chenna kesava reddy
-
ఎవరిని చూసుకుని ఈ జులుం?
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘నువ్వేం చూస్తావు రా.. నన్ను నువ్వేం చేస్తావు.. మళ్లీ చెబుతా విను.. ఇక్కడి నుంచి దెం..ని పోండి’ అంటూ చూపుడు వేలితో హెచ్చరిస్తూ, భీకరమైన గొంతుతో.. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని సీఐ ఇబ్రహీం దుర్భాషలాడుతూ బెదిరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఎవరిని చూసుకుని ఆ సీఐ ఇలా రెచ్చిపోయారంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఖాకీ డ్రస్సు విప్పేసి ‘పచ్చ’ చొక్కా, ప్యాంటు ధరించాలని ప్రజలు సూచిస్తున్నారు. వీధి రౌడీని మరిపిస్తూ మందు బాబులా చిందులేసిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మిగనూరు సోమప్పసర్కిల్లో ఆ పార్టీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. సీఐ ఇబ్రహీంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చెన్నకేశవరెడ్డికి క్షమాపణలు చెప్పాలని ఆయన కుమారుడు ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.సీఐపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేస్తామని చెప్పారు. సీఐ ఇబ్రహీంను సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. అతడిని విధుల నుంచి తప్పించాలన్నారు. ఇబ్రహీంపై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వీడియో వైరల్ఎమ్మిగనూరు నియోజకవర్గం పార్లపల్లిలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సీఐ ఇబ్రహీం.. చెన్నకేవశరెడ్డిని బెదిరించిన తీరు, సీఐ బాడీ లాంగ్వేజ్, దబాయిస్తూ మాట్లాడిన మాటలు, అయినప్పటికీ సహనం కోల్పోకుండా చెన్నకేవశరెడ్డి మాట్లాడిన తీరు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. చెన్నకేశవరెడ్డి వయస్సు 82 ఏళ్లు. తన రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అత్యంత గౌరవంగా గడిపారు. ఏ పార్టీ, ఏ వ్యక్తి అతన్ని అగౌరవ పరిచిన సందర్భం లేదు. అధికారులు, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలను కూడా ఎంతో గౌరవంగా సంభోదిస్తూ ‘అజాత శత్రువుగా, పెద్దాయన’గా గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తిని అరేయ్.. ఒరేయ్.. అంటూ సీఐ బెదిరించడాన్ని జిల్లా వ్యాప్తంగా అంతా తప్పుపడుతున్నారు. చెన్నకేశవరెడ్డి సహనంతో మాట్లాడుతున్నా, అకారణంగా సీఐ రెచ్చిపోయి బెదిరించడం సరికాదని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. ఘటన జరిగిన తీరిదిపార్లపల్లె 38వ నీటి వినియోగదారుల సంఘానికి శనివారం ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వారికి మద్దతుగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి బంధువులు విరూపాక్షిరెడ్డి, బాలిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి స్కూలు లోపలికి వెళ్లారు. వీరికి ఓటు హక్కు కూడా లేదు. వీరు వెళ్లిన తర్వాత గేటుకు తాళం వేశారు. చెన్నకేశవరెడ్డి తన కుటుంబ సభ్యులను పోటీ చేయించేందుకు 8 గంటలకు అక్కడికి వెళ్లారు. 9 – 9.45 గంటల వరకూ నామినేషన్లు. అయితే టీడీపీ మినహా మిగిలిన వారెవ్వరినీ సీఐ ఇబ్రహీం లోపలికి వెళ్లనివ్వలేదు. ‘లోపల టీడీపీ వాళ్లు ఉన్నారు. మమ్మల్ని నామినేషన్ వేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు..’ అని మాజీ ఎమ్మెల్యే అడిగారు. దీనికి సీఐ ఇబ్రహీం వేలితో హెచ్చరిస్తూ, తన చేతిని ప్రైవేటు పార్ట్స్ వైపు చూపిస్తూ.. తీవ్రంగా బెదిరించారు. ‘దెం..ని పోండి’ అని బూతులు మాట్లాడారు. అయినప్పటికీ చెన్నకేశవరెడ్డి ఓర్పుగానే తన వాళ్లను లోపలికి పంపాలని అడిగారు. ఆపై ఇతర పోలీసులు వచ్చి చెన్నకేశవరెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్‌కు దూరంగా ఉన్నా కూడా అక్కడ ఉండకుండా పంపించేశారు. చెన్నకేశవరెడ్డి వర్గీయులను నామినేషన్ కూడా వేయించలేదు. గేటు వేసిన తర్వాత టీడీపీ వ్యక్తులను నిచ్చెనపై నుంచి లోపలికి పంపి ఎన్నికలు ముగించేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వయస్సును కూడా గౌరవించకుండా సీఐ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సీఐ ఓవరాక్షన్.. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసు ప్రవర్తన
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ నోరు పారేసుకున్నారు. ఎన్నిక జరుగుతున్న సచివాలయం దగ్గరికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీవు ఎవరు మాకు చెప్పడానికంటూ మాజీ ఎమ్మెల్యేపై సీఐ దురుసుగా వ్యవహరించారు. పోలీసులు, మాజీ ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అంతా కుట్రమయం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీలో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎన్నికలను రాజకీయాలకతీతంగా నిర్వహించాల్సి ఉండగా సంఘాల్లో కేవలం టీడీపీ మద్దతుదారులు ఉండాలనే లక్ష్యంతో అధికారులను రంగంలోకి దింపింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఎన్నికలు అంతా ఏకపక్షంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 123 నీటి వినియోగదారుల అసోసియేషన్లు, 10 డిస్ట్రిబ్యూటరీ, 2 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, కేసీ కెనాల్, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని మేజర్ చెరువుల కింద భూములు ఉన్న ఆయకట్టుదారుల భాగస్వామ్యంతో నిర్వహించాల్సిన ఎన్నికలకు కూటమి పార్టీ నేతలు రాజకీయ రంగులద్దారు. -
TS: ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్
ఎన్నికల పోలింగ్ అప్డేట్స్: ► మహాబూబ్ నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ► మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్ పర్సంటేజ్.. మధ్యాహ్నం 2:30 గంటల వరకు ( 77.11%), ఇబ్రహీంపట్నం మండలం పోలింగ్ 155 (76.32%), మంచాల మండలం పోలింగ్ 53 (85.48%), యాచారం మండలం పోలింగ్ 65 (77.64%) గా నమోదు అయ్యింది. ►మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పొలింగ్ ఉదయం 10 గంటల వరకు 19.54 శాతం నమోదైంది. ఇక జిల్లాల వారిగా చూస్తే.. మహబూబ్ నగర్ జిల్లా 19.30 శాతం, నాగర్ కర్నూల్ జిల్లా 19.20 శాతం, వనపర్తి జిల్లా 25.69 శాతం, గద్వాల్ జిల్లా 21.78 శాతం, నారాయణపేట్ జిల్లా 20.33 శాతం, రంగారెడ్డి జిల్లా 15.20 శాతం, వికారాబాద్ జిల్లా 16.19 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 17.21 శాతం, హైదరాబాద్ జిల్లా 21.00 శాతం నమోదైంది. హైదరాబాద్–రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 29,720 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 15,472, మహిళలు 14,246, ఇతరులు ఇద్దరు ఓటర్లు ఉన్నారు. 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. టీచర్లు వివిధ ప్రాంతాలకు బదిలీ అవ్వడంతో కొంతమందికి రెండుచోట్ల ఓట్లున్నట్టు అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తడంతో అధికారులు వాటిని తొలగించారు. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోందని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికర పరిస్థితి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లు, బదిలీలు, పదోన్నతులపై ఆశలు సన్నగిల్లిన టీచర్లను సంతృప్తిపర్చడం ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికరంగా మారింది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 2017 ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీపడగా ఈసారి 21 మంది బరిలో ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ మద్దతుతో గెలవగా, ఈసారి పీఆర్టీయూ తెలంగాణ మద్దతుతో పోటీ చేస్తున్నారు. పీఆర్టీయూటీఎస్ ఈసారి గుర్రం చెన్నకేశవరెడ్డిని బరిలోకి దించింది. వీరిద్దరి మధ్య ఓట్ల విభజన ఎలా ఉంటుందనేది కీలకం. తెలంగాణ యూటీఎఫ్ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఏవీఎన్ రెడ్డిని బీజేపీ అనుకూల సంఘాలు బలపరుస్తున్నా యి. సీపీఐ అనుబంధ సంఘం ఎస్టీయూటీఎస్ అభ్యర్థిగా బి.భుజంగరావు, టీపీటీఎఫ్, బీఎస్పీ మద్దతుతో ఆచార్య వినయ్‌బాబు, బీసీటీఏ నుంచి విజయకుమార్ పోటీచేస్తున్నారు. టీయూటీఎఫ్ మద్దతులో మల్లారెడ్డి, జీటీఏ సహకారంతో ప్రభాకర్, లోకల్ కేడర్ జీటీఏ మద్దతుతో రవీందర్ పోటీలో ఉన్నారు. కాటేపల్లి జనార్దన్ రెడ్డికి అప్పట్లో టీఆర్ఎస్ మద్దతు తోడైంది. ఈసారి అధికార పార్టీ తో సంబంధం లేకుండా ప్రచారం నిర్వహించారు. ఆఖరి వరకూ ప్రచారం: ప్రచారంలో అన్ని పక్షాలూ ఉపాధ్యాయ సంఘాలు ఓట్లున్న ప్రతీ స్కూల్, కాలేజీకి వెళ్లాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించాయి. మూడు నెలలుగా అభ్యర్థులు వారి వ్యూహాల్లో మునిగి తేలుతున్నా, ఆఖరి మూడురోజుల్లో మాత్రం పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు డబ్బులు కూడా పంచినట్టు కొందరు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. -
తెలుగమ్మాయిలు హీరోయిన్గా పనికిరారా? అని లయ ఏడ్చేసింది
హీరోయిజానికి ఫ్యాక్షనిజం యాడ్ చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ వీవీ వినాయక్. తొలి సినిమా ఆదితోనే పవర్ఫుల్ హిట్ అందుకున్నాడాయన. ఆ వెంటనే బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. అయితే ఇందులో టబు పాత్రకు సౌందర్యను, దేవయాని పాత్రకు లయను అనుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'టబు పాత్రకు సౌందర్యను అడిగాను. అయితే ఆమె ఓల్డ్ పాత్ర అప్పుడే వద్దని తిరస్కరించింది. టబును అడగ్గానే ఆమె ఒప్పేసుకుంది. దేవయాని పాత్రకు స్వయంవరం హీరోయిన్ లయను అడిగాను. ఆమె వెంటనే కళ్లనీళ్లు పెట్టుకుంది. చెల్లెలి పాత్రకే ఎందుకు అడుగుతారు? తెలుగమ్మాయిలు హీరోయిన్గా పని చేయరా? అని ఏడ్చేసింది. మీ ముఖం అమాయకత్వంగా ఉంది కాబట్టి ఈ రోల్ కోసం అడిగానని చెప్పాను. కానీ ఆమె మాత్రం ఎందుకండీ అలా చూస్తారు? హీరోయిన్గా ఎందుకివ్వరు? అని ప్రశ్నించింది. నేను సారీ చెప్పి వచ్చేశా. తర్వాత దేవయానిని అడగ్గానే ఒప్పుకుంది. సినిమాలో తల్లి, చెల్లెలి పాత్రలు సెలక్ట్ చేసుకోవడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు వినాయక్. చదవండి: నయనతారకు వాంతులు, ఎనీ గుడ్‌న్యూస్ అంటున్న ఫ్యాన్స్! చై టాటూకి, సమంతతో ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా? -
జస్టిస్ చెన్నకేశవరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో గుంటూరు, ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా మూడు వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయవాదిగా, జడ్జిగా పనిచేసిన జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి(96) శు క్రవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కడప జిల్లా తాటిమాకులపల్లిలో 1924, నవంబర్ 3న జన్మించిన చెన్నకేశవరెడ్డి ప్రాథమిక విద్యను పులివెందుల, డిగ్రీని అనంతపురం, లా డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. 1952లో న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన క్రిమినల్ లాలో విశేష పరిజ్ఞానాన్ని సంపాదించారు. 1969లో సీబీఐకి స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేసిన ఆయన 1972లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యా రు. 1984లో ఏపీ చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. 1985లో గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయి 1986లో పదవీ విరమణ చేశారు. ఆయన సికింద్రాబాద్ క్లబ్, కేబీఆర్ వాకింగ్ క్లబ్‌ల్లో సభ్యునిగా వ్యవహరించారు. అలాగే చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన వారిలో అత్యధిక కాలం జీవించిన రికార్డు చెన్నకేశవరెడ్డిది. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఆయన నివాసంలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భౌతిక కాయాన్ని ఆప్తుల కడసారి సందర్శన కోసం ఉంచి, అనంతరం పంజాగుట్ట çశ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ చెన్నకేశవరెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. -
ప్రేమించిన యువతితో గొడవపడి లెక్చరర్ ఆత్మహత్య
హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లగా ప్రేమించిన యువతితో ఇంట్లో గొడవ పడిన ఓ లెక్చరర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జాలాది చెన్నకేశవరెడ్డి (33) మోతీనగర్ అవంతినగర్ తోటలో నివాసం ఉంటూ ఎస్ఆర్నగర్ శ్రీచైతన్య కళాశాలలో లె క్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం భ్యార్య గర్భవతి కావడంతో ప్రసవం కోసం నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. కాగా ఆరు సంవత్సరాల క్రితం చెన్నకేశవరెడ్డి తను పనిచేస్తున్న కళాశాలలో చదువుకునే విద్యార్థినిని ప్రేమించాడు. ప్రస్తుతం ఆమె బీ.టెక్ చదువకుంటుంది. శుక్రవారం రాత్రి ఆ యువతిని ఇంటికి పలిపించుకుని తనతో సరిగా ఉండటం లేదని గొడవకు దిగాడు. ఇద్దరిమధ్య మాటామాట పెరిగి గొడవ పెద్దది అయ్యింది. ఆమె ముందే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని రక్షించే ప్రయత్నంలో ఆమె చేతిరెండు వేళ్లకు గాయాలు అయ్యాయి. అనంతరం విషయాన్ని చెన్నకేశవరెడ్డి సోదరుడికి తెలుపింది. అతను వచ్చి పోలీసులకు ఫిర్యాదుచేశాడు . ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.