cheer
-
Mann ki Baat: చీర్ఫర్ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న మన క్రీడాకారులను మరింత ఉత్సాహపరుద్దామని, వారిని ప్రోత్సహిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత అథ్లెట్లకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఛీర్ ఫర్ భారత్ అని ఉద్ఘాటించారు. అంతర్జాతీయ వేదికపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం ఒలింపిక్స్ క్రీడల ద్వారా మన ఆటగాళ్లకు వచ్చిందన్నారు. వారికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితం గణితశాస్త్రంలో ఒలింపిక్స్ జరిగాయని, నలుగురు భారతీయు విద్యార్థులు బంగారు పతకాలు, ఒకరు రజత పతకం సాధించారని ప్రశంసించారు. అస్సాంలోని అహోమ్ రాజుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడాల జాబితాలో స్థానం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది మనకు గర్వకారణమని అన్నారు. నేటి యువత మాదక ద్రవ్యాల విష వలయంలో చిక్కుకుంటుండడం బాధాకరమని అన్నారు. అలాంటి వారిని బయటకు తీసుకురావడానికి ‘మానస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్‌పై పోరాటంలో ఇదొక గొప్ప ముందడుగు అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనానికి సంబంధించి ‘1933’ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలి ‘‘త్వరలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. మువ్వన్నెల జెండాతో సెల్ఫీ దిగి హర్గర్తిరంగా.కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఖాదీ, చేనేత వ్రస్తాల విక్రయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇష్టపడినవారు ఇప్పుడు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఖాదీ వస్త్రాలు ధరిస్తున్నారు. హరియాణాలోని రోహతక్‌లో 250 మంది మహిళలు బ్లాక్ పెయింటింగ్, డయింగ్ శిక్షణతో జీవితాలను తీర్చిదిద్దుకున్నారు’’ అని మోదీ ప్రశంసించారు.నల్లమల చెంచులు టైగర్ ట్రాకర్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారిని టైగర్ ట్రాకర్స్‌గా అభివరి్ణంచారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల కొండలపై నివసించే చెంచు తెగల ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యపోతాం. టైగర్ ట్రాకర్స్‌గా వారు అడవిలో వన్యప్రాణుల సంచారంపై ప్రతి చిన్న సమాచారం సేకరిస్తారు. అటవీ ప్రాంతంలో అక్రమ కార్యక్రమాలపైనా నిఘా పెడతారు. టైగర్ ఫ్రెండ్స్‌గా వ్యవహరించే వీరు మానవులు, పులుల మధ్య ఎలాంటి వైరం లేకుండా చూస్తారు. చెంచుల కృషితో పులుల సంఖ్య పెరుగుతోంది’’ అని ‘మన్‌కీ బాత్’లో కొనియాడారు. దేశవ్యాప్తంగా పులుల జనాభా గొప్ప విజయమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని చెప్పారు. ఇది మనకు చాలా గర్వకారణమని చెప్పారు.అభివృద్ధి, వారసత్వాలకు పెద్దపీటన్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా అవతరింపజేయడమే ఏకైక లక్ష్యంగా వికసిత్ భారత్ అజెండా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అయితే వికసిత్ భారత్ అజెండాలో ప్రాచీన, వారసత్వ కట్టడాలు, సంస్కృతులను కాపాడుకుంటూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ముఖ్యమంత్రి పరిషత్’ భేటీలో 13 మంది సీఎంలు, 15 మంది డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మాట్లాడారు. సమాజంలోని భిన్న వర్గాల్లో చిట్టచివరి వ్యక్తికి సైతం కేంద్ర పథకాలు, సుపరిపాలన గురించి తెలిసేలా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సీఎంలు, డిప్యూటీ సీఎంలకు మోదీ సూచించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ తదితరలు ఈ భేటీలో పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలు ఎలా సమర్థంగా అమలు చేయాలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ‘‘సంక్షేమ పథకాలు లబ్దిదారులందరికీ అందేలా చూడటం మీ తక్షణ కర్తవ్యం. బీజేపీపాలిత రాష్ట్రాలు సుపరిపాలనకు సిసలైన చిరునామాగా మారాలి’’ అని మోదీ అన్నారు. -
'చీర్ అప్ భారత్' పోస్టర్ ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి
హైదరాబాద్ : ఈనాటి సమాజంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా వారి వారి పనుల ఒత్తిడి వల్ల మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. కేవలం కళల ద్వారానే ఈ పరిస్థితి నుంచి బయటపడటం సాధ్యమవుతుందని భావించి సిరిమువ్వ ఆర్ట్స్ బృందం వారు 'చీర్ అప్ భారత్(invoking inner happiness)' అనే ఒక కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరిమువ్వ ఆర్ట్స్ వారు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయస్సు గల వారికి ఉచితంగా నృత్యకళలో శిక్షణ ఇచ్చి వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి వారికి మెగా డాన్స్ షో ద్వారా కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు నృత్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఐదు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమం ఆరో సీజన్లో భాగంగా ఈ రోజు చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా 'చీర్ అప్ భారత్' లోగోను వారి ఆశ్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ ఒక మనిషిలోని సంతోషాన్ని బయటకి తీసుకురావడం సాధారణంగా జరిగే పని కాదు కానీ ఒక కళ ద్వారా మాత్రమే ఆ సంతోషాన్ని బయటకు తీసుకురాగలం అన్నారు. ఈ మంచి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ లోగోను నా చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నందుకు సంతోషంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిమువ్వ ఆర్ట్స్ డైరెక్టర్స్ వై. మధుసూదన్ రావు, వై. తులసి, ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు, హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, డాన్స్ మాస్టర్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు -
వారి కోసం స్టెప్పులేసిన డాక్టర్లు: వీడియో వైరల్
అసోం: కోవిడ్-19 సెకండ్ వేవ్ భయపెడుతున్న సమయంలో అసోంలోని కరోనా ఆసుపత్రి వైద్యులు మరోసారి వార్తల్లో నిలిచారు. సిల్చార్ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల బృందం పాటలు ,డాన్స్‌లతో కరోనా బాధితులను ఉత్సాహ పరిచేందుకు ప్రయత్నించిన తీరు పలువురు ప్రశంసలందుకుంటోంది. వీరితోపాటు కరోనాకు చికిత్స పొందుతున్నవారు కూడా కలిసి నృత్యం చేయడం విశేషంగా నిలిచింది. అంతేకాదు అత్యంత ఒత్తిడికి గురవుతున్న రోగుల కుటుంబ సభ్యులకు భరోసాతో నిస్తున్నారు. పీపీఈ కిట్లలో బెంగాలీ, హిందీ పాటలతోపాటు, జానపద పాటలకు వీరు వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హమ్ హోంగే కామియాబ్తో పాటు, బరాక్ వ్యాలీ ప్రాంతంలో ప్రసిద్ధ జానపద నృత్యం ధమాయిల్ ను కూడా వారు ప్రదర్శించారు. దీంతో వైద్యులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసోం, కాచర్ జిల్లాలోని సిల్చార్ ఎస్ఎం దేవ్ సివిల్ హాస్పిటల్ ఆరోగ్య సంరక్షణ నిపుణులు కోవిడ్-19తో బాధపడుతున్న పేషెంట్లను ఉత్సాహపరిచేందుకు నృత్యాలను ఒక సాధనంగా ఉపయోగించు కున్నారు. తద్వారా వారిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు. డాక్టర్ జూరీ శర్మ నాయకత్వంలోని ఈ బృందం పీపీఈ సూట్లలో రోగులతో కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు దేశంలో సోమవారం కొత్తగా 1,00,636 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,427 మరణాలు సంభవించాయి. -
మీడియాపై మాల్యా సెటైర్లు
న్యూఢిల్లీ: భారీరుణ ఎగవేతదారుడు పారిశ్రామికవేత్త విజయమాల్యా (61)మళ్లీ ట్విట్టర్ అందుకుని మీడియాపై సెటైర్లు వేశాడు. చాంపియన్స్ ట్రోఫీ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు ఆదివారం హాజరు కావడంపై భారత మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన వ్యంగ్యంగా స్పందించాడు. ఈ మీడియా కవరేజీ అద్భుతమని సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశాడు. తన హాజరు గురించి విస్తృతమైన సంచలనాత్మక మీడియా కవరేజ్ ఇచ్చిందనీ, అయితే భారత క్రికెట్ జట్టును ఉత్సాహపరచేందుకు అన్ని మ్యాచ్‌లకూ హాజరయ్యే ప్లాన్స్‌లో ఉన్నట్టు చెప్పాడు. అంతేకాదు పనిలో పనిగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి ప్లేయర్ అని, వరల్డ్ క్లాస్ కెప్టెన్, వారల్డ్ క్లాస్ లీడరని మాల్యా కితాబిచ్చాడు. బ్రావో కోహ్లీ అంటూ ట్విట్ చేశాడు. కాగా వివిధ బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకుపైగా రూపాయల బాకీ పడ్డ లిక్కర్ కింగ్ మాల్యా బ్రిటన్‌కు చెక్కేశాడు. సిబిఐ రెండు కేసులను నమోదు చేసింది. అటు మాల్యా ను తిరిగి ఇండియాకు రప్పించే చర్యలను కేంద్ర ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో లండన్‌లో బ్రిటిష్ అధికారులు అతణ్ని అరెస్ట్ చేయగా బెయిల్ మీద ఉన్నారు. అయితే మాల్యా ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ సందర్భంగా వీఐపీ లాంజ్‌లో మ్యాచ్‌ను తిలకిస్తున్న వైనంపై మీడియా హైప్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. Wide sensational media coverage on my attendance at the IND v PAK match at Edgbaston. I intend to attend all games to cheer the India team. — Vijay Mallya (@TheVijayMallya) June 6, 2017 World class player World class Captain World class gentleman @imVkohli . Bravo Virat. — Vijay Mallya (@TheVijayMallya) June 6, 2017