమైన స్టూడెంట్ బస్‌పాస్ చార్జీలు.. ఐదు కిలో మీటర్లకు రూ.35, పాత, కొత్త చార్జీలు ఇలా! -
ప్రిన్సిపల్ కాళ్లు మొక్కుతానన్న స్పీకర్ సాబ్
-
గురుకులం విద్యార్థిని పరార్
సాక్షి, ధర్మపురి: మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి ఓ విద్యార్థిని పరారైన సంఘటన ధర్మపురిలో జరిగింది. ధర్మపురి మండలం మగ్గిడిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఇటీవల ధర్మపురి పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ స్తంభంకాడి మోహన్ పర్యవేక్షణలో సుమారు 260కి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి ధర్మపురికి చెందిన అశ్వియా సోహాన్ అనే 7వ తరగతి విద్యార్థిని పాఠశాల వెనుక గేట్ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. రాత్రిపూట కూతురు ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. జరిగిన సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు హాసియా, అలీపాషాతో పాటు మాజీ వైస్ ఎంపీపీ అయ్యోరి రాజేశ్, ముస్లీం నాయకులు ప్రిన్సిపాల్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా పాఠశాల నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించకపోవడం ఏంటని సిబ్బంది తీరుపై ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఇటీవల ఇక్కడ చదివే ఇద్దరు విద్యార్థినులు ఇదే విధంగా పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లగా ఆ విషయాన్ని కప్పిపుచ్చారంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని ప్రిన్సిపాల్ చెప్పడంతో శాంతించారు. -
ప్రినిపాల్ సస్పెన్షన్
కామారెడ్డి: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ బషీరొద్దీన్ హైమద్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సెక్రెటరీ శేషుకుమారి ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలను సొంత భవనంలోకి మార్చాలని పలుమార్లు సూచించినప్పటికీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విద్యార్థులను చితకబాదాడని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పనితీరుపై చేసిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి వేటు వేశారు. వనపర్తి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ జానీమియాకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు
♦ ప్రచార రథాన్ని ప్రారంభించిన ఇన్చార్జి కలెక్టర్ ♦ జిల్లాకు కొత్తగా 9 పాఠశాలలు మంజూరు ♦ జూన్ 13వ తేదీ నుంచి దరఖాస్తులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాకు కొత్తగా మంజూరైన తొమ్మిది మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ చెప్పారు. ఇందులో బాలుర పాఠశాలలను కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా బాలికలకు రాజేంద్రనగర్, ఉప్పల్, తాండూరు, మల్కాజ్‌గిరిలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2016-17 విద్యాసంవత్సరంలో 5,6,7 తరగతులను ప్రారంభిస్తున్నామని, ఒక్కో తరగతిలో 80 మందిని చేర్చుకోనున్నట్లు వివరించారు. ఇందుకుగాను ఆన్లైన్ పద్ధతిలో జూన్13 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలున్న విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు.