cheting
-
రూ. 23,100కే రైల్వే జాబ్!
సాక్షి, హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో రైల్వే ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి, సంప్రదించిన వారితో షైన్.కామ్‌లో రిజిస్టర్ చేయించి, వివిధ చార్జీల పేరుతో రూ. 23,100 వరకు వసూలు చేసి, మోసం చేసే ముఠా సూత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధితుడి ద్వారా నిందితుడిని కోల్‌కతాలో పట్టుకున్న అధికారులు పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అనంతరం కోర్టు అనుమతితో బుధవారం సైబర్ కాప్స్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా చేతిలో దేశ వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మోసపోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యే 20 మంది వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా... మరో 12 మందిని గుర్తించామని, మిగిలిన ఐదుగురి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ⇔ కోల్‌కతా, హుగ్లీలోని చందన్నగర్కు చెందిన హర్ష బర్దన్ మిశ్రా బీసీఏ పూర్తి చేశాడు. ఆపై కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన ఇతగాడు ప్రస్తుతం అక్కడి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ గ్రూప్ అండ్ ఏఎస్ ఇన్ఫోసాల్వ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ⇔ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన బినిత పాల్, రిచ, అనితలను ఉద్యోగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఐదుగురూ కలిసి ఆన్లైన్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక మందిని ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు. ⇔ ఓఎల్ఎక్స్లో రైల్వేతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చే వీరు అందులో తమ ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారు. వీటిని చూసి ఎవరైనా కాల్ చేస్తే.. వారి వివరాలను షైన్.కామ్ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచిస్తున్నారు. ⇔ ఆ తర్వాత రెండు రోజుల్లో నిందితులు బాధితులకు ‘హెచ్ఆర్ రిచ’, ‘హెచ్ఆర్ జాస్మిన్’ పేర్లతో బల్క్ మెసేజ్‌లో పంపుతున్నారు. ఉద్యోగార్థుల్లో అత్యధికులు రైల్వే ఉద్యోగాలే కోరుతుండటంతో ఆ డిపార్ట్మెంట్లో సైట్ సూపరింటెండెంట్ పోస్టులకు అర్హులయ్యారంటూ చెబున్నారు. మరికొందరితో ప్యాంటరీకార్స్లో పోస్టుల పేరు చెప్తున్నారు. ⇔ నెలకు రూ.13,500 నుంచి రూ.15,500 వరకు ప్రారంభ వేతనం ఉంటుందని, ఉద్యోగస్తుడితో పాటు అతడి కుటుంబానికీ రైల్వేలో ఉచిత ప్రయాణం సహా ఇతర సౌకర్యాలు ఉంటాయంటూ నమ్మబలుకుతున్నారు. ఇలా తమ వల్లోపడిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో ప్రాథమికంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ⇔ ఆపై ప్రాసెసింగ్, యూనిఫాం చార్జీల పేర్లు చెప్పి రూ. 23,100 వరకు వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించిన వారు ఎవరైనా ఫోన్లు చేస్తే త్వరలోనే రైల్వే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్, నియామక ఉత్తర్వులు అందుతాయంటూ దాట వేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా పదేపదే కాల్స్ చేసి ఉద్యోగం విషయం ప్రశ్నిస్తే కొత్త కథ అల్లుతున్నారు. ⇔ అయితే 95 శాతం మంది రూ. 23,100 కోల్పోయిన తర్వాత వీరికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం అదనపు మొత్తం చెల్లించడానికి సిద్ధమంటుంటే... వారి నుంచి మరో రూ.6,900 వరకు వసూలు చేసి వారి నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ⇔ ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వాళ్లల్లో అత్యధికులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. నగరానికి చెందిన ముగ్గురు మాత్రం రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించి మోసపోయారు. వీరంతా సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ⇔ వీటిని సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలోని బృందం ప్రధాన నిందితుడు హర్ష కోల్‌కతా సమీపంలోని డమ్‌డమ్‌లో ఉన్నట్లు గుర్తించింది. అక్కడికి వెళ్లే సరికి తన మకాం మార్చేశాడని తేలింది. అయితే అతడు ఓ వ్యక్తితో పదేపదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన స్పెషల్ టీమ్ అతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో తాను కూడా హర్షకు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన కోల్‌కతా వాసినంటూ చెప్పాడు. ⇔ అతగాడికి నరూ రోయ్‌పర ప్రాంతంలో ఓ కార్యాలయం ఉందని చెప్పి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. దీంతో హర్షను అరెస్టు చేసిన అధికారులు అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
సోఫియాను అంటూ హైదరాబాద్ వ్యక్తికి కాల్..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్‌ల పేరుతో అమాయకులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియా, ఘనా తదితర దేశాలకు చెందిన ఎక్‌పాల్‌గడ్‌స్టీమ్, అడ్జల్, కిక్కి కాన్ఫిడెన్స్ దావిద్, పి. క్రోమవోయిబో, ఎజిటర్ డానియల్ కొంత కాలంగా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో మకాం వేసిన వీరు ‘డింగ్ టోన్’ యాప్ ద్వారా అబ్బాయిలతో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన యువకుడికి సోఫియా అమ్మాయి పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మీ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నామని మెసేజ్ పంపారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో లాండ్ అయ్యానని, తన వద్ద 75 వేల విదేశీ కరెన్సీ, గోల్డ్ చైన్, మొబైల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులు ఉన్నాయని, వాటికి సంబందించి కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని చెబుతూ బాధితుడితో డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని మల్కాజిగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు సీపీ తెలిపారు. నిందితుల ఆటకట్టించిన రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్‌లను సీపీ అభినందించారు. -
రా ఏజెంట్.. విడాకులు తీసుకున్న మహిళతో!
సాక్షి, రాజేంద్రనగర్: రా ఏజెంట్‌నని నమ్మించి విడాకులు తీసుకున్న మహిళను పెళ్లి చేసుకొని బంగారు నగలను అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సినిమా ట్విస్ట్‌లను తలపించిన ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఎం.ఆనందవర్ధన్(39)కు వివాహమై ఓ కుమారుడు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం నార్సింగి ఠాణా పరిధిలోని నెక్నాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పరిచయమైంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. తాను కూడా విడాకులు తీసుకున్నట్లు నమ్మించాడు. తాను మాజీ ఆర్మీ అధికారినని.. ప్రస్తుతం రా ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు మోసం చేసి బెంగళూరు చిరునామాతో ఓ ఐడీ కార్డు సృష్టించి ఆమెకు చూపించాడు. విడాకులు తీసుకున్నట్లు నకిలీ కాపీని చూపించి ఆమెను వివాహం చేసుకున్నాడు. చదవండి: స్నానం చేస్తున్న అమ్మాయిల ఫోటోలు తీసి.. అనంతరం మహిళ వద్ద ఉన్న 50 తులాల బంగారాన్ని దొంగలించి ఓ ప్రైవేటు పైనాన్స్ కంపెనీలో రూ. 8 లక్షలు తీసుకొని జల్సాలు చేశాడు. నెలలో 20 రోజులపాటు ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్తున్నానని చెప్పి మొదటి భార్య వద్ద ఉండేవాడు. రా ఏజెంట్‌గా ఉద్యోగం చేస్తుండటంతో ఎక్కడికి వెళ్తున్నాననే వివరాలు సైతం భార్యకు చెప్పవద్దని ఉన్నతాధికారుల వద్ద ప్రమాణం చేశానని చెప్పేవాడు. అయితే, మార్చి నెలలో బీరువాలో భద్రపరిచిన 50 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో సదరు మహిళ ఆనందవర్ధన్ను ప్రశ్నించింది. ఇంట్లో చోరీ జరిగిందని నాటకమాడాడు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానని మహిళ చెప్పగా.. తాను రా ఏజెంట్‌నని, తన ఇంట్లోనే చోరీ జరిగితే దేశ పరువుప్రతిష్టలకు భంగం కలుగుతుందని, తన ఉన్నతాధికారులకు విషయం చెప్పి బెంగళూరులోనే కేసు నమోదు చేయిస్తానని వెళ్లాడు. అక్కడ రా అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నకిలీ పత్రాలు తీసుకొచ్చి ఆమెను నమ్మించాడు. బంగారం రికవరీ విషయాన్ని ప్రశ్నించడంతో సెప్టెంబర్‌లో దొంగ పట్టుబడ్డాడని, అతడి నుంచి అధికారులు రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. డబ్బును ఐసీఐసీఐ బ్యాంకులో జమ చేశారని నకిలీ చెక్కును సృష్టించాడు. చదవండి: వివాహం, విడాకులు రెండూ కష్టమే డబ్బు చేతికి రావాలంటే సమయం పడుతుందంటూ మహిళను నమ్మించాడు. డబ్బు విషయమై రోజురోజుకూ ఒత్తిడి పెరగడంతో తానే బెంగళూరుకు వెళ్లి తీసుకొస్తానని చెప్పి పత్తా లేకుండా పోయాడు. గత నెలలో రా అధికారులమంటూ రెండు ఈ మెయిల్స్‌ను సృష్టించి నెక్నాంపూర్‌లోని మహిళకు సందేశాన్ని పంపాడు. కిడ్నాపర్లు రా ఏజెంట్ అయిన ఆనందవర్ధన్ను కిడ్నాప్ చేసి హతమార్చారని, ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో మృతదేహాన్ని సైతం ఇవ్వలేమంటూ సమాచారం ఇచ్చాడు. హత్యను తాను నమ్మలేనని, మృతదేహాన్ని చూస్తానని ఆమె బదులిచ్చింది. తానే బెంగళూర్‌కు వస్తున్నానని మహిళ మెయిల్ చేయడంతో ఆనందవర్ధన్ రెండు రోజుల క్రితం నేరుగా నెక్నాంపూర్‌లోని ఇంటికి వచ్చేశాడు. అప్పటికే ఆనందవర్ధన్ విడాకులు ఇచ్చానని తెలిపిన మరో మహిళ చిరునామాలో సంప్రదించి విషయం తెలిపింది. తాను మోసపోయినట్లు తెలుసుకున్న మహిళ ఆనందవర్ధన్ రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాపర్లు అపహరించారని, వారి నుంచి తప్పించుకొని వచ్చానంటూ పోలీసులను, మహిళను నమ్మించి ఉడాయించేందుకు మొదట ప్రయత్నించాడు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా జరిగిన విషయాన్ని వెల్లడించాడు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. -
చంద్రబాబు ప్రజలను వంచించారు
ప్రొద్దుటూరు : ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఇన్నాళ్లు తన పబ్బం గడుపుకున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించారని వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో రోడ్ల దిగ్బంధనం కార్యక్రమం చేపట్టారు. గంట పాటు జరిగిన ఈ కార్యక్రమంతో ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు, ఆర్టీపీపీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సోములవారిపల్లె గ్రామ పంచా యతీ వైఎస్సార్సీపీ నాయకుడు శేఖర్ యాదవ్, బంగారురెడ్డి, వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్ శివకుమార్ యాదవ్, పోసా భాస్కర్, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి వెల్లాల భాస్కర్, బూసం రవి, అర్కటవేముల సిద్ధి రమణారెడ్డి, గాదెగూడూరు ఎంపీటీసీ సభ్యుడు ఎర్రి రమణారెడ్డి, తొండలదిన్నె రాజారామిరెడ్డి, చిన్నశెట్టిపల్లె సర్పంచ్ రామకృష్ణ యాదవ్, శంకరాపురం నాగమునిరెడ్డి. 38వ వార్డు ఇన్చార్జి బద్రి రంగారెడ్డి, మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి దాదాపీర్, జ్ఞానా నందం, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున ప్రసాద్, చౌడం రవీంద్ర, ఆర్సీ సుబ్రహ్మణ్యం, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, నాగభూషణం, చెన్నకేశవరెడ్డి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మనోహర్, వార్డు మెంబర్ సుబ్బ రాయుడు, నంద్యాల వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐలు చంద్రశేఖర్, మధుమల్లేశ్వరరెడ్డి తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
టీబీజీకేఎస్‌ది నమ్మకద్రోహం
హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ బెల్లంపల్లి : సింగరేణి కార్మికులను టీబీజీకేఎస్ నమ్మించి మోసం చేసిందని సింగరేణి మైనర్స్, ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్) ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ విమర్శించారు. శుక్రవారం బెల్లంపల్లిలోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంతో నమ్మకంతో కార్మికులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)కు ఓట్లు వేసి గెలిపిస్తే నాలుగేళ్ల కాలంలో ఏ సమస్య పరిష్కరించలేదన్నారు. నమ్మిన కార్మికులను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. కార్మికులకు రెండు పడక గదుల ఇళ్లు, సకల జనుల సమ్మె వేతనం, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ వంటి ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. టీబీజీకేఎస్ అగ్ర నాయకత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్ మాట్లాడటం లేదన్నారు. మరోమారు కార్మికులను మోసం చేయడానికి ఎన్నో డ్రామాలు ఆడుతోందన్నారు. టీబీజీకేఎస్‌కు గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలని ఆ సంఘం నేతలు గనులపైకి రాకుండా కార్మికులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు ప్రతిపక్షంలో ఉండి కార్మిక సమస్యలపై ఏనాడు పోరాడింది లేదన్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం పోరాడకుండా మెడికల్ బోర్డులో అన్‌ఫిట్ కేసులు చేయించి రూ.లక్షలు దండుకున్నారని ఆరోపించారు. వీరిని చూసిన టీబీజీకేఎస్‌లోని రెండు వర్గాల అగ్రనాయకులు కూడా అదే దందాను కొనసాగించి భ్రష్టు పట్టించారన్నారు. వారసత్వ ఉద్యోగాల కల్పన కోసం ఏ ఒక్క సంఘం కూడా చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. కార్మికుల పక్షాన పోరాడిన తనను 324 రోజులు విధుల నుంచి సస్పెండ్ చేశారని, గోదావరిఖనిలో హెచ్ఎంఎస్ కార్యాలయాన్ని కూల్చివేశారన్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు కాలపరిమితి ఈ నెల 6వ తేదీతో పూర్తవుతుందని ఆ తర్వాత యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూడాలని కోరారు. సమావేశంలో సింగరేణి మైనర్స్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ఉపాధ్యక్షుడు టి.మణిరాంసింగ్, కేంద్ర కార్యదర్శి బి.రమణరావు, నాయకులు ఎండీ ఓజీయార్, అబ్దుల్‌ఖాదర్, సంజీవ్, ఎం.సత్యనారాయణ, ఎం.రాజన్న ఉన్నారు. టీబీజీకేఎస్, నమ్మకద్రోహం, హెచ్ఎంఎస్ tbgks,cheting, hms -
వధూవరులు పరార్!
నమ్మించి ...నట్టేట ముంచాడు ► పెళ్లి చేసుకుంటానంటూనే వేరొక యువతితో వివాహం ►విషయం తెలుసుకుని పెళ్లి మండపానికి చేరిన ప్రియురాలు ► ప్రియుని ఇంటి ముందు బైటాయింపు ► ఇరువురూ పోలీసు శాఖకు చెందిన వారే ► అప్పటికే పరారయిన నూతన వధూవరులు ఇద్దరూ పోలీసు శాఖలో పనిచేస్తున్నారు. ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు. కులాలు వేరయినా ఏడడుగులు కలిసి నడుద్దామంటూ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రేమికుడు చివరకు ముఖం చాటేశాడు. ఆమె పోలీసులను ఆశ్రయించగా అరెస్టయి జైలుకు వెళ్లాడు. కేసు నడుస్తోంది. ఇది జరిగి రెండేళ్లయింది. కట్ చేస్తే.. ప్రియుడు ఈ నెల 27న మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంకేముంది.. సదరు మాజీ ప్రియురాలు సరాసరి పెళ్లి మండపానికి బయలుదేరింది. ఇంతలో విషయం లీకవడంతో సదరు వరుడు.. వధువుతో సహా పరారయ్యాడు. సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ సంఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం... జి. సిగడాం: మండలంలోని మధుపాం గ్రామానికి చెందిన శెగళ్ల రాజు పోలీసు శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎచ్చెర్ల కార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి శ్రీకాకుళం పట్టణానికి చెందిన గొంటి వీధిలో నివాసం ఉంటున్న హోంగార్డు కొర్లకోట తులసీ భాయితో రెండేళ్లపాటు ప్రేమయాణం సాగింది. ఇరువురూ వివాహం చేసుకోవాలనుకున్నారు. వివాహం మాటత్తేసరికి రాజు ముఖం చాటేయడంతో 2013లో శ్రీకాకుళం 2వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆరు నెలలు గడువు కావాలని... ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా, రాజు పెద్దల సమక్షంలో సంబంధం కుదుర్చుకుని మరో యువతితో పెళ్లికి సిద్ధపడడంతో తులసీభాయి హతాశురాలైంది. తనను పెళ్లి చేసుకోవడానికి ఆరు నెలల గడువు కావాలన్నాడని, ఇంతలోనే వేరే యువతితో పెళ్లికి సిద్ధమవ్వడంతో తట్టుకోలేక వెంటనే జి.సిగడాం పోలీసులను ఆశ్రయించింది. రాజు తనను శారీరకంగా, మానసికంగా నమ్మించి మోసగిండంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. తర్వాత.. రాజు స్వగ్రామైన మధుపాం గ్రామానికి బయలుదేరింది. విషయం కాస్త ముందుగానే తెలియడంతో రాజు కుటుంబ సభ్యులతో కలిసి వధువుతో సహా పరారయ్యాడు. ప్రియుడి ఇంటిముందు మౌనదీక్ష తనకు న్యాయం జరిగే వరకూ కదిలేదిలేదని తులసీభాయి ప్రియుడు రాజు ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. రాజు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ పరారవ్వడంతో అక్కడై బైటాయించింది. బాధితురాలికి మద్దతుగా జిల్లా డీఆర్డీఏ మహిళా సమాఖ్య సభ్యులు పి. లక్ష్మి. పి. నిర్మల బి. లక్ష్మి లతోపాటు సిబ్బంది రంగంలోకి దిగారు. రాజాం సీఐ శేఖర్‌బాబుతోపాటు జి. సిగడాం పొలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని ఆరాతీశారు. తనకు అన్యాయం చేసిన రాజుపై న్యాయ పొరాటం చేస్తానని లేకపోతే రాజు ఇంటిముందే ప్రాణాలు విడుస్తానని తులసీభాయి సీఐ ముందు రోదిస్తూ చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.