Chennai Super Kings captain
-
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
మహేంద్ర సింగ్ ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గ్వైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావడంతో ఈ మార్పు అనివార్యమైంది. గువాహాటిలో గత నెల 30న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రుతురాజ్ మోచేతికి గాయమైంది. అయితే దానికి చికిత్స కొనసాగిస్తూ అతడు మరో రెండు మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. నొప్పి తీవ్రం కావడంతో పరీక్షలు చేయగా మోచేతికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది.కేకేఆర్‌తో మ్యాచ్లోఫలితంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ ధోని (MS Dhoni) కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడు. సొంత మైదానం చెపాక్‌లో జరిగే శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని విధుల్లో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఒకప్పటి సీఎస్కే స్టార్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై జట్టు రాత మారదని అభిప్రాయపడ్డాడు.మీరెలా ముందుకు వెళ్లగలరు?‘‘జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ముందుగా వాటిని సరిచేయాలి. అంతేగానీ ధోనిని తిరిగి కెప్టెన్‌గా చేసినందు వల్ల పరిస్థితులు వాటికవే చక్కబడిపోవు. రుతు లాంటి కీలక బ్యాటర్ స్థానాన్ని ఎవరితో మీరు భర్తీ చేస్తారు? ఈ లోటును ఎలా పూడ్చుకుంటారు?.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఎక్కడి నుంచి తెస్తారు?డెవాన్ కాన్వే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు 69 పరుగులు చేశాడు. ఇక రచిన్ ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో రుతు లాంటి సాలిడ్ బ్యాటర్ లేకుండా మీరెలా ముందుకు వెళ్లగలరు?’’ అని రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో సీఎస్కే యాజమాన్యాన్ని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా గతేడాది సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న ధోని.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించాడు. అయితే, అతడి సారథ్యంలో చెన్నై గొప్పగా రాణించలేకపోతోంది. ఐపీఎల్-2024లో రుతు సేన పద్నాలుగు మ్యాచ్‌లకు ఏడు గెలిచింది. అయితే, ఆర్సీబీతో కీలక మ్యాచ్‌లో ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి బాటపట్టింది.తొమ్మిదో స్థానంలోఇక ఐపీఎల్-2025లోనూ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలిచిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇదిలా ఉంటే.. సీఎస్కే టీమ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ధోని 2008–2023 మధ్య 235 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ‘తలా’ నాయకత్వంలో 5 సార్లు జట్టు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. 2022లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే టోర్నీ మధ్యలో అతడు 8 మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ధోనియే బాధ్యతలు తీసుకున్నాడు. 2024 సీజన్ నుంచి జట్టు సారథ్య బాధ్యతలు రుతురాజ్‌కు అప్పగించారు. అతడి కెప్టెన్సీలో టీమ్ 19 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 8 గెలిచి, 11 ఓడింది. చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!? -
చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. కెప్టెన్ ఎవరంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్లో జట్టు కెప్టెన్ ఎవరనే విషయమై ఫ్రాంచైజీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. వచ్చే సీజన్లో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనినే కొనసాగుతాడని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఆదివారం మరోసారి స్పష్టం చేశాడు. సీఎస్కేను నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనిపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతని సారధ్యంలోనే సీఎస్కే మరోసారి బరిలో నిలువనుందని కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు. కాగా, 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు సీఎస్కే తొలిసారి కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ధోని ఇష్టపూర్వకంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్సీ వరించింది. అయితే జడ్డూ కెప్టెన్సీ భారాన్ని హ్యాండిల్ చేయలేకపోవడంతో యాజమాన్యం తిరిగి ధోనినే జట్టు భారం మోయవలసిందిగా కోరింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధోని మరోసారి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అప్పటికే గత సీజన్లో సీఎస్కేకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి మ్యాచ్‌ల్లో ధోని కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ.. సీఎస్కే తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, కెప్టెన్‌గా సీఎస్కే యాజమాన్యం ధోనినే ప్రకటించినప్పటికీ.. వయసు పైబడిన రిత్యా అతను లీగ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. గత రెండు సీజన్లుగా ఈ విషయమై ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంది. ధోనికి ఇష్టం లేకపోయిన బలవంతంగా అతనిపై కెప్టెన్సీ భారాన్ని మోపుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ధోని ఐదోసారి జట్టును ఛాంపియన్‌గా నిలిపి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌పుల్ కెప్టెన్‌గా కెరీర్ ముగించాలని భావిస్తున్నాడని అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయమై ధోని క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. యువ పేసర్‌కు అనారోగ్యం -
బిర్యాని కోసం హోటల్ మారిన ధోని
హైదరాబాద్: సెలబ్రిటీస్‌కు కోపం వచ్చిన సంతోషం వచ్చిన పట్టలేమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో మరోసారి రుజువైంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కూడా అయిన ధోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు హైదరాబాద్ వచ్చి గ్రాండ్ కాకతీయ హోటల్లో విడిది చేసిన ధోనికి హైదరాబాద్ బిర్యానితో అతిథ్యం ఇప్పించాలని కోరిక కలిగింది. అదే విషయాన్ని ధోనికి తెలిపారు. అందుకు ధోని సానుకూలంగా స్పందించాడు. దాంతో అంబటి రాయుడు ఇంటి నుంచి తయారు చేయించిన బిర్యాని తీసుకుని హోటల్ కు వచ్చాడు. అయితే బయట ఆహారాన్ని అనుమతించమంటూ హోటల్ సిబ్బంది అంబటిరాయుడుకి బల్లగుద్ది మరీ చెప్పారు. ఇదే విషయాన్ని అంబటి రాయుడు... ధోనికి తెలిపాడు. ధోని ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. దీంతో అప్పటికప్పుడు హోటల్ మారుతున్నట్లు ధోని ప్రకటించి... తాజ్ కృష్ణాకు పయనమైయ్యాడు. ధోనిని బీసీసీఐ అధికారులు అనుసరించారు.