land rates hike
-
ఏపీ ప్రజల నెత్తిన 'భూమి' భారం
-
ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ విలువ అమాంతం పెంచేందుకు సిద్ధమవుతున్న కూటమి సర్కార్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎల్ఆర్ఎస్ రసీదు పోయింది.. ఇప్పుడెలా? అ‘ధనం’ కట్టాల్సిందేనా?
‘మామునూరులో 200 గజాల ఓపెన్ ప్లాట్ ఉన్న వినయ్ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల ప్రకారం అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా భవన నిర్మాణ ఫీజు చెల్లించాలి. కానీ అతడు దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదును పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో తెరుచుకోకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఫీజు చెల్లించాల్సి వస్తోంది’ ‘నర్సంపేటలో ఉండే సిద్ధు్ద తనకున్న 160 గజాల ఓపెన్ ప్లాట్‌లో ఇళ్లు కట్టుకుందామనుకున్నాడు. ఓ లైసెన్స్డ్ సర్వేయర్‌ను సంప్రదించాడు. సేల్‌డీడ్ డాక్యుమెంట్లు, లేఅవుట్ కాపీతో పాటు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదు కావాలని సర్వేయర్ అడిగాడు. అది ఉంటే తప్ప అప్పటి మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజు దాదాపు రూ.20వేల వరకు తగ్గే అవకాశముందని చెప్పాడు. అయితే సిద్ధు ఆ రిసిప్ట్‌ను ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పటికీ.. సాంకేతిక సమస్యలతో దరఖాస్తు తెరుచుకోలేదు. దీంతో అతడికీ అదనంగా డబ్బు చెల్లించడం తప్పలేదు’ సాక్షి, వరంగల్: కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో సొంతిటి కల సాకారం చేసుకునేందుకు సామాన్యులు ముందుకొస్తున్నారు. ఇటీవల పెరిగిన ల్యాండ్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భవన నిర్మాణానికి ఆన్లైన్లో అదనంగా చెల్లించాలి. గతంలో ఎల్ఆర్ఎస్లో నమోదు చేసుకొని ఆ రసీదు పొంది ఉంటే.. ఇంటి పర్మిషన్‌కు కాస్త తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఎల్ఆర్ఎస్లో కట్టిన రసీదును నిర్లక్ష్యం చేశారు. దీనికి తోడు ఆన్‌లైన్‌లోనూ రసీదు లభించకపోవడంతో భవన నిర్మాణదారులకు అదనపు భారం తప్పట్లేదు. తెరుచుకోని సైట్! అక్రమ లే అవుట్లలో ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రెండేళ్లక్రితం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోవడంతో ప్రస్తుతం భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2020కి సంబంధించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రూ.వెయ్యి ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వసూలు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లు, ప్లాట్ల మార్కెట్ విలువను పెంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రుసుం మరింత పెరిగింది. దీనికి తోడు గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి రసీదు కలిగి ఉండి టీఎస్‌బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతి తీసుకుంటే గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే ఫీజు చెల్లించవచ్చు. కానీ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ, నర్సంపేట, వర్ధన్నపేట మునిసిపాలిటీల పరిధిలో చాలా మంది ఆ రిసిప్ట్‌లను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడూ వెబ్సైట్ https://lrs.telangana.gov.in కు వెళ్లి ఫోన్ నంబర్ ఎంట్రీ చేస్తే ఓటీపీతో దరఖాస్తు ఓపెన్ కావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ఓపెన్ అవడం లేదు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రావడం లేదు. దీంతో చాలామంది ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజులు కడుతున్నారు. (చదవండి: పేరుకే ప్రేమ పెళ్లి.. ఆడపిల్లలు పుట్టారని తన్ని తరిమేశారు..) ఇంటి నిర్మాణానికి సన్నద్ధం.. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గడంతో వేలాది మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొని రెండేళ్లుగా ఎదురుచూసిన వేలాది మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎల్ఆర్ఎస్ చెల్లించి అప్పటి రిసిప్ట్ ఉంటే.. గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే భవన నిర్మాణ అనుమతికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలామంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో వివరాలు లభించక 14 శాతం ఎల్ఆర్ఎస్ రుసుంతో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్ సైట్‌ను పునరుద్ధరించాలని, పురపాలక శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భవన నిర్మాణదారులు విన్నవిస్తున్నారు. (చదవండి: బాప్రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్!) -
అప్పుడు ఎకరం పొలం రూ.60 లక్షలు..! ఇప్పుడు రూ.3 కోట్లు..!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్–త్రిబుల్ ఆర్)తో భూముల ధరలు పెరిగాయి.హైదరాబాద్– చేవెళ్ల హైవే దారికి ఇరువైపులా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం 2 లైన్ల రహదారి కాస్త నాలుగు లైన్లుగా అభివృద్ధి చెందనుండటంతో స్థలాల ధరలు వృద్ధి చెందాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎకరం రూ.40–60 లక్షలు ఉండగా.. ఇప్పుడది రూ.2.5– 3 కోట్లు పలుకుతున్నాయని తెలిపారు. ప్రతి పాదిత 340 కి.మీ.త్రిబుల్ ఆర్ పూడుర్ మండలంలోని చాంగోమూల్ గ్రామంలో ఎన్‌హె చ్–163 వద్ద కలుస్తుంది. తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్‌గల్, శంకర్పల్లి, సంగా రెడ్డి పట్టణాల కలిపే నాలుగు లైన్లతో కూడిన రహదారి త్రిబుల్ ఆర్తో అనుసం ధానమ వుతా యని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రతిపాదించింది. దీంతో ఆయా ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చదవండి: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పనులు షురూ! -
తెలంగాణ లో భూముల విలువ పెంపు
-
హైదరాబాద్ రోడ్డులో గజం 10 వేలు.. సాగర్ రోడ్డులో 2 వేలు!
నల్లగొండ : భూముల విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. ఏఏ ప్రాంతంలో ఎంత మొత్తం పెంచాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న విలువలో దాదాపు 40 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అందులో భాగంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం భూముల విలువ ఎంత ఉందనే దానిపై అధికారులు కార్యాలయాల వారీగా నివేదికలు పంపారు. రాష్ట్రంలో భూముల విలువ ఉమ్మడి రాష్ట్రంలో 2013లో పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పెంచలేదు. ప్రస్తుతం భూముల ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా పెరగడంతో ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు సిద్ధమైంది. రోజుకు వెయ్యి రిజిస్ట్రేషన్లు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో రోజూ దాదాపు వెయ్యి వరకు వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. భూములకు సంబంధించి 8 ఏళ్ల క్రితం నాటి ధరలే అమలవుతున్నాయి. దీంతో భూముల విలువను రెట్టింపు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.20 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రభుత్వం రేట్లు 50 శాతం పెంచితే ఆదాయం రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. గతంలో ధరల పెంపు ఇలా.. గతంలో భూముల విలువ పెంపుకోసం జిల్లాస్థాయిలో కమిటీలు ఉండేవి తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్, ఆర్డీఓతోపాటు కలెక్టర్ కూడా ఫైనల్‌గా ధరల పెంపు విషయంలో చర్చించి ఏమేరకు పెంచవచ్చన్నది జిల్లాస్థాయిలోనే నిర్ణయించి రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలు పంపేవారు. ఇందులో ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో భూముల ధరలు ఎలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చార్జీలు ఎంత వసూలు చేస్తున్నాం. అక్కడ పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ మేరకు చార్జీలు పెంచితే బాగుంటుందన్నది జిల్లాస్థాయిలో బిల్డర్లు, రియల్టర్లతో కూడా అధికారులు చర్చించి ధరలపై నిర్ణయం తీసుకునేవారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చార్జీలు.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ ఒక్కో రిజిస్ట్రేషన్ భూమి విలువపై 6శాతం చార్జ్ వసూలు చేస్తుంది. అందులో 4 శాతం స్టాంప్‌డ్యూటీ కాగా, 1.5 ట్రాన్స్ఫర్ చార్జీ, 0.5 రిజిస్ట్రేషన్ రుసుం కింద మొత్తం 6శాతం వసూలు చేస్తోంది. ఈసారి ప్రభుత్వ నిర్ణయమే.. జిల్లాస్థాయిలో ఏఏ ప్రాంతాల్లో ఏమేరకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర చార్జీలు వసూలు చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా నివేదికలు తీసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రస్తుతం గజం రూ.10 వేలు భూమికి విలువ ఉంది. రోడ్డుకు కాస్త లోపల రూ.6 వేలు, దేవరకొండ రోడ్డులో రోడ్డు సైడ్ రూ.3 వేలు ఉండగా రెండో బిట్ రూ.2,500, మిర్యాలగూడ రహదారిలో రోడ్డు సైడ్ బిట్ రూ.10 వేలు ఉండగా, రెండో బిట్ రూ.6 వేలు ఉంది. సాగర్ రోడ్డులో రూ.2 వేలు ఉండగా రెండో బిట్ గజం రూ.1,200 ఉంది. ఈ విలువపై 6 శాతం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర చార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ప్రస్తుతం వీటి ధరలు 40నుంచి 50శాతం వరకు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం కూడా అదేస్థాయిలో పెరగనుంది. ఎంత పెంచుతుందన్నది తెలియదు ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు ఏవిధంగా ఉన్నాయన్నది ప్రభుత్వం అడిగింది. వాటి వివరాలను కార్యాలయాల వారీగా పంపించాం. ధరల పెంపు అన్నది ఈసా రి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎంత ధర పెరుగుతుందన్నది కూడా మాకు తెలియదు. – ప్రవీణ్‌కుమార్, డీఆర్ -
పెరిగిన భూముల విలువ
– జూలై చివరి వారంలో రిజిస్ట్రేషన్ల జోరు – ‘అష్టమి’, సర్వర్ దెబ్బకు చివరి రోజు డీలా అనంతపురం టౌన్: జిల్లాలో పెరిగిన భూముల విలువ అమల్లోకి వచ్చింది. అయితే తొలిరోజు మంగళవారం రిజిస్ట్రేషన్లు నామమాత్రంగా జరిగాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి భూముల విలువ పెరుగుతాయన్న సమాచారంతో చివరి వారంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడగా.. ఆఖరి రోజు సోమవారం మధ్యాహ్నం నుంచి ‘అష్టమి’ దెబ్బకు రిజిస్ర్టేషన్లు అంతగా జరగలేదు. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో నిత్యం 45 నుంచి 50 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ఆగస్టు చివరి వారంలో రోజూ 100 వరకు జరిగాయి. అయితే సోమవారం మాత్రం 60కి తగ్గాయి. ఇదే సమయంలో రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో మాత్రం 100 వరకు జరగడం గమనార్హం. మొత్తంగా చివరి రోజు కన్నా అంతకుముందు ఐదు రోజుల్లో అనంతపురం రిజిస్ట్రార్ పరిధిలోని కార్యాలయాల్లో ఏకంగా 1,200 వరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. హిందూపురం రిజిస్ట్రార్ పరిధిలోని కార్యాలయాల్లో సర్వర్ లోపంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగాయి. 20 శాతం పెరిగిన భూముల విలువ అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలోని 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని భూముల విలువ 20 శాతం వరకు పెరిగింది. మునిసిపాలిటీలు, నగర పంచాయతీలో గరిష్టంగా 20 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 శాతం ఉంది. భూముల విలువ పెరుగుదల మంగళవారం నుంచే ఈ అమల్లోకి వచ్చింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు ఇప్పటికే రాగా జూలైలో మాత్రమే జరిగే రిజిస్ట్రేషన్ల వివరాలను డీఐజీ కార్యాలయ అధికారులు సేకరిస్తున్నారు.