Chief Minister Status
-
నేను రె‘ఢీ’
‘అసెంబ్లీకి వచ్చేందుకు నేను రెడీ..ధైర్యముంటే నా కోసం ప్రత్యేకంగా సీటు వేయించు’ అంటూ ముఖ్యమంత్రికి డీఎంకే అధినేత కరుణానిధి సవాల్ విసిరారు. పెద్ద పెద్ద నాయకుల్నే చూశానని, తన గుండె ధైర్యం చూస్తే తట్టుకోలేవని, దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. * ధైర్యముంటే సీటు వేరుుంచు * పన్నీరుకు కరుణ సవాల్ * దిగజారొద్దని హితవు సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి వయోభారంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీతో సిద్ధం చేసిన వీల్ ఛైర్లో కూర్చునే ఆయన ఎక్కడికైనా వెళతారు. అలాంటి కరుణానిధికి అసెంబ్లీలో సమస్య ఎదురైంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక జార్జ్‌కోటను అసెంబ్లీగా ఎంపిక చేసుకుంది. అక్కడ కరుణ వీల్ ఛైర్ వెళ్లే విధంగా ఏర్పాట్లు లేదు. ఆ ఛైర్లో అసెంబ్లీలో కూర్చునేంతగా స్థలం లేదు. ప్రధాన ప్రతిపక్షం డీఎండీకేకు వెనుక డీఎంకే సభ్యులకు సీట్లు కేటాయించారు. తాను అసెంబ్లీకి వచ్చేందుకు ప్రత్యేక సీటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కరుణానిధి కోరారు. అయితే స్పందన లేదు. దీంతో అసెంబ్లీ సమా వేశాలు జరిగేటప్పుడు ఏదో ఒక రోజు వచ్చి సంతకం పెట్టి వెనుదిరగడం కరుణానిధికి పరిపాటిగా మారింది. అయితే పన్నీరు సెల్వాన్ని ఉద్దేశించి కరుణానిధి వ్యాఖ్యలు చేయడం, ఇందుకు దీటుగా పన్నీరు బదులివ్వడం ఇటీవల చోటు చేసుకుంది. ధైర్యముంటే అసెంబ్లీలో అడుగు పెట్టు అని పన్నీరు సెల్వం విసిరిన సవాలును తిప్పికొట్టే విధంగా శుక్రవారం కరుణానిధి స్పందించారు. సీటు వేయించు: అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తాను సిద్ధమని కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తనకు ప్రత్యేక సీటును ముందు వరుసలో వేయించాలని, అందుకు తగ్గ ధైర్యం ఉందా..? అని సీఎం పన్నీరు సెల్వానికి సవాల్ విసిరారు. ప్రజా సమస్యల్ని ఎత్తి చూపే బాధ్యత ప్రతి పక్షానికి ఉందన్నారు. లోపాలను సరిదిద్దుకోవాల్సిన పన్నీరు సెల్వం తనకే నీతులు చెప్పేంతగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హెచ్చరించారు. అసెంబ్లీలో తాను సంధించే ప్రశ్నలకు మహా మహులే సమాధానాలు ఇవ్వలేక తడపడ్డ సందర్భాల ఉన్నాయని, ఇక తమరు ఎంత అని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ మరుసటి రోజు వచ్చి తనకు సమాధానాలు ఇచ్చేవారని, తాను మహామహుల్ని చూశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతతో, హుందాగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలని, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. -
పీఎంకు ‘పన్నీర్’ తొలిలేఖ
జాలర్ల విడుదలకు వినతి చెన్నై, సాక్షి ప్రతినిధి : పీఎంకు లేఖ రాయడం ద్వారా కొత్త సీఎం విధుల్లో నిమగ్నమయ్యూరు. శ్రీలంక చెరలో ఉన్న తమిళనాడు మత్స్యకారుల విడుదలపై జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్‌సెల్వం తొలిసారిగా ప్రధానికి లేఖను రాశారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో శ్రీలంక వివాదం ఒకటి. భారత్ చేతుల్లోని కచ్చదీవులపై హక్కులను శ్రీలంకకు అప్పగించిన నాటి నుంచి అంటే సుమారు మూడు దశాబ్దాలుగా ఈ వివాదం నలుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చున్నా వారి ముందు ఉండే ప్రధాన సమస్య శ్రీలంక దాష్టీకమే. తమ సరిహద్దుల్లోని కచ్చదీవుల్లోకి తమిళ జాలర్ల చేపలవేట సాగిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు తరచూ విరుచుకు పడుతుంటాయి. మత్స్యకారులను, వారి పడవలను వారి దేశానికి తీసుకెళుతుంటారుు. భారతదేశం నుంచి ఒత్తిడి రాగానే విడిచిపెట్టడం, మళ్లీ చెరపట్టడం శ్రీలంకకు పరిపాటి. ఇలా ప్రస్తుతం శ్రీలంక చెరలో ఉన్న 20 మంది జాలర్లను, 75 మరపడవలను విడిపించేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం ప్రధాని నరేంద్రమోడీకి ఉత్తరం రాశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం హోదాల్లో కేంద్రంపై ఒత్తిడి తె స్తూ సాగించిన కృషి ఫలితంగా గతంలో 76 మంది మత్స్యకారుల్లో 72 మందిని మంగళవారం నాడు శ్రీలంక విడుదల చేసిందని తెలిపారు. జాలర్ల విడుదలపై జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అయితే, మత్స్యకారులను విడుదల చేసినా వారి స్వాధీనంలో ఉన్న 71 మరపడవలను మాత్రం అప్పగించలేదని ప్రధాని దృష్టికి సీఎం పన్నీర్‌సెల్వం తన ఉత్తరం ద్వారా తీసుకెళ్లారు. గతనెల 27వ తేదీన రామేశ్వరం నుంచి చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక మళ్లీ చెరపట్టిందని తెలిపారు. జాలర్లందరినీ కాంగేశన్ హార్బర్‌కు తరలించి శ్రీలంక కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 10 వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు చెప్పారు. గత నెల 29న మరో 16 మందిని శ్రీలంక దళాలు అరెస్ట్ చేశాయన్నారు. శ్రీలంక చెరలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయించాలని, అలాగే వారి స్వాధీనంలో ఉన్న మరపడవలను సైతం అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం పన్నీర్‌సెల్వం బుధవారం ప్రధానికి లేఖ రాశారు.