Chennai Super Kings franchise
-
PBKS VS CSK: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన శిఖర్ ధవన్
Shikhar Dhawan Eyes On Few IPL Records: ఐపీఎల్ 2022 సీజన్ సెకెండాఫ్ మ్యాచ్‌ల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 25) జరుగనున్న కీలక సమరానికి ముందు పంజాబ్ కింగ్స్ కీ ప్లేయర్ శిఖర్ ధవన్‌ను మూడు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడిన గబ్బర్ నేటి మ్యాచ్‌తో 200 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటాడు. ధవన్‌కు ముందు ధోని (227), దినేష్ కార్తీక్ (221), రోహిత్ శర్మ (220), విరాట్ కోహ్లి (215), రవీంద్ర జడేజా (207), సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (200) మాత్రమే ఈ ఘనతను సాధించారు. 199 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 34.67సగటున 5998 పరుగులు చేసిన ధవన్.. నేటి మ్యాచ్‌లో మరో 2 పరుగులు చేస్తే 6000 పరుగుల క్లబ్లో చేరిన రెండో ఐపీఎల్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ధవన్‌కు ముందు కోహ్లి (6402) మాత్రమే 6000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. సీఎస్కేతో ఇప్పటివరకు 27మ్యాచ్‌లు ఆడిన ధవన్ సెంచరీ, 7 హాఫ్ సెంచరీల సాయంతో 941పరుగులు చేశాడు. ఇవాల్టి మ్యాచ్‌లో అతను మరో 9 పరుగులు చేస్తే సీఎస్కేపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డును (28 మ్యాచ్‌ల్లో 949 పరుగులు) అధిగమిస్తాడు. ఈ మ్యాచ్‌లో ధవన్ మరో 59 పరుగులు సాధించగలిగితే ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై 1000పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ధవన్‌కు ముందు రోహిత్ శర్మ ( కేకేఆర్‌పై 1018 పరుగులు), డేవిడ్ వార్నర్ (పంజాబ్‌పై 1005 పరుగులు) మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ధవన్ నేటి మ్యాచ్‌లో మరో 11 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్లో 9000 పరుగుల మార్కును అందుకున్న మూడో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 11వ బ్యాటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కనున్నాడు. టీ20ల్లో ధవన్‌కు ముందు కోహ్లి (10392 పరుగులు), రోహిత్ శర్మ (10009 పరుగులు) 9000 పరుగుల మార్కును అధిగమించారు. ధవన్ తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 310 మ్యాచ్‌లు ఆడి 8989 పరుగులు చేశాడు. చదవండి: కింగ్స్ ఫైట్‌లో గెలుపెవరిది..? రికార్డులు ఎలా ఉన్నాయంటే..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్-2018; చెన్నైకి భారీ షాక్
ముంబై/చెన్నై: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన తమ జట్టు ఆటను సొంత గడ్డపై ఆస్వాదించే అవకాశాన్ని చైన్నై అభిమానులు కోల్పోయారు. అవును. కావేరీ నదీ జలాల వివాదం నానాటికీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2018 లో భాగంగా చెన్నైలో జరగాల్సిన మిగతా మ్యాచ్‌లను మరో చోట నిర్వహించాలని సీఎస్కే యాజమాన్యం, బీసీసీఐలు నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన వెలువడింది. చైన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లు హైదరాబాద్ లేదా వైజాగ్‌కు తరలించే అవకాశం ఉంది. ఆటగాళ్లపైకి చెప్పులు.. రైలింజన్‌పై కరెట్ షాక్: కావేరీ మేనేజ్మెంట్ బోర్టు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడులోని అన్ని పార్టీలూ గడిచిన రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ ఆందోళనలు జరుగుతున్న క్రమంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ సరికాదనే భావన సర్వత్రా వ్యక్తమైంది. మంగళవారం నాటి చెన్నై-కోల్‌కతా మ్యాచ్‌కు కూడా తీవ్రస్థాయిలో బెదిరింపులు వచ్చాయి. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ మ్యాచ్‌ను నిర్వహించారు. అయినా కూడా చెన్నై ఆటగాళ్లపై ఆందోళనకారులు చెప్పులు, షూ విసిరి నిరసన తెలిపారు. ఇక బుధవారం తమిళ పార్టీలు చేపట్టిన రైల్‌రోకోలో ఓ ఉద్యమకారుడు అనూహ్యరీతిలో గాయపడ్డాడు. రైలింజన్ పైకెక్కి నిరసన తెలుపుతున్న యువకుడు.. హైటెన్షన్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. చేతులెత్తేసిన పోలీసులు.. వెనక్కి తగ్గిన బోర్డు: కావేరీ నిరసనలను పట్టించుకోకుండా పోలీసుల సాయంతో తొలి మ్యాచ్ నిర్వహించిన క్రికెట్ బోర్డుకు బుధవారం నాటికి మద్దతు కరువైంది. ఉద్యమం తీవ్రతరం కావడంతో మున్ముందు జరగబోయే మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని పోలీసు శాఖ చేతులెత్తేసింది. దీంతో పునరాలోచనలోపడ్డ సీఎస్కే యాజమాన్యం, బీసీసీఐలు చివరికి మ్యాచ్‌లను చెన్నై నుంచి తరలించాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం చెన్నైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్ లేదా వైజాగ్‌లలో నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్నా, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. -
పవార్ సలహాతోనే బిడ్ వేశాను
శ్రీనివాసన్ వ్యాఖ్య న్యూఢిల్లీ / చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంలో తనకెలాంటి దురుద్దేశాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ సలహా మేరకే ముందుకెళ్లానని ఆయన తెలిపారు. తననో ప్రైవేట్ వ్యక్తిగా భావించి బిడ్ వేయమని పవార్ అనుమతించారని గుర్తుచేశారు. చెన్నైలో జరిగిన ఐసీసీ ఈవెంట్లో పాల్గొన్న శ్రీని విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఇండియా సిమెంట్స్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని పాత్రపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ధోనిని రాజీనామా చేయాలని అడిగారా? అన్న ప్రశ్నకు శ్రీనివాసన్ స్పందిస్తూ.. ‘నేనెందుకు ధోనిని రాజీనామా చేయమని అడగాలి? ఇండియా సిమెంట్స్‌లో అతడి పాత్ర గురించి మీకెందుకు చెప్పాలి. అలాగే ఫిక్సింగ్ ఉదంతంతో భారత క్రికెట్‌కు వచ్చిన ముప్పేమీ లేదు’ అని తేల్చి చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ విచారణ కోర్టు పరిధిలో ఉండడంతో ఆ విషయంపై తానేమీ మాట్లాడనని చెప్పారు. సుప్రీం విచారణ 8కి వాయిదా జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదికపై సోమవారం మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఐపీఎల్లో బెట్టింగ్‌కు పాల్పడినట్టు తెలిసిన వెంటనే గురునాథ్ మెయ్యప్పన్, రాజ్‌కుంద్రాలపై బీసీసీఐ ఫిర్యాదు చేసిందని శ్రీనివాసన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. అలాగే పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి ముకుల్ ముద్గల్ కమిటీ లేక బాంబే హైకోర్టు కూడా శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని ఆయన గుర్తుచేశారు. శ్రీనిని బోర్డు పదవి నుంచి తొలగించాలనే ఏకైక లక్ష్యం ప్రత్యర్థికి కనిపిస్తోందని వాదించారు. అయితే ఈ విషయంలో నిరూపించుకోవాల్సింది శ్రీనివాసనేనని జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాలతో కూడి బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే అరుణ్ జైట్లీ సూచనల మేరకు ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంపై బీసీసీఐ ప్యానెల్ ఏర్పాటైందని పదేపదే సిబల్ పేర్కొనడంపై కోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టులో లేని వ్యక్తి గురించి, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తి గురించి అదే పనిగా మాట్లాడటం సరికాదని తెలిపింది. శ్రీనివాసన్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే ఈరోజు (సోమవారం) విచారణ జరుగుతుందని పేర్కొంది. విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.