chatrinaka
-
హైదరాబాద్ పాతబస్తీలో పేలుడు
-
పాతబస్తీలో తల్లి, కూతురు దారుణ హత్య
హైదరాబాద్: నగరంలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జీఎంచౌనిలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, కూతురు అనూహ్యంగా మరణించారు. తెల్లవారే సరికి వారి మెడలు కోసి ఉన్నాయి. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారితోపాటు ఉండే భర్త కనిపించకుండాపోయాడు. దీంతో స్థానికులు అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్రమ ఆయుధాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో 9ఎంఎం పిస్టల్‌తో పాటు రెండు బుల్లెట్లను సౌత్‌జోన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హోంగార్డు భార్య, కుమారుడు అదృశ్యం
చంద్రాయణగుట్ట (హైదరాబాద్) : నగరంలో పనిచేస్తున్న ఓ హోంగార్డు భార్య, కుమారుడు అదృశ్యం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఎం.కౌలుట్లయ్య ఉప్పుగూడ శివాజీనగర్‌లో తన భార్య ఎం.రేణుక అలియాస్ నీలావతి(24), కుమారుడు మహేష్ రాజు (3)తో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా గత నెల 28న కౌలుట్లయ్య తన స్వస్థలమైన కర్నూలుకు వెళ్లి 30వ తేదీ సాయంత్రం వచ్చి చూడగా భార్య, కుమారుడు కనిపించలేదు. వారి ఆచూకీ కోసం అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య
ఛత్రీనాక (హైదరాబాద్): కుటుంబకలహాల కారణంగా మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం నగరంలోని ఛత్రీనాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.