సినారెకు చికాగో సాహితీ మిత్రుల ఘన నివాళి
జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, దివంగత డా.సి. నారాయణ రెడ్డికి చికాగో సాహితీ మిత్రులు సంఘం ఆదివారం ఘన నివాళులు అర్పించింది. సుమారు 60 మంది తెలుగు సాహితీ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మెట్టుపల్లి జయదేవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి సినారె శిష్యురాలు డా.దామరాజు లక్ష్మీని వేదిక మీదకు ఆహ్వానించారు. సినారె గురించి దాదాపు మూడు గంటల పాటు లక్ష్మీ మాట్లాడారు. యస్వీ రామారావు, డా. శింఠి శారదాపూర్ణ, కందాళ రమానాథ్, డా.బొల్లవరం విశ్వనాథరెడ్డి, డా. పుప్పాల శ్యాంమోహన్, కానూరు జగదీష్, డా.రవీంద్రనాథ్ రెడ్డి, చిమట కమల, నందుల మురళి తదితరులు సినారెతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.