charla palli jail
-
జైల్లో మద్యం లభ్యం
చర్లపల్లి సెంట్రల్ జైల్లో మధ్యం లభ్యమైంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ ఖైదీ వద్ద మద్యం బాటిళ్లను కనుగొన్నారు. రమేశ్ అనేఖైదీ వద్ద ఉన్న మూడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. పటిష్టమైన భద్రతా వలయం దాటుకుని మ్యదం లోపలకి ఎలా వచ్చిందనే అంశంపై జైలు అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ హెడ్ వార్డర్ సహకారంతోనే మధ్యం జైల్లోకి వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
'చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి తరలించండి'
హైదరాబాద్: ముడుపుల కేసులో అరెస్టయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి చర్లపల్లికి తరలించాలని ఏసీబీ అధికారులు కోరారు. ఈ మేరకు కోర్టులో రిక్విజేషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను నామినేట్ ఎమ్మెల్యే స్టీఫెన్ ముడుపులు ఇస్తుండగా రేవంత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్‌ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. చంచల్‌గూడ జైలుకు తరలించారు. భద్రత కారణాల రీత్యా రేవంత్‌ను చర్లపల్లికి తరలించాలని ఏసీబీ అధికారులు కోరారు. -
చర్లపల్లి జైల్లో ఖైదీల ఆందోళన
హైదరాబాద్: చర్లపల్లి జైల్లో ఖైదీలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తరచూ అధికారులు తమను వేధిస్తున్నారని ఖైదీలు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఈరోజు ఉదయం అల్పాహార సమయంలో వేధిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. ఖైదీల దగ్గర సెల్ ఫోన్ లు ఉన్నాయంటూ అధికారులు వేధిస్తున్నారని.. ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంలో ఓ ఖైదీ ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.