Cherlapalli jail
-
త్వరలోనే సీఎం పాపం పండుతుంది
కుషాయిగూడ: శిశుపాలుడి పాపాల మాదిరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాపాలను ప్రజలు లెక్కబెడుతున్నారని.. తొందరలోనే ఆయన పాపం పండుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ శనివారం చర్లపల్లి జైల్లో ములాఖత్ అయ్యారు.నరేందర్‌రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు ఆవరణలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్న నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారన్నారు. తనలాగే చేయని తప్పునకు ప్రభుత్వం జైల్లో పెట్టిన 30 మంది పేద, గిరిజన, దళిత రైతులకు అండగా ఉండాలని, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని నరేందర్‌రెడ్డి కోరారని కేటీఆర్ తెలిపారు. రైతన్నలకు అండగా కేసీఆర్ ఉన్నారని.. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి సొంతూరులో ఆయన సోదరులు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి తోవ లేకుండా గోడ కట్టడంతో క్షోభతో ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం ఉందని సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకొనేలా ఒత్తిడి తెచ్చిన సీఎం సోదరుడు నుముల గురువారెడ్డి చేస్తున్న అరాచకాన్ని ప్రజలు గమనించాలన్నారు. రేవంత్‌రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. -
జైలు అధికారులపై ఖైదీల దాడి.. చర్లపల్లి జైలులో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : చర్లపల్లి జైల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. కొంతమంది ఖైదీలు తనఖీలకు వచ్చిన జైలు అధికారులపై విచక్షణా రహితంగా దాడి చేయటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముబారక్ కాబిల్ ఇర్ఫాన్ అనే వ్యక్తి రెండు నెలల కిందట ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలుకు వచ్చాడు. జైలు అధికారులు బుధవారం జైల్లోని బ్రహ్మపుత్ర బ్యారక్‌లో తనఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇర్పాన్‌తో పాటు మరి కొందరు ఖైదీలు రాజశేఖర్ అనే వార్డర్‌పై దాడికి దిగారు. అంతే కాకుండా అడ్డువచ్చిన రత్న అనే జైలర్‌పైన, డిప్యూటీ జైలర్ సంజీవ్ రెడ్డిపైనా దాడికి తెగబడ్డారు. దీంతో జైలు అధికారులు ఇర్ఫాన్‌ను సింగిల్ సెల్లో నిర్భందించారు. అయితే ఇర్పాన్ మానసిక పరిస్థితి సరిగాలేకపోవటం వల్లే రాజశేఖర్‌పై దాడికి దిగాడని జైలు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ రాజశేఖర్‌కు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దాడికి దిగిన వారిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. -
చర్లపల్లి జైలుకు ఉగ్రవాదులు
కుషాయిగూడ: నగరంలో పట్టుబడ్డ ఉగ్రవాదులను గురువారం రాత్రి చర్లపల్లి జైల్‌కు తీసుకువచ్చారు. వారిలో అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమోదీ, మహ్మద్ ఇబ్రహిం యజ్దాని, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇలియాస్ యజ్దాని, ముజాఫర్ హుస్సేన్ రిజ్వాన్ అనే ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు జైల్ పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా వారికి కేటాయించిన ఖైదీ నెంబర్లు, బ్యారక్ల వివరాలను చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. -
డబ్బుల కోసం చంపేస్తారు
► దాదాపు పది హత్యలుచేసిన యాదగిరి ► చోరీలు, చైన్ స్నాచింగ్‌లలో దాదారావు సహకారం ► శిక్ష అనుభవిస్తూ 2015లో చర్లపల్లి జైలు నుంచి పరార్ ► బీదర్ సమీపంలో ఆటోడ్రైవర్ హత్య ► పోలీసుల అదుపులో నిందితులు మియాపూర్: ఆటో డ్రైవర్‌ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు, మియాపూర్ సీఐ రమేష్ కొత్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా వెనుకొండ మండలం నూజర్ల గ్రామానికి చెందిన ఏడుకొండలు(35) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి మియాపూర్‌లోని న్యూకాలనీలో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 9న ఏడుకొండలు కనిపించకుండా పోయాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ నమోదైంది. దాదాపు పది హత్యలు.. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల గ్రామానికి చెందిన కుంచెం యాదగిరి(42) దొంగతనాలు, హత్యలకు పాల్పడుతుండేవాడు. దాదాపుగా 10 హత్యలు చేశాడు. యావత్ జీవ కారాగార శిక్ష పడింది. 2015లో చర్లపల్లి జైలునుంచి తప్పించుకున్నాడు. కల్లు కాంపౌడ్లకు వెళ్లి అమాయకులతో స్నేహంగా మాట్లాడి వారితో కలిసి మద్యం తాగి డబ్బులు లాక్కొని చంపేసేవాడు. సిద్దిపేట్లో ముగ్గురిని, చేగుంటలో ముగ్గురిని, తూప్రాన్‌లో ఒక్కరిని, నర్సాపూర్‌లో ఇద్దరిని, మాసాయిపేట్‌లో ఒక్కరిని హత్య చేశాడు. బీదర్ సమీపంలో చంపేశారు.. ఏడుకొండలును మహారాష్ట్ర, ఉద్గిర్కు చెందిన దాదారావుతో కలిసి కర్నాటక రాష్ట్రంలోని బీదర్ సమీపంలో చంపేసి ఆటోను దొంగిలించారు. గతంలో వీరిద్దరిపై కేపీహెచ్‌బీ, మియాపూర్, కూకట్పల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో పది దొంగతనాలు, రెండు చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. శనివారం తెల్లవారు జామున పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హత్య చేసిన స్థలానికి తీసికెళ్లి ఆరా తీయగా అస్తికలు లభ్యమయ్యాయి. వారి వద్ద నుంచి 19 తులాల బంగారం, రెండు ఆటో ట్రాలీలు, రెండు బైకులు, ఓ కలర్ టీవీ, రూ.1.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపైపీడీయాక్ట్నమోదు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డునపడ్డ కుటుంబం... ఏడుకొండలు మృతితో భార్య శివలీల ఇద్దరు కుమారులు వరుణ్ సాయి(6), ధనుష్ రత్నా(3) రోడ్డునపడ్డారు.