Cheepurupalli Assembly Constituency
-
గంటా శ్రీనివాస్ దారెటో తేలిది ఇవాళే!
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారా?.. లేదంటే అయిష్టంగానే ఆ పార్టీలో కొనసాగుతారా? తన రాజకీయ భవిష్యత్తు కోసం గంటా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ చర్చే ప్రధానంగా నడుస్తోంది. చీపురుపల్లిలో పోటీ తన వల్ల కాదని గంటా చెబుతున్నా.. చంద్రబాబు మాత్రం పోటీ చేయాల్సిందేనని తేల్చేశారు. దీంతో ఆయన ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు నన్ను సరైన అభ్యర్థిగా పార్టీ భావించింది. చీపురుపల్లిలో సీనియర్ లీడర్‌పై పోటీ చేస్తే బాగుంటుందని గట్టి ప్రతిపాదన పెట్టింది’’.. ఫిబ్రవరి 23వ తేదీ ప్రెస్మీట్లో గంటా శ్రీనివాసరావు చెప్పిన మాట. అయితే వెంటనే ఆయన వెనకడుగేశారు. చీపురుపల్లిలో అవకాశాలపై తన సహచరులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నానని చెబుతూనే.. అక్కడ నుంచి పోటీకి విముఖత ప్రదర్శిస్తూ వచ్చారు. ‘ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవమే. కానీ, ఈసారి గెలిచిన చోట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నా’ ఇది మారిన గంటా స్వరం. ఈ క్రమంలో పదే పదే చంద్రబాబును కలుస్తూ.. తాను చీపురుపల్లిలో అదీ బొత్స లాంటి పవర్ఫుల్ లీడర్‌పై పోటీకి సిద్ధంగా లేనని, కాదని బలవంతంగా పోటీకి దించితే ఫలితం మరోలా ఉండొచ్చని మొరపెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు కనికరించడం లేదు. పోటీ చేస్తే చీపురుపల్లి నుంచే చేయాలని.. లేకుంటే మీ దారి మీరు చూస్కోండంటూ చంద్రబాబు తేల్చేసినట్లు సమాచారం. తాజాగా బుధవారం కూడా ఆయన చంద్రబాబును కలిసినా.. అదే సమాధానం వచ్చింది.దీంతో.. గంటా శ్రీనివాస్ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్య అనుచరులతో గురువారం గంటా తన నివాసంలో భేటీ కానున్నారు. వాళ్లతో చర్చించి తన తర్వాతి అడుగులపై కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. -
అందరి చూపు వైఎస్సార్సీపీ వైపే..
చీపురుపల్లి(గరివిడి): జిల్లాలో అందరి చూపు వైఎస్సార్ సీపీవైపే. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తుండడంతో టీడీపీ శ్రేణులు పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నాయి. అర్హతే కొలమానంగా సంక్షేమ పథకాలు అందజేయడం, ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధికలగడం, జనబలం మెండుగా ఉండడంతో వైఎస్సార్సీపీలో చేరి ప్రజలకు సేవచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే కోవలో గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మన్నెపురి లక్ష్మణరావు ఆధ్వర్యంలో బద్రి పాపినాయుడు, మందాడి రాంబాబు, బద్రి లక్ష్మీనారాయణ, కిరాల రాము, పిసిని భవాని, బెల్లాన లక్ష్మిలకు చెందిన 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో శుక్రవారం చేరాయి. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల గుర్తుకొస్తారని, అనంతరం వారివైపు కన్నెత్తి కూడా చూడరని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కష్ట, సుఖాలను పంచుకోవడం సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు నైజమన్నారు. టీడీపీ నాయకులు ఈ రాష్ట్రానికి, జిల్లాకు, నియోజకవర్గానికి ఏం చేశారో ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో 600 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీను నెరవేర్చకుండా, మళ్లీ ఆరు గ్యారంటీలు పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనతో కొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల, భోగాపురం ఎయిర్‌పోర్టు, గిరిజన వర్సిటీ, గిరిజన ఇంజినీరింగ్, జేఎన్టీయూ వర్సిటీ మంజూరు చేసి ప్రజల చిరకాల కలను సీఎం సాకారం చేశారన్నారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, చీపురుపల్లి మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీలు గుడివాడ శ్రీరాములునాయుడు, సర్పంచ్ తమ్మినాయుడు, బార్నాల సూర్యనారాయణ, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో జోరుగా చేరికలు టీడీపీని వీడుతున్న శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరిన వెదుళ్లవలస టీడీపీ నాయకులు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన జెడ్పీచైర్మన్, ఎంపీ -
మంత్రి బొత్స జిల్లా పర్యటన నేడు, రేపు
విజయనగరం అర్బన్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల్లో పాల్గొనడంతో పాటు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 3న ఉదయం 10 గంటలకు గరివిడి ఫుట్‌బాల్ మైదానంలో వైఎస్సార్ ఆసరా సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు గెడ్డపువలసలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 4 గంటలకు కొండదాడిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రానికి విజయనగరంలోని తన నివాసానికి చేరుకుంటారు. 4న ఉదయం 10.30 గంటల నుంచి మెరకముడిదాం మండలం గర్బాంలో జరిగే వైఎస్సార్ ఆసరా సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చీపురుపల్లిలో పాలిటెక్నిక్ కళాశాలలో నూతన భవనాలను ప్రారంభిస్తారు. 3.15 గంటలకు పేరిపిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్ర భవనాలను ప్రారంభించి, సాయంత్రం 5 గంటలకు విశాఖ మీదుగా రాత్రికి విజయవాడ చేరుకుంటారు. -
వైఎస్సార్ ఆసరా సంబరాలు సందడిగా సాగాయి
చీపురుపల్లి, తెర్లాంలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్ ఆసరా సంబరాలు సందడిగా సాగాయి. మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కలిగిన ఆర్థిక ప్రయోజనాలను తెలియజేశారు. థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. మహిళలకు అండగా నిలుస్తూ, ఆర్థిక సంక్షేమానికి కృషిచేస్తున్న జగనన్నను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామంటూ చేతులెత్తి చెప్పారు. జగనన్న పాలనకు జేజేలు పలికారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలన, మహిళలకు చేసిన మేలును మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వివరించారు. పొదుపు మహిళలకు చీపురుపల్లిలో రూ.11.5కోట్లు, తెర్లాంలో రూ.5.89కోట్ల చెక్కులను అందజేశారు. ఎన్నికల వేళ మాయమాటలతో మోసంచేసేందుకు వస్తున్న టీడీపీ నాయకులపై అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. అతివలకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న ఘనత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వందేనని స్పష్టంచేశారు. – చీపురుపల్లి/తెర్లాం -
జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు ఒక అబద్ధం
చీపురుపల్లి: ప్రజల కోసం మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబెట్టుకుంటాడనే నమ్మకం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు ఉంటే..మాట చెబితే అది అబద్ధమే తప్ప ఎన్నటికీ ఆచరణలోకి రాదనే అభిప్రాయం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై ప్రజలకు ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు చీపురుపల్లి పట్టణంలోని లావేరురోడ్‌లో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి 2019 మే 30న నవరత్నాలు సంక్షేమ పథకాల ఫైలుపై తొలి సంతకం చేశారని, నాలుగేళ్లుగా సంక్షేమ పాలన దిగ్విజయంగా కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతో రాష్ట్రంలో 151 అసెంబ్లీ స్థానాలు, విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో ప్రజలు గెలిపించారన్నారు. అదే నమ్మకంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి కల్పన, సాగునీటి వనరులు, మౌలిక వసతులు అభివృద్ధితో బాటు పేదలు అభ్యున్నతి కోసం కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. పేదలకు సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ పేరుతో నేరుగా ఇంటికే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోనే అన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట పోర్టు నిర్మాణానికి సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని మరో మూడేళ్లలో వాటి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి రూ.13.5 లక్షలు కోట్లు పెట్టుబడులను ఆకర్షించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అవినీతి రహిత, పారదర్శక పరిపాలనకు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా డీబీటీ విధానం ద్వారా 2.5 లక్షల కుటుంబాల ఖాతాల్లో సంక్షేమ పథకాల డబ్బులు జమ చేయడం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల త్యాగాలతో 2024లో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మళ్లీ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా చంద్రబాబు పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా సీఎం జగన్మోహన్రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే విమర్శలు చేసిన చంద్రబాబునాయుడు అధికార దాహంతో టీడీపీ మహానాడులో అన్నీ ఉచితమే అంటూ ఆల్ ఫ్రీ బాబుగా మారిపోయాడన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలపై ఇటు ప్రజలు, అటు సొంత పార్టీ నేతలతో బాటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని స్పష్టం చేశారు. 2019 నుంచి ఇంతవరకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కులం, పార్టీ, మతం, జెండా చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకం అందించారని, ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలు గుండెలపై చేయి వేసుకుని నిర్థారణ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలాస నియోకవర్గ వైఎస్సాన్సీపీ పరిశీలకుడు కేవీ.సూర్యనారాయణరాజు, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, చీపురుపల్లి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, కోట్ల వెంకటరావు, తాడ్డి వేణు, పొట్నూరు సన్యాసప్పలనాయుడు, బెల్లాన బంగారునాయుడు, తోట తిరుపతిరావు, పతివాడ రాజారావు, కరిమజ్జి శ్రీనివాసరావు, ఇప్పిలి గోవింద, బాణాన శ్రీనివాసరావు, బాణాన రమణ తదితరులు పాల్గొన్నారు. నాలుగేళ్లలో 98.5 శాతం హమీలు అమలు చేసిన సీఎం జగన్ ప్రతిపక్ష నేతపై ప్రజల్లో లేని విశ్వసనీయత అధికారం కోసం ఆల్ ఫ్రీ బాబుగా మార్పు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు