సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్–త్రిబుల్ ఆర్)తో భూముల ధరలు పెరిగాయి.హైదరాబాద్– చేవెళ్ల హైవే దారికి ఇరువైపులా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం 2 లైన్ల రహదారి కాస్త నాలుగు లైన్లుగా అభివృద్ధి చెందనుండటంతో స్థలాల ధరలు వృద్ధి చెందాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఎకరం రూ.40–60 లక్షలు ఉండగా.. ఇప్పుడది రూ.2.5– 3 కోట్లు పలుకుతున్నాయని తెలిపారు. ప్రతి పాదిత 340 కి.మీ.త్రిబుల్ ఆర్ పూడుర్ మండలంలోని చాంగోమూల్ గ్రామంలో ఎన్‌హె చ్–163 వద్ద కలుస్తుంది.
తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్‌గల్, శంకర్‌పల్లి, సంగా రెడ్డి పట్టణాల కలిపే నాలుగు లైన్లతో కూడిన రహదారి త్రిబుల్ ఆర్‌తో అనుసం ధానమ వుతా యని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతిపాదించింది. దీంతో ఆయా ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది.
చదవండి: RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ పనులు షురూ!
Comments
Please login to add a commentAdd a comment