Chevelle - Hyderabad highway
-
అప్పుడు ఎకరం పొలం రూ.60 లక్షలు..! ఇప్పుడు రూ.3 కోట్లు..!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్–త్రిబుల్ ఆర్)తో భూముల ధరలు పెరిగాయి.హైదరాబాద్– చేవెళ్ల హైవే దారికి ఇరువైపులా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం 2 లైన్ల రహదారి కాస్త నాలుగు లైన్లుగా అభివృద్ధి చెందనుండటంతో స్థలాల ధరలు వృద్ధి చెందాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎకరం రూ.40–60 లక్షలు ఉండగా.. ఇప్పుడది రూ.2.5– 3 కోట్లు పలుకుతున్నాయని తెలిపారు. ప్రతి పాదిత 340 కి.మీ.త్రిబుల్ ఆర్ పూడుర్ మండలంలోని చాంగోమూల్ గ్రామంలో ఎన్‌హె చ్–163 వద్ద కలుస్తుంది. తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్‌గల్, శంకర్పల్లి, సంగా రెడ్డి పట్టణాల కలిపే నాలుగు లైన్లతో కూడిన రహదారి త్రిబుల్ ఆర్తో అనుసం ధానమ వుతా యని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రతిపాదించింది. దీంతో ఆయా ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చదవండి: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పనులు షురూ! -
మహానాడుకు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ జాం
తెలుగుదేశం పార్టీ ఘనంగా జరుపుతున్న మహానాడుకు వెళ్లే రహదారులన్ని వాహనాలలో నిండిపోయాయి. ఇంటర్ సప్లీమెంటరీ విద్యార్థులు ఆ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దాంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి మహానాడుకు వెళ్లే వాహనాలును చేవెళ్ల వైపు మళ్లీస్తున్నారు. చేవెళ్ల నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. చేవెళ్ల - హైదరాబాద్ ప్రధాన రహదారిపై దాదాపు 10 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నగర శివారుల్లోని గండిపేట వద్ద మహానాడును రెండు రోజుల పాటు నిర్వహిస్తుంది. ఆ మహానాడులో పాల్గొనేందుకు అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణల నుంచి అధిక సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు హాజరైయ్యారు. దాంతో చేవెళ్ల - హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.