chicken cost hike
-
కోడి కొనాలంటే కన్నీళ్లొస్తాయ్!
సాక్షి, సిటీబ్యూరో: చికెన్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. వేసవిలో ధరలు కాస్త తక్కువగా ఉన్నా.. వర్షాకాలం ప్రారంభంతో రికార్డు స్థాయికి చేరాయి. వారం పది రోజుల్లోనే చికెన్ ధర రిటైల్ మార్కెట్లో రూ.180 నుంచి రూ.280కి చేరింది. ఆదివారం హోల్‌సేల్ మార్కెట్లో కిలో చికెన్ రూ.260 నుంచి రూ.280 పలకగా.. రిటైల్ మార్కెట్లో రూ.300 వరకు పలికింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేక.. సాధారణంగా పౌల్ట్రీ రైతులు వేసవిలో కోళ్లను పెంచుతారు. కానీ ఈ మధ్య కరోనా ప్రభావంతో చికెన్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో గ్రేటర్ ప్రజల డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. గత మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రతతో ఆశించిన స్థాయిలో కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరగడానికి కారణమంటున్నారు. మరోవైపు పౌల్ట్రీ రైతులు రానున్న బోనాల సందర్భంగా కోళ్లను ఫాంలలోనే ఉంచి వారం పది రోజుల తర్వాత అమ్మితే మంచి ధర పలుకుతుందని సరఫరా తగ్గించారు. ఇలా సరఫరా తగ్గితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. -
చుక్కల్లో చికెన్ రేటు!
సాక్షి, హైదరాబాద్: కోడి మాంసం ధర కొండెక్కింది. చికెన్ ధరలు బహిరంగ మార్కెట్లో అమాంతం పెరిగింది. కరోనా భయంతో మార్చి, ఏప్రిల్ మాసాల్లో వినియోగం తగ్గడంతో అప్పట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షలు తొలగడంతో ఇప్పుడు జనం చికెన్ తినేందుకు ఎగబడుతున్నారు. చికెన్‌తో కరోనా రాదని, పైగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు పేర్కొనడంతో గ్రేటర్లో వినియోగం రెట్టింపైంది. ఇక డిమాండ్‌కు తగిన కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో 170 రూపాయలు ఉన్న చికెన్ ధర..ఇపుడు 220–230 రూపాయలకు చేరుకుంది. సాధారణ రోజుల్లో గ్రేటర్ వ్యాప్తంగా లక్ష కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. ఆదివారం లక్షన్నర నుంచి రెండు లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయని మార్కెట్ వర్గాల అంచనా. గ్రేటర్ శివారుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కోళ్లకు డిమాండ్ పెరిగిందని, అందుకే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఆదివారం కోడి లైవ్ ధర హోల్‌సేల్ మార్కెట్లో రూ.122 ఉంది. బహిరంగ మార్కెట్లో ధర రూ.132 నుంచి రూ.140 వరకు ఉంది. డ్రెస్డ్ చికెన్ ధర పెద్ద హోల్‌సేల్ మార్కెట్లో రూ.200 వరకు ఉండగా..అదే స్కిన్లెస్ కిలో చికెన్ ధర రూ.220–230 దాటుతుంది. కోళ్ల దిగుమతి తగ్గుతుండడంతో మరో రెండు, మూడు రోజుల్లో కేజీ చికెన్ రూ.250 దాటే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. చదవండి: గ్రేటర్ ఎన్నికల్లో ప్లాన్ మార్చిన అభ్యర్థులు -
కొండెక్కిన కోడి
ధర్మవరంటౌన్ : వారాంతపు సెలవు రోజుల్లో ఇంటిల్లిపాది సరదాగా చికెన్‌తో విందు భోజనం చేసుకుని తృప్తిపడతారు సామాన్య, మధ్య తరగతి ప్రజలు. అయితే ప్రస్తుతం ఆ సరదా కాస్త భారంగా మారింది. రెండింతలు పెరిగిన చికెన్ ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణం, మండలం, తాడిమర్రి, ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లో 300కు పైగా చికెన్« దుకాణాలు ఉన్నాయి. సగటున ఒక్కో దుకాణంలో రోజు వంద నుంచి 500 కేజీల వరకు చికెన్‌ను వ్యాపారులు విక్రయించేవారు. అయితే ఇటీవల వేసవి కాలం రావడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఎండవేడిమికి కోళ్లపారంలో కోళ్లు ఎక్కువ శాతం చనిపోతున్నాయి. రవాణా ఖర్చులు, దాణా, కోళ్లఫారం నిర్వహణ వ్యయం పెరుగుతోంది. దీనికితోడు కార్పొరేట్ కంపెనీలు రంగ ప్రవేశం చేయడం కోళ్ల ఉత్పత్తిని చిన్నపాటి నిర్వాహకులు చేయలేని దుస్థితి రావడంతో వారు నిర్ణయించినదే రేటుగా మారింది. గడచిన మూడు నెలల క్రితం కిలో చికెన్ రూ.120 ఉంటే ప్రస్తుతం రూ.190 గరిష్ట ధరకు చేరింది. వచ్చే నెలలో మరికాస్త ధరలు పెరిగి రూ.200 నుంచి రూ.220ల వరకు అధిక ధర చేరే అవకాశం ఉండటంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. నెల చికెన్ ధర (కేజీ) మార్చి రూ.110 ఏప్రిల్ రూ.125 మే (మొదటివారం) రూ.130 మే (రెండవ వారం) రూ.150 మే (మూడవవారం) రూ.170 ప్రస్తుత ధర రూ.190 అరకిలోతో సరిపెడుతున్నాం ఆదివారం వచ్చిందంటే కిలో చికెన్ కొనుక్కునే వాళ్లం. ప్రస్తుతం ధరలు అధికంగా పెరగడంతో అరకిలోతో సరిపెట్టాల్సి వస్తోంది. పేద, మధ్య తర గతి ప్రజలకు అందుబాటులో ఉండే చికెన్‌ధరలు అమాంతం పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయం. –దస్తగిరి, చిరుఉద్యోగి, ధర్మవరం. కోళ్ల ఉత్పత్తి తగ్గించిన కంపెనీలు ప్రతి ఏడాదీ ఏప్రిల్, మేనెలల్లో పౌల్ట్రీఫారం నిర్వాహకులు ఉన్నపళంగా ఉత్పత్తి తగ్గిస్తారు. అరకొర ఉత్పత్తి చేసిన చోట కోళ్లు ఎండవేడిమితో చనిపోతాయి. దీంతో కోళ్లకు డిమాండ్ ఏర్పడుతుంది. దీనికి తోడు జిల్లాలో కోళ్లఫారాలు అరకొరగా ఉన్నాయి. కేవలం కర్ణాటక నుంచి మాత్రమే అధిక సంఖ్యలో కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దీంతో రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు అధికమవ్వడంతోనే చికెన్‌ధరలు పెరుగుతున్నాయి. మరో నెల రోజుల పాటు చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. – మనోహర్, కోళ్ల వ్యాపారి, ధర్మవరం